Pawan Kalyan Vs Peddireddy : మీడియాకి మెటీరియల్ ఇవ్వటమేనా..మనం తేల్చేదెం లేదా.. పవన్ కల్యాణ్ ఎందుకిలా..!
రెడ్డి రామచంద్ర రెడ్డి భూములు ఆక్రమించేశారు, అటవీ భూములు అనే విషయాన్ని అటవీ శాఖ మంత్రి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బయట పెట్టారు.

పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి భూములు ఆక్రమించేశారు, అటవీ భూములు అనే విషయాన్ని అటవీ శాఖ మంత్రి, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ బయట పెట్టారు. హెలికాప్టర్ లో వెళ్లి తన ఫోన్‌తో తాను స్వయంగా వీడియో తీస్తూ, తను వీడియో తీస్తున్న దాన్ని ఇంకో వ్యక్తితో వీడియో తీపిస్తూ, రేపు పొద్దున 11 గంటలకు దీన్ని చెప్తాను అని చెప్పి ఓ పెద్ద తతంగంగాన్ని మీడియాకు విడుదల చేశారు. ఏం సాధించారు ఆయన ఏం సాధించదలుచుకున్నారు, ఏం సాధించడం కోసం ఆ వీడియో తీశారు. సినిమానా, రాజకీయమా, పరిపాలనా, ఏం చెప్పదలుచుకున్నారు, దేనికోసం ఒక అటవీ శాఖ మంత్రిగా అటవీ భూమిని ఎవరైనా ఒక వ్యక్తి ఆక్రమించుకున్నప్పుడు, అధికారులను పంపించి సర్వే చేపించి, ఫెన్షింగ్ చేపించి ఈ భూమిని ఆక్రమించాడు అని ప్రజల ముందు పెట్టడానికి సంబంధించిన అవకాశం ఉంటుంది.
విత్ డాక్యమెంట్ హెలికాప్టర్ లో వెళ్లి, పై నుంచి ఒక వీడియో తీసి ప్రజలకు వదిలేస్తే, నువ్వు పని చేసినట్టా, ఏం చేస్తున్నారు, బ్లేమ్ గేమేనా, మీడియాకి విడుదల, మీడియాకి వీడియోలు రిలీజ్ చేస్తే అయిపోతుందా, ముఖ్యమంత్రి పని, మంత్రి చేయాల్సింది, అదేనా ఎక్కడ భూమి ఆక్రమించింది అనే దానికి సంబంధించిన ఆధారాలు పైన హెలికాప్టర్ లో పోయి తీయాలా, తీయొచ్చా, అసలు అట్లా నిబంధనలేనా, ఏం చేశారు మరి ఇంత కాలం. 17 నెలలుగా ఏం చేశారు, ఎందుకు ఆయన పైన కేసులు పెట్టట్లేదు, మీ అటవీ శాఖ అధికారులే కొంత భూమి అయింది, ఉంది, కొంత ఆక్రమణ గురైనట్టు ఆరోపణలు వచ్చాయి, అని ఎందుకు చెప్తున్నారు, మీరేమో మొత్తం ఆక్రమణ ఎందుకు చెప్తున్నారు, మీడియాకి ఒక మెటీరియల్ ఇవ్వడం కోసం, మీరు రాజకీయం చేస్తున్నారా, మీరు ఒక బ్లేమ్ గేమ్ లో భాగంగా, మీడియాకు కొన్ని వీడియోస్ ఇచ్చి, కొంత మెటీరియల్ ఇచ్చేసి, వాళ్ళేదో చేసేసారు, చేసేసారు, చేసేసారు, ఇంక ఇదేనా బాధ్యత కలిగిన మంత్రి చేసే పనా ఇది, గడిచిన ఐదేళ్ళు ఒక బ్లేమ్ గేమ్ తోటి మీరు ముందుకు వచ్చారు.
వాలంటీర్ల గురించి, 30,000 మంది మహిళల అపహరణ గురించి, మిమ్మల్ని హత్య చేయడం కోసం పులివేందల నుంచి వందల సంఖ్యలో గుండాలు మీ ర్యాలీలో తిరుగుతున్నారు అని చెప్పడం గురించి, ఏమైపోయారు ఆ గుండాల గురించి, ఎందుకు పట్టించుకోవట్లేదు, లడ్డు గురించి, లడ్డు కల్తీ గురించి, వీటన్నిటి గురించి ఎందుకు మాట్లాడలేకపోయారు, వీటన్నిటి గురించి బ్లేమ్ గేమ్ కి ఎందుకు పరిమితమయ్యారు, పవన్ కళ్యాణ్ పై నుంచి వీడియో తీశారు, పెద్దిరెడ్డి పెద్దిరెడ్డి భాగవతం అంతా బయట పెట్టింది ఏంటి, భాగవతం బయట పెట్టింది పెద్దరెడ్డి కుటుంబం అది మా భూమి అని చెప్తోంది. పెద్దిరెడ్డి కుటుంబం ఉంది అందులో కొంత భూమి అని మీ అటవి శాఖ అధికారులు చెప్తున్నారు, మీరు వీడియో దేనికి తీసినట్టు మరి, అయినా మంత్రులు వెళ్లి ఎవరు ఎక్కడ అక్రమాలు చేసారో పై నుంచి వీడియో తీసి ప్రజలకు చెప్పడమేనా, ప్రతిపక్షంలో ఉన్నారా, మీరు అధికార పక్షంలో ఉన్నారా, పైగా మీరు కన్సర్న్ మంత్రి, సర్వే చేయించండి వెళ్లి చైర్ వేసుకొని కూర్చోండి, అక్కడ సర్వే జరుగుతున్న సందర్భంలో ఎక్కడెక్కడ ఆక్రమించారో అధికారుల నివేదికని పట్టుకొని ఇదిగో ఇది నివేదిక ఇక్కడ ఆక్రమించారు, ఇంతకాలం నుంచి భూమి వీళ్ల ఆక్రమణలో ఉంది, నేను విడిపించాను అని చెప్పండి. పవన్ కల్యాణ్ ప్రవర్తన పట్ల సీనియర్ జర్నలిస్ట్ 'YNR' విశ్లేషణ..!


