Sugali Preethi Case : సుగాలి ప్రీతి కేసు-పవన్ కల్యాణ్ పస లేని వాదన..!
సుగాలి ప్రీతి కేసు అంశానికి సంబంధించి పవన్ కళ్యాణ్ అనవసరంగా వివాదాల్లోకి వెళ్తున్నారు అనిపిస్తుంది.

సుగాలి ప్రీతి కేసు అంశానికి సంబంధించి పవన్ కళ్యాణ్ అనవసరంగా వివాదాల్లోకి వెళ్తున్నారు అనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ అవగాహన లేకుండా మాట్లాడుతున్నారు అనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ కి గైడ్ చేసే వాళ్ళు ఎవరో, సరిగ్గా గైడ్ చేయట్లేదు అనిపిస్తుంది. పవన్ కళ్యాణ్ మాట్లాడుతున్న మాటల కారణంగా, అనవసరంగా జనసేన పార్టీ ఈ అంశంలో విలన్ గా మారిపోతుంది. ఈ అంశంలో విలన్ గా మారితే, భారతీయ జనతా పార్టీ మారాలి, ఈ అంశంలో విలన్ గా మారితే తెలుగుదేశం పార్టీ మారాలి, కేంద్రంలోని ప్రభుత్వాన్ని భారతీయ జనతా పార్టీ లీడ్ చేస్తుంటే, రాష్ట్రంలో ప్రభుత్వాన్ని తెలుగుదేశం పార్టీ లీడ్ చేస్తుంది, విధానపరమైన నిర్ణయాలలో కీలక పాత్ర ఈ రెండు పార్టీలదే ఉంటుంది. జనసేన పార్టీ గడిచిన ఎన్నికల కంటే ముందు, ఆంధ్రప్రదేష్‌లో సుగాలి ప్రీతికి సంబంధించిన అంశాన్ని టేకప్ చేసింది.
ఆ కుటుంబానికి న్యాయం చేస్తానని చెప్పింది. ఆ బాలిక మృతి వెనక ఉన్న వాళ్ళఎవరో నిందుతుల్ని పట్టుకొని శిక్షిస్తామని చెప్పింది. దానికి బాధ్యత మాదే అని చెప్పింది, మాదే అని చెప్పి కేవలం వదిలేయకుండా దాన్ని ఒక పొలిటికల్ స్లోగన్ గా మార్చింది, దాన్ని ఒక పొలిటికల్ ఇష్యూ గా మార్చింది, దాన్ని పాలిటిక్స్ కోసం ఉపయోగించుకుంది. తెలుగుదేశం పార్టీ కూడా ఆ తర్వాత ఆ ఇష్యూని వాడుకుంటూ వచ్చింది, తెలుగు దేశం పార్టీకి సంబంధించిన నాయకులు కూడా సుగాలి ప్రీతికి వైసీపీ అన్యాయం చేసింది అంటూ మాట్లాడారు, ఎక్కువగా ఈ పర్టికులర్ ఇష్యూలో జనసేన పార్టీ ఓన్ చేసుకొని, జనసేన పార్టీ పోరాటం చేస్తూ వచ్చింది.
పవన్ కళ్యాణ్ నేరుగా కర్నూల్‌కు వెళ్లి అక్కడ ఒక మీటింగ్ పెట్టి, ఆ కుటుంబాన్ని నేను ఆదుకుంటాను, ఈ ప్రభుత్వం పట్టించుకోవట్లేదు అంటూ మాట్లాడారు. ఈ సందర్భంగా నిన్న పవన్ కళ్యాణ్ విశాఖపట్నంలో తమ పార్టీకి సంబంధించిన మూడు రోజులు సమావేశాలు ప్రారంభమైన సందర్భంగా, ఎమ్మెల్యేలు ఎంపీలతో సమావేశం అయినప్పుడు, సుగాలి ప్రీతి అంశానికి సంబంధించి మాట్లాడిన కొన్ని మాటలు, పవన్ కళ్యాణ్ ఇంత డొల్లగా మాట్లాడాడు ఏంటి అనిపించినాయి. పవన్ కళ్యాణ్ ఇలా మాట్లాడకుండా ఉండాల్సింది కదా అనిపించింది. పవన్ కళ్యాణ్ అసలు మాట్లాడకపోయినా పర్వాలేదేమో, ఇలా మాట్లాడి ఇంకా పలచన అయ్యారు అనిపించింది. అసలు పవన్ ఏం మాట్లాడారు.. ఇదే అంశంపై సీనియర్ జర్నలిస్ట్ 'YNR' విశ్లేషణ..
