Pawan Kalyan : నా దారి చంద్రబాబు దారే..! జనసేనాధిపతి పవన్ కల్యాణ్ వైఖరి ఎలా ఉందంటే..!
విశాఖ కేంద్రంగా జనసేన పార్టీ మూడు రోజుల పాటు సమావేశాలు ఏర్పాటు చేసుకుంది.

విశాఖ కేంద్రంగా జనసేన పార్టీ మూడు రోజుల పాటు సమావేశాలు ఏర్పాటు చేసుకుంది. బహిరంగ సభ జరగబోతుంది, సో ఈ మూడు రోజుల సమావేశాల్లో ఏం జరగబోతుంది, అనేది జనసేన కార్యకర్తలు, నాయకులు బయట నుంచి రాజకీయాలను గమనిస్తున్న వాళ్ళంతా భావించింది ఏంటంటే, జనసేన విస్తరణకు సంబంధించిన ఏర్పాట్లు చేసుకుంటుంది, అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలో, మనం ఏం చేశామనేది సమీక్షించుకుంటుంది, అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలో తాము చెప్పిన షణ్ముఖ వ్యూహం అంటూ జనసేన పార్టీ చెప్పిన మాట దానికి సంబంధించిన అమలు కార్యక్రమాలు ఎంతవరకు వచ్చాయి, ఏంటనేది చూసుకుంటుంది, ఎన్నికల కంటే ముందు టిడిపితో సంబంధం లేకుండా జనసేన కొన్ని కొన్ని ప్రాంతాల్లో, కొన్ని కొన్ని అంశాలకు సంబంధించి వాగ్దానాలు చేసింది. వాటిని ఎంతవరకు వచ్చాయి అనేది సమీక్షించుకుంటారని, ఈ కూటమే అధికారంలోకి వచ్చిన తర్వాత, ఆయా నియోజక వర్గాల్లో జనసేన పార్టీకి సంబంధించిన నాయకులు, పార్టీ శ్రేణులు ఎదుర్కొంటున్న సమస్యలు ఏంటి, అధికారంలో ఉండి కూడా పనులు చేయించలేకపోతున్నామనే ఆందోళన కావచ్చు, అధికార పార్టీలో ఉండి కూడా ద్వితీయ శ్రేణి పౌరుల్లా, ద్వితీయ శ్రేణి నాయకులుగా ఉండాల్సిన పరిస్థితి వచ్చింది, వస్తుంది, అంటూ చాలా మంది నాయకులు పడుతున్న బాధని , అధినేత అడ్రెస్ చేస్తారని భావిస్తూ వచ్చారు. దీంతో పాటు జనసేన పార్టీకి సంబంధించిన విస్తరణ ప్లాన్స్ పైన కూడా దృష్టి పెడతారంటూ, జనసేన పార్టీ నాయకత్వం భావించింది. జనరల్ గా రాజకీయాలను గమనిస్తున్న వాళ్ళకి కూడా అనిపించింది అదే. ఒక రాజకీయ పార్టీ తాను ఎదుగుతున్న క్రమంలో, మరింత బలపడాలని కోరుకుంటుంది, మరింత విస్తరించాలని కోరుకుంటుంది మరింతగా ప్రజలకు దగ్గర కావాలని కోరుకుంటుంది, సో దీనికి సంబంధించిన కార్యక్రమాలని చేస్తూ వస్తుంది. తెలుగుదేశం పార్టీ ఇప్పుడు అధికారంలో ఉండి కూడా అధికారంలో ఏం చేశమనేది తమ కార్యకర్తలని, ఇంటింటికి పంపించి, పార్టీకి క్యాడర్ కి ఓటర్ కి, కనెక్షన్ కట్ అవ్వకుండా ఉండడానికి సంబంధించిన ప్రయత్నం చేస్తూ వచ్చింది. సో రాజకీయ పార్టీ, బిహేవియర్ యాక్షన్ ఆ రకంగా ఉంటుంది, బట్ అనుూహ్యంగా ఈ రెండు రోజుల సమావేశాలు, రెండు రోజులు పవన్ కళ్యాణ్ మాట్లాడిన మాటలు మాట్లాడినట్టుగా, బయటిక వచ్చిన లీకులు ఆయన ప్రసంగాలు విన్న తర్వాత నా దారి, విస్తరణ దారి కాదు, నా దారి మీ సమస్యల పరిష్కారం, మీకు గౌరవం, మీకు నాయకత్వం, మీకు పదవులు ఇప్పించడం కాదు, నా దారి బాబుదారే, నా దారి టిడిపి దారే అన్నట్లుగా పవన్ కళ్యాణ్ మాట్లాడినట్టు కనపడుతుంది. ఈ అంశంపై సీనియర్ జర్నలిస్ట్ 'YNR'విశ్లేషణ..!
