TDP MLAS Corruption : ఎమ్మెల్యేలకు పవన్ హెచ్చరిక..!
ఆంధ్రప్రదేష్‌లో కూటమి సర్కార్ ఏర్పడి 17 నెలలు గడిచిన తర్వాత పదే పదే వినపడుతూ వస్తున్న మాట, పదే పదే మన ముఖ్యమంత్రి నుంచి, ఉపముఖ్యమంత్రి నుంచి వింటూ వస్తున్న మాట

ఆంధ్రప్రదేష్‌లో కూటమి సర్కార్ ఏర్పడి 17 నెలలు గడిచిన తర్వాత పదే పదే వినపడుతూ వస్తున్న మాట, పదే పదే మన ముఖ్యమంత్రి నుంచి, ఉపముఖ్యమంత్రి నుంచి వింటూ వస్తున్న మాట, ఎమ్మెల్యేల పనితీరు పైన, మంత్రుల పనితీరు పైన, క్యాబినెట్ సమావేశంలో ముఖ్యమంత్రి అసహనం వ్యక్తం చేయడం లాంటి వార్తలు గతంలో చూశాం. ప్రతిపక్ష పార్టీ పైన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న విమర్శలపైన మంత్రులు సరిగ్గా స్పందించట్లేదు అంటూ ఆయన మాట్లాడడం కూడా చూశాం. ఆ తర్వాత అనేక సందర్భాల్లో ఎమ్మెల్యేల పని తీరుకు సంబంధించి మాట్లాడడం చూశాం.
ఎమ్మెల్యేలు రెచ్చిపోతున్నారు, ఎమ్మెల్యేలు మాఫియాలుగా మారిపోయారు, ఎమ్మెల్యేల కారణంగా ప్రజల్లో తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కుంటున్నాం అంటూ ముఖ్యమంత్రి ఆందోళన వ్యక్తం చేయడం కూడా చూశాం. ఇటీవల పార్టీ కార్యాలయాన్ని ఆయన సందర్శించిన సందర్భంగా, ఎమ్మెల్యేలు కనీసం సిఎంఆర్ఎఫ్ చెక్కుల పంపిణీ కార్యక్రమంలో కూడా పార్టిసిపేట్ చేయట్లేదు, ఎమ్మెల్యేలు పెన్షన్ల పంపిణి కార్యక్రమానికి వెళ్ళడానికి కూడా ఇంట్రెస్ట్ చూపించట్లేదు, ముఖ్యమంత్రిగా తాను వెళ్తున్నాను, అంటూ చెప్తూ వచ్చారు. గతంలో మంత్రులు కూడా దీంట్లో పార్టిసిపేట్ చేయట్లేదంటూ అసహన వ్యక్తం చేసిన తర్వాత, ఆ మంత్రులు ప్రతి నెల మొదటి తారీఖున పెన్షన్ల పంపెణీలో పాల్గొంటున్నారు ఎమ్మెల్యేలు దాన్ని ఎవరూ సీరియస్ గా తీసుకోకపోవడం పట్ల ముఖ్యమంత్రి అసహన వ్యక్తం చేస్తూ వచ్చారు.
ఒక రకంగా ప్రభుత్వ కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేయకపోవడం అనేది ఒక కంప్లైంట్ అయితే, వాళ్ళు నియోజక వర్గాల్లో చేస్తున్న దందాలు, భూదోపిడీలు ఇసుక పేరుతో దోపిడీలు మట్టి పేరుతో దోపిడీలు, భూ వివాదాలు వాళ్లే సృష్టించి పరిష్కారం పేరుతో వేధించటాలు ఇవన్నీ కూడా చూస్తున్నాం. ఇవన్నీ కూడా ప్రభుత్వం దృష్టికి వస్తూఉన్నాయి. కేవలం ప్రకటనలు మాత్రమే ముఖ్యమంత్రి సీరియస్, ముఖ్యమంత్రి సీరియస్ అయ్యారు, నోటీసులు ఇస్తారు ఇటువంటి వార్తలు మాత్రమే వస్తున్నాయి, తప్ప ఏ ఒక్క ఎమ్మెల్యే పైన యాక్షన్ తీసుకున్న దాఖలాలు ఇప్పటి వరకు కనపడలేదు. కేవలం మీడియా కోసమో ప్రతిపక్షం ఇంకెవరో అడుగుతారనో మాత్రమే మాటలు మాట్లాడి వదిలేస్తున్నట్టు కనపడుతుంది. తెలుగుదేశం పార్టీని మోస్తున్న పత్రికలు, తెలుగుదేశం పార్టీ కోసం కరపత్రాలుగా పనిచేస్తున్న పత్రికలు కూడా రాస్తున్నాయి. ఎమ్మెల్యేల అవినీతి మించిపోయింది అని మరోవైపు ఎమ్మెల్యేల నుంచి వినపడుతున్న మాట, మేమేనా చేస్తోంది పై నుంచి ఎవరు చేయట్లేదా, మా నియోజక వర్గంలో ఎస్ఐలని, సిఐ లని కూడా విజయవాడ నుంచే నియమిస్తున్నారు. మా నియోజకవర్గంలో ఎస్ఐలని, సిఐలు ఎవరు కావాలో కూడా చెప్పుకునే అవకాశం మాకు లేకుండా చేస్తున్నారు, మంత్రులు చేయట్లే,దా ముఖ్యమంత్రి చేయట్లేదా, ఎమ్మెల్యేలు కూడా చాలా సందర్భాల్లో ఓపెన్ గానే మాట్లాడడం కూడా చూస్తున్నాం.ఈ అంశంపై సీనియర్ జర్నలిస్ట్ 'YNR' విశ్లేషణ..!


