ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తున్నారు. కర్నూల్‌కి వస్తున్నారు కర్నూల్‌లో కొన్ని ప్రాజెక్టులని ఆయన ప్రారంభించబోతున్నారు.

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ రేపు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తున్నారు. కర్నూల్‌కి వస్తున్నారు కర్నూల్‌లో కొన్ని ప్రాజెక్టులని ఆయన ప్రారంభించబోతున్నారు. కర్నూలుకు వస్తున్న సందర్భంగా ఒక భారీ సభను ఏర్పాటు చేశారు. సభ ఏంటి అంటే జీఎస్టి తగ్గించారు కాబట్టి, దేశమంతా సంబరాలు చేసుకోవాలి, ఆ సంబరాల్లో భాగంగా ఆంధ్రప్రదేశ్ లో కూడా ఒక సభను ఏర్పాటు చేశారు. మోదీ జీఎస్టి తగ్గించారు కాబట్టి సంబరాలు చేసుకుంటున్నారు, ప్రజలు సంబరాలు చేసుకుంటున్న సందర్భంగా వాళ్ళకి శుభాకాంక్షలు చెప్పడం కోసం మోదీ సభను ఏర్పాటు చేశారు. బాగానే ఉంది ఆంధ్రప్రదేశ్‌లోనూ, కేంద్రంలోనూ ఎన్డీఏ సర్కార్ ఉంది, ఎన్డీఏ సర్కారు కర్నూలు సభని చాలా ప్రతిష్టాత్మకంగా తీసుకొని సభకు ఏర్పాట్లు చేస్తుంది. జన సమీకరణకి ఏర్పాట్లు చేస్తుంది. ఆయన కొన్ని ప్రాజెక్టులు అక్కడ ప్రారంభించబోతోన్నారు అని చెప్తున్నారు. ప్రారంభించబోతున్నారు అంటే ముందు నుంచి స్టార్ట్ అయిన ప్రాజెక్ట్ ఏదో ఇప్పుడు ప్రారంభించబోతున్నారు, కొన్ని సెజల్లో కొత్త కంపెనీలకు కూడా ఆయన శంకు స్థాపన చేయబోతున్నట్లుగా కథనాలు చూశాం. ప్రధాని మోదీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వస్తున్న సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆయన సభకు ఏర్పాట్లు చేయడం సంబరాలు చేసుకోవడం మాత్రమే కాదు, ఆంధ్రప్రదేశ్‌కి రావలసినవి ఏంటివనేది ప్రధానమంత్రి ముందు పెడితే బాగుంటుంది, ప్రధానమంత్రి ముందు ఏం పెట్టాలి, ఆంధ్రప్రదేశ్ ప్రజలకి ఇప్పుడు ఏం కావాలో చెప్పాలి.

ప్రధానమంత్రికి తెలియదా అంటే తెలుసు, మర్చిపోయారు, ఆయనకు ఒకసారి గుర్తు చేయాలి, ఏం తెలుసు ఆంధ్రప్రదేశ్ కి ప్రత్యేక హోదా కావాలి తిరుపతిలో ఆయన ఇచ్చిన హామీ ఐదు సంవత్సరాలు కాదు, 10 సంవత్సరాలు కావాలి తిరుపతిలో ఆయన మాట్లాడిన మాటలు తల్లిని చంపి బిడ్డను వేరు చేశారు అంటూ ఆయన మాట్లాడిన మాటలు, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధి బాధ్యత నాది అంటూ, ఆయన మాట్లాడిన మాటలు ఇవన్నీ కూడా జస్ట్ ఒకసారి ఆయనకు గుర్తు చేస్తే సరిపోతుంది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా అన్నారు, ఇవ్వలేదు సరే, ఇప్పుడు మేము మిమ్మల్ని అడిగే పరిస్థితిలో లేము, ప్యాకేజ్ అన్నారు, ఇస్తామన్నారు దాన్ని మేము వద్దన్నామా, అప్పుడు కనీసం ఎప్పుడన్నా ప్యాకేజ్ అన్నా ఇవ్వండి సార్, అని ఒకసారి ప్రధాని మోదీకి గుర్తు చేస్తే బాగుంటుంది. ఆంధ్రప్రదేశ్ నాయకత్వం ప్యాకేజీ లేదు, హోదా లేదు రెండు లేకపోతే ఎలా, ఏదో ఒకటయినా ఉండాలి కదా, ఆయన హోదా ఇవ్వను, ప్యాకేజీ ఇస్తాను అన్నారు, అప్పుడు మాకు ప్యాకేజ్ వద్దు, హోదానే కావాలన్నాం. సరే ఇప్పుడు కనీసం ప్యాకేజ్ అయినా అడగండి కదా, కనీసం ప్యాకేజ్ ఒక 10 వేల కోట్ల రూపాయల ప్యాకేజ్ కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కేంద్రం నుంచి తీసుకురాకపోతే ఉపయోగం ఏంటి .

హోదా వస్తే లక్షల కోట్ల రూపాయల బెనిఫిట్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి జరిగేది రాలేదు, హోదాతో సమానమైన ప్యాకేజ్ అన్నారు, రాలేదు, ఓ పది వేల కోట్లు అమరావతి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి ఒక గ్రాంట్ తీసుకురాలేనంత నిస్సహాయ పరిస్థితులో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉండకూడదు. నాయకత్వం కూడా ఉండకూడదు కాబట్టి. పెదవి విప్పి మాకు హోదా ఇవ్వాలి, కావాలి ఇవ్వలేరు కాబట్టి, ప్యాకేజ్ ఇస్తా అన్నారు, అదన్నా ఇవ్వండి లేకపోతే, మాకు మా రాష్ట్రానికి, మరొక ఐదేళ్లో, 10 ఏళ్లో టాక్స్ ఇన్సెంటివ్స్ అన్నా ఇవ్వండి అని అడిగి ఉండాలి. టాక్స్ ఇన్సెంటివ్స్ ఇస్తే మరిన్ని కంపెనీలు వచ్చే అవకాశం ఉంటుంది. మరింత పెట్టుబడులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావడానికి సంబంధించిన అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నాయకత్వం, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని కూటమిలోని జనసేన, తెలుగుదేశం పార్టీలు ప్రధాని నరేంద్ర మోడీని, కర్నూలు ప్రజల సాక్షిగా ఆ విషయం పైన అడిగితే ఆ విషయం గురించి మాట్లాడితే రాష్ట్రానికి రాష్ట్ర ప్రజలకు మేలు చేసినోళ్ళు అవుతారు.ఈ అంశంపై సీనియర్ జర్నలిస్ట్ 'YNR' విశ్లేషణ..

Updated On
ehatv

ehatv

Next Story