Kalyana Lakshmi : తులం బంగారం ఇవ్వలేం.. చేతులెత్తేసిన కాంగ్రెస్..!
కాంగ్రెస్ పార్టీ చేతులు ఎత్తేసింది. తెలంగాణ కాంగ్రెస్ సర్కారు చేతులు ఎత్తేసింది.

కాంగ్రెస్ పార్టీ చేతులు ఎత్తేసింది. తెలంగాణ కాంగ్రెస్ సర్కారు చేతులు ఎత్తేసింది. తెలంగాణ కాంగ్రెస్ సర్కారు చాలా ప్రతిష్టాత్మకంగా ఇచ్చిన తులం బంగారం పథకానికి, మేము అమలు చేయలేము అని చెప్తుంది. 2023 అసెంబ్లీ ఎన్నికల కంటే ముందు షాదీ ముబారక్‌తో పాటు ఆ స్కీమ్‌లో కళ్యాణ లక్ష్మి స్కీమ్ ఉండేటప్పుడు, ఆ స్కీమ్‌లో బంగారం లక్ష రూపాయల నగదుతో పాటు తులం బంగారం కూడా ఇస్తామనే హామీని తెలంగాణ కాంగ్రెస్ ప్రజలకు ఇచ్చింది. అధికారంలోకి వచ్చిన తర్వాత రెండేళ్లు గడుస్తున్నా ఆ హామీని అమలు చేయలేదు. భారతదేశ స్వాతంత్ర చరిత్రలో ఓటుకు బంగారం హామీ ఇచ్చిన రాజకీయ పార్టీ లేదు. నిజానికి ఆ హామీ ఇచ్చిన సందర్భంలోనే నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్ ఛానల్ ద్వారా మాట్లాడాను ఏ పార్టీ కూడా మేము బంగారం ఇస్తాం, మేము గెలిస్తే మాకు ఓటు వేయండి అని అడగలేదు, ఇప్పటి వరకు నాకు తెలిసి ప్రపంచ చరిత్రలో కూడా ఎక్కడ ఏ పార్టీ అడిగి ఉండదు. ఓ జాతీయ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అటువంటి ఒక హామీని ఇచ్చింది. నగదు సాయమో, ఇంకేదో పెట్టుబడి సాయమో, ఇంకేదో ఇంకేదో ఇంకేదో హామీలు ఇవ్వడం చూస్తూ ఉంటాం. ఆకర్షణీయమైన హామీలు ఇవ్వడం చూస్తూ ఉంటాం. కానీ బంగారమే ఇస్తామని హామీ ఇవ్వడం అయితే మనం ఎప్పుడు చూడలే, ఆ హామీ ఇచ్చిన సందర్భంగానే ఇది అమలయ్యేది కాదు, కేవలం ఎన్నికల్లో గెలవడం కోసం మాత్రమే ఇస్తున్న హామీ అని చాలా విమర్శలు వచ్చాయి. ఆ సందర్భంగా కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు చాలా బలంగా, గట్టిగా బల్లాలు అన్ని గుద్ది మరీ చెప్పారు, లేదు ఎట్టి పరిస్థితిలో ఇచ్చి తీరుతాం అంటూ, వీళ్ళు చెప్పడం మాత్రమే కాదు, ఢిల్లీ నుంచి సోనియా గాంధీని, ప్రియాంక గాంధీని, రాహుల్ గాంధీని, అందరినీ తీసుకొచ్చి వాళ్ళతో కూడా చెప్పించారు. వాళ్ళతో ఒక ముద్ర వేయించారు, మేము గ్యారెంటీ, మేము ఇప్పిస్తాం అని చెప్పించారు.
రెండేళ్ళు అవుతుంది ఏంటి అంటే లేదు, ఇవ్వట్లేదు, కారణం ఏంటి ఇప్పటివరకు ప్రభుత్వం చెప్పలేదు, ఎందుకు ఇవ్వట్లేదు, రీజన్ లేదు, ఇక తాజాగా మంత్రి పొన్నం ప్రభాకర్ నిన్న ఒక ఇంటర్వ్యూలో చెప్పారు, బంగారం ధర మేము హామీ ఇచ్చినప్పుడు 50,000 ఉంది, ఇప్పుడు లక్షా 50 వేలు ఉంది ఎక్కడ తెచ్చిస్తామని చెప్తున్నారు. అంటే ఇవ్వలేమని చేతులు ఎత్తేశారు. ఇక బంగారం ధర ఈరోజు ఉన్నట్టు వచ్చే ఐదు సంవత్సరాలు ఉండదు, బంగారం ధర ఈరోజు ఉన్నట్టు రేపటికి కూడా ఉండదు, బంగారం ధర ఈరోజు ఉన్నట్టు ఇంకో గంట గంటన్నర తర్వాత కూడా ఉండకపోవచ్చు, ఇది తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో రాస్తున్న పెద్ద మనుషులకు తెలియదా, ఇది తెలంగాణలో ప్రజలకు ఇటువంటి హామీ ఇస్తున్నప్పుడు, కాంగ్రెస్ నాయకులకు, ముఖ్యమంత్రులు అవుదాం అనుకున్న వాళ్ళకు, ముఖ్యమంత్రులు అయిన వాళ్ళకు తెలియదా, బంగారం ధర పెరుగుతుంది, బంగారం ధర తగ్గదు, మనం ఇప్పుడు హామీ ఇస్తున్నాం, హామీకి సంబంధించి బడ్జెట్ ఇంత అవుతుంది, అది ప్రతి ఏటా ఇంత పెరగొచ్చు అనే ఒక అంచన ఉండాల్సిన అవసరం లేదా, అటువంటి ఆలోచన లేకుండా, అటువంటి అంచనా లేకుండా, ఎలా హామీ ఇచ్చారు మరి, ఏం చేద్దామని హామీ ఇచ్చారు, మోసం చేద్దామని హామీ ఇచ్చారా, ఏంటి అసలు ఒక ప్లాన్, ఒక యాక్షన్ ప్లాన్ అయితే ఉండాలి కదా, ప్రభుత్వానికి కళ్యాణ లక్ష్మి పేరుతో మనం ఒక హామీ ఇచ్చాం, బంగారం ఇస్తా అన్నాం, బంగారం రేటు పెరుగుతుంది, ఏం చేద్దాం, పోనీ బంగారం ఇవ్వలేం, మేము హామీ ఇచ్చిన రోజు బంగారం ధర 50,000 ఉంది, ధర పెరిగింది కాబట్టి ఆ 50,000 ఇస్తాం, ఆ రోజు బంగారం తులం 50,000 ఉంది కాబట్టి, ఆ 50,000 ఇస్తాం, క్షమించండి బంగారం ఇవ్వలేకపోతున్నాం, ఆ రోజు ఉన్న ధర ప్రకారం బంగారం ఎంతఉందో ఆ రేట్ ఇస్తున్నాం, 50,000 రూపాయలు అడిషనల్ గా ఇస్తున్నాం, అదైనా కాస్త యక్సెప్ట్ చేస్తారు జనాలు. కానీ ఏది ఇవ్వకుండా బంగారం రేట్ పెరిగింది కాబట్టి, మేము ఇవ్వలేమని చేతులు దులుపుకుంటే చీటింగ్ గా చూస్తారు దాన్ని, కాంగ్రెస్ సర్కార్ చేసిన చీటింగ్ గా చూస్తారు దాన్ని. లేదు ఆరోజే అధికారంలోకి రాగానే , ఓ 20 టన్నులో, 30 టన్నులో లేదా ఎన్ని టన్నులు అవసరం ఉంటే అన్ని టన్నులు కొని పెట్టాల్సిందే. తక్కువ ధర ఉంది కదా బంగారం, 50,000 ఆరోజుకి, బంగారం తుల బంగారం ఇంటింటికి ఇవ్వడానికి ఇబ్బంది ఉండేది కాదు. బంగారం ఆల్రెడీ మీరు కొనిపెట్టి ఉంటారు కాబట్టి, సో చేతగాని హామీలు, ఆపద మొక్కుల హామీలు, మోసం చేసే హామీలు, కేవలం అధికారమే పరమావధిగా ఇచ్చే హామీలు, రాజకీయ పార్టీలు ఇస్తూ ఉన్నాయి. ప్రజలే అప్రమత్తంగా ఉండాలి, ప్రజలే అప్రమత్తంగా లేకపోతే ఇటువంటి చీటింగ్ కి పదే పదే గురవుతూనే ఉంటారు.
ఈ దేశంలో రాజకీయ పార్టీలు హామీలు ఇచ్చి ప్రజల్ని మోసం చేయడం కొత్త కాదు, చాలా సందర్భాల్లో, చాలా రాజకీయ పార్టీలు అటువంటి హామీలు ఇచ్చి మోసం చేస్తూనే ఉన్నాయి. కానీ కాంగ్రెస్ పార్టీ పెళ్లి చేసుకుంటున్న ఆడబిడ్డలకు బంగారం ఇస్తామని హామీ ఇచ్చి నిలువునా మోసం చేసింది. ఇది ఒక సెంటిమెంట్, పెళ్లి చేసుకుంటున్న ఆడబిడ్డ, బంగారం ఇస్తుందేమో ప్రభుత్వం అని ఎదురు చూస్తే, మేము ఇవ్వలేమని చేతులు ఎత్తేస్తే, అది ఆడబిడ్డని మోసం చేసినట్టు అవుతుంది. పెళ్లి కానుక ఇవ్వకుండా వాళ్ళని చీట్ చేసినట్టు అవుతుంది. అటువంటి పెళ్లి కానుకలు అందుకోవాల్సిన అనేకమంది ఆడబిడ్డల ఆగ్రహానికి కాంగ్రెస్ ప్రభుత్వం గురి కావాల్సి వస్తుంది. భవిష్యత్తులోనైనా రాజకీయ పార్టీలు బాధ్యతతో హామీలు ఇవ్వాలి, బాధ్యతతో హామీలు ఇవ్వకుండా నోటికి వచ్చినట్లు మాట్లాడుతున్న ఇటువంటి రాజకీయ నాయకుల పట్ల ప్రజలు కూడా జాగ్రత్తగా ఉండాల్సిన అవసరం ఉంది.


