మాజీ ఎన్నికల వ్యూహకర్త, జన్‌ సురాజ్‌ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్‌ కిషోర్‌ సంచలన నిర్ణయం తీసుకున్నారు.

మాజీ ఎన్నికల వ్యూహకర్త, జన్‌ సురాజ్‌ పార్టీ వ్యవస్థాపకుడు ప్రశాంత్‌ కిషోర్‌ సంచలన నిర్ణయం తీసుకున్నారు. బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల్లో తాను పోటీ చేయడం లేదంటూ ప్రకటించారు. తాజాగా ఆ పార్టీ తరఫున అభ్యర్థుల రెండో జాబితా విడుదలైన సంగతి తెలిసిందే. అయితే.. అందులోనూ ఆయన పేరు లేదు. తాజాగా ఓ ఇంటర్వ్యూలో తాను బరిలో నిల్చోవడం లేదంటూ స్పష్టత ఇచ్చారు. పోటీకి బదులు తనను సంస్థాగత పనులపై దృష్టిసారించాలని పార్టీ నిర్ణయించింది అని తెలిపారాయన. ఇదిలా ఉంటే.. ఒకవేళ తాను ఎన్నికల్లో గనుక పోటీ చేస్తే తన స్వస్థలం కర్గాహర్‌ లేదంటే రాఘోపూర్‌ నుంచి పోటీ చేస్తానని గతంలో చెప్పారు. రాఘోపూర్‌ ఆర్జేడీ కంచుకోట. వరుసగా రెండుసార్లు ఇక్కడి నుంచి నెగ్గిన ఆర్జేడీ అగ్రనేత తేజస్వి యాదవ్‌.. హ్యాట్రిక్‌పై కన్నేశారు. అయితే.. జన్‌ సురాజ్‌ తరఫున ప్రశాంత్‌ కిషోర్‌ పోటీ చేయబోతున్నారని ప్రచారం నడిచింది. కానీ, జన్‌ సురాజ్‌ రెండో జాబితాలో రాఘోపూర్‌ నుంచి చంచల్‌ సింగ్‌ పేరును ప్రకటించారు. దీంతో ఆ ప్రచారం ఉత్తదేనని తేలిపోయింది.

Updated On
ehatv

ehatv

Next Story