Raghu Rama Krishna Raju : RRRది విమర్శనా.. ప్రశ్ననా..!
RRR రఘురామకృష్ణం రాజు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో బాగా పరిచయమన్న వ్యక్తి.

RRR రఘురామకృష్ణం రాజు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో బాగా పరిచయమన్న వ్యక్తి. గడిచిన ఐదేళ్ళు వైసీపీ ఎంపీగా ఉంటూనే వైసీపి సర్కార్‌పైన పోరుబాటు చేశారయన. రచ్చబండ పేరుతో అప్పటి ప్రభుత్వ వైఫల్యాలను నిత్యం ఎండగడుతూ వచ్చారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాష్ట్రంలో ప్రతిపక్షం కూడా మాట్లాడడానికి భయపడుతున్న రోజుల్లో అప్పటి వైసీపీ సర్కార్‌కు వ్యతిరేకంగా నిత్యం గలమెత్తుతూ వచ్చారు. ఆ కారణంగానే తెలుగుదేశం పార్టీలో ఆయనక ఒక ప్రత్యేకమైన ఫ్యాన్ బేస్ ఏర్పడింది. గడిచిన ఎన్నికల్లో టీడీపీ టికెట్ కూడా ఆయనకు వస్తుందా రాదా అన్న ఆందోళన, ఉత్కంఠ ఉన్న నేపథ్యంలో తెలుగుదేశం పార్టీ(TDP) శ్రేణులు అభిమానుల నుంచి వచ్చిన ఒత్తిడి కారణంగా టీడీపీ అధిష్టానం ఆయనకు టికెట్ కేటాయించక తప్పని పరిస్థితి ఏర్పడింది. తర్వాత ఆయన ఎన్నికల్లో విజయం సాధించారు ఆ తర్వాత మంత్రి పదవి వస్తుందని ఆశించారు. మంత్రి పదవి వస్తుందని ప్రచారం కూడా జరిగింది కానీ మంత్రి పదవి రాలేదు. ఆ తర్వాత టీటీడి చైర్మన్ అన్నారు అది కాదు.. చివరికి డిప్యూటీ స్పీకర్ పదవి దక్కింది ఆయనకి. సో ఆయన ప్రస్తుతం డీప్యూటీ స్పీకర్‌గా ఉన్నారు.. డీప్యూటీ స్పీకర్‌గా ఉన్న రఘురామకృష్ణ రాజు(Raghu Rama Krishna Raju) ఇటీవల చేసిన కొన్ని వ్యాఖ్యలు పొలిటికల్ సర్కిల్స్ లో తీవ్రమైన చర్చకు దారి తీస్తున్నాయి. ఏంటి ఆ వ్యాఖ్యలు అంటే సుపరిపాలన- తొలి అడుగు అంటూ ప్రభుత్వం అధికారికంగా ఇటీవల ఒక కార్యక్రమాన్ని నిర్వహించింది. సుపరిపాలనలో మేము మొదటి అడుగు పూర్తి చేశాము.. మొదటి అడుగు ఏం చేశాం.. మొదటి అడుగు అంటే మొదటి వసంతంలో మొదటి ఏడాది కాలంలో ప్రభుత్వంగా ఏం చేశాం.. సుపరిపాలన(Suparipalana) దిశగా అనేది ప్రజల దగ్గరికి వెళ్లి చెప్పాలి అనేది ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం. దానికి సంబంధించి ఎలా చేయాలి ఏంటి అనే దాని పైన ఒక వర్క్‌షాప్ తరహాలో ఓ కార్యక్రమాన్ని ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఈ కార్యక్రమానికి ప్రభుత్వానికి సంబంధించిన ముఖ్యులకు ప్రజా ప్రతినిధుల అందరికీ ఆహ్వానం అందింది.. అధికారులకు ఆహ్వానం అందింది. సో ఈ కార్యక్రమానికి స్పీకర్ కు డిప్యూటీ స్పీకర్ కు మాత్రం ఆహ్వానం అందలేదు అనేది రఘురామకృష్ణరాజు చెప్తున్నమాట. ఈ సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యేలను చాలా తక్కువగా చూశారు, ఎమ్మెల్యేలను ఆయా కార్పొరేషన్లకు సంబంధించిన డైరెక్టర్లు, చైర్మన్లు కూర్చునే సీట్ల దగ్గర కూర్చోబెట్టారు. సాధారణంగా ఎమ్మెల్యేలకు సంబంధించిన ప్రోటోకాల్ జిల్లాల కలెక్టర్ల కంటే ఐఏఎస్ ఆఫీసర్ల కంటే ఆమాటకు వస్తే చీఫ్ సెక్రెటరీ కంటే కూడా ఎక్కువ. ప్రజా ప్రతినిధిగా ఎమ్మెల్యేకి ఉండే గౌరవం చీఫ్ సెక్రెటరీ కంటే కూడా ఎక్కువగా ఉంటుంది. అటువంటి ఎమ్మెల్యేలను ఓ ప్రభుత్వ కార్యక్రమానికి ప్రభుత్వ కార్యక్రమానికి పిలిచి ప్రభుత్వం కార్పొరేషన్ల డైరెక్టర్లతో పాటు ఒక టేబుల్ వేసి ఆ రౌండ్ టేబుల్ దగ్గర ఎమ్మెల్యేలు కూర్చోండి అని చెప్పటం సరైంది కాదు.. నేను ఆ కార్యక్రమానికి వెళ్లలేదు, బహుశా నేను ఆ కార్యక్రమానికి వెళ్లి ఉంటే గనుక అది చూసి అక్కడి నుంచి వెనక్కి వచ్చేసేవాడిని.. తన నిరసన వ్యక్తం చేసేవాడిని.. అది సరైంది కాదు.. అది ఎమ్మెల్యేలని అవమానించటం లాంటిదే అలా జరిగి ఉండకూడదు అంటూ ఆయన మాట్లాడారు. ఓపెన్ గానే మీడియా ముందే మాట్లాడారు. ఆయన అవుట్ స్పోకెన్‌గా ఉంటారు.. ఏది దాచుకునే తరహా మనిషి కాదు.. బహిరంగంగానే తనకు సంబంధించిన అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ వ్యాఖ్యలను ఎలా చూస్తారు.. ఈ అంశంపై సీనియర్ జర్నలిస్ట్ 'YNR'విశ్లేషణ..!
