Rahul Gandhi : రాహుల్ సవాల్.. దిక్కులు చూస్తున్న ఈసీ..!
ఎన్నికల కమిషన్ పైన రాహుల్ గాంధీ మరికొన్ని సంచలన ఆరోపణలు చేశారు.

ఎన్నికల కమిషన్ పైన రాహుల్ గాంధీ మరికొన్ని సంచలన ఆరోపణలు చేశారు. ఎన్నికల కమిషన్ వ్యవహరిస్తున్న తీరుపైన, ఎన్నికల కమిషన్ ఎన్నికల్ని లోపభూయిష్టంగా నిర్వహిస్తున్న తీరుపైన, అనేక ఆధారాలను ఇప్పటికే బయట పెట్టిన కాంగ్రెస్ పార్టీ అగ్రనేత, తాజాగా మరికొన్ని ఆరోపణలు చేశారు. కర్ణాటక ఎన్నికల సందర్భంగా కాంగ్రెస్ పార్టీకి బలం ఉన్న నియోజక వర్గాల్లో, కాంగ్రెస్ పార్టీకి బలం ఉన్న బూతులలో ఓట్ల తొలగింపు జరిగింది అనేది రాహుల్ గాంధీ చేస్తున్న ఆరోపణ. ఓట్ల తొలగింపు ఓట్ల చోరీ గురించి ఆయన చాలా సందర్భాల్లో మాట్లాడుతున్నారు. ఈరోజు రాహుల్ గాంధీ చెప్పిన కొత్త విషయం ఏంటంటే, ఓట్ల తొలగింపుకు సంబంధించి ఒక ప్రత్యేకమైన సాఫ్ట్వేర్ ని డెవలప్ చేశారు అని, ఒక ప్రత్యేకమైన సాఫ్ట్వేర్ ద్వారా ప్రజల ఓట్లను తొలగించే కుట్ర ఎలక్షన్ కమిషన్ చేసింది. ఇప్పటికే అటువంటి సాఫ్ట్వేర్ ద్వారా ఓట్లు తొలగింపు కూడా జరిగింది అనేది రాహుల్ గాంధీ చెప్తున్న మాట. ఏ సాఫ్ట్వేర్ ద్వారా ఓట్లు తొలగించారు , ఏ రకంగా ఓట్లు తొలగించారు అనే దానికి సంబంధించిన ఆధారాలను కూడా బయట పెట్టారు.
ఓ మహిళా పేరుతో 12 ఓట్లను మహిళకు సంబంధించిన ఐడితో 12 ఓట్లను తొలగించారనే విషయాన్ని, దానికి సంబంధించిన ఆధారాలని రాహుల్ గాంధీ బయట పెట్టారు. ప్రత్యేకమైన సాఫ్ట్వేర్ ద్వారా ఓట్ల తొలగింపు జరుగుతోంది, ఇది ఎలక్షన్ కమిషన్ కు సంబంధం లేని సాఫ్ట్వేర్, బయట వ్యక్తులు ఇన్వాల్వ్ అయి చేస్తున్నారు, అంతేకాకుండా ఓటిపిలు, ఫోన్ నెంబర్లు ఏ ఫోన్ నెంబర్లకైతే, ఓటీపీలు వస్తున్నాయో, ఆ ఫోన్ నెంబర్లు అన్నీ కూడా కర్ణాటక ప్రాంతానికి సంబంధించినవే కావు, కర్ణాటక రాష్ట్రానికి సంబంధించినవే కావు, అటువంటి ఫోన్ నెంబర్లకు ఓటీపీలు పంపి, వాటి ద్వారా ఓట్లను తొలగించే ప్రయత్నం చేశారు, అనేక ఓట్లను తొలగించారు కూడా, కాంగ్రెస్ పార్టీని బలహీనం చేయడం కోసం, ఓ పార్టీకి లబ్ది చేకూర్చడం కోసం, ఎలక్షన్ కమిషన్ పని చేస్తోంది, ఎలక్షన్ కమిషన్ ఆ తరహాలో బిహేవ్ చేస్తుంది, ఇలాంటి ఇంప్రెషన్ కలుగుతోంది, ఓట్ల తొలగింపు జరుగుతున్న తీరును చూస్తే అనేది రాహుల్ గాంధీ చెప్తున్న మాట. కర్ణాటకలోని అలందా నియోజక వర్గానికి సంబంధించిన కొన్ని ఎగ్జాంపుల్స్ ని, అక్కడ 6000 ఓట్ల తొలగింపు ఎలక్షన్ కమిషన్ చేసినట్లుగా కనపడట్లేదు, ప్రైవేట్ వ్యక్తులు చేసినట్లుగా కనబడుతుంది, ఓ ప్రైవేట్ సాఫ్ట్వేర్ ద్వారా చేసినట్లు కనపడుతుంది, దీనికి ఎలక్షన్ కమిషన్ ఏం సమాధానం చెప్తుంది అనేది ఆయన చెప్తున్న మాట.
కేవలం కర్ణాటకలో మాత్రమే కాదు, మధ్యప్రదేశ్లో ,మహారాష్ట్రలో అలాగే హర్యానాలో, అలాగే ఉత్తరప్రదేశ్లో, కూడా ఈ తరహ ఓట్ల తొలగింపు జరిగింది అనేది రాహుల్ చెప్తున్న మాట. ఎలక్షన్ కమిషన్ ఈ మొత్తం వ్యవహారం పైన స్పందించకుండా మౌనం ఎందుకు పాటిస్తుంది, ఎవరెవరు ఓట్లు అయితే తొలగించారో, వాళ్ళకు సంబంధించిన ఐడిలు, ఆ ఓట్ల తొలగింపుకు సంబంధించిన కారణాలు, ఓట్ల తొలగింపు ఎలా జరిగింది అనే దానికి సంబంధించిన వివరాలని ఎందుకు ఎలక్షన్ కమిషన్ దాచి పెడుతుంది, వాటిని బయట పెట్టాల్సిన అవసరం ఉంది, ఏ ఐడిలను తొలగించారు అనే విషయాన్ని, బయట పెట్టడానికి ఎలక్షన్ కమిషన్ కి ఉన్న అభ్యంతరం ఏంటి, బీహార్ ఎన్నికల సందర్భంగా సుప్రీం కోర్టు స్వయంగా చెప్పింది. తొలగించిన వారి ఓట్ల జాబితాని బయట పెట్టండి అని , సో మొత్తం దేశవ్యాప్తంగా అటువంటి జాబితాని బయట పెట్టే ప్రయత్నం ఎందుకు ఎలక్షన్ కమిషన్ చేయట్లేదు అనేది రాహుల్ గాంధీ వేస్తున్న ప్రశ్న. రాహుల్ లేవనెత్తిన అంశాలపై సీనియర్ జర్నలిస్ట్ 'YNR' విశ్లేషణ..
