Election Commission : రాహుల్ ప్రశ్నలకు జవాబేదీ ?
రాహుల్ గాంధీ భారత ప్రతిపక్ష నేత పార్లమెంట్ కేంద్రంగా ఎస్ఐఆర్ పైన జరిగిన చర్చ సందర్భంగా కొన్ని మౌలికమైన ప్రశ్నలని దేశం ముందు భారత ప్రభుత్వం ముందు ఎలక్షన్ కమిషన్ ముందు ఉంచారు

రాహుల్ గాంధీ భారత ప్రతిపక్ష నేత పార్లమెంట్ కేంద్రంగా ఎస్ఐఆర్ పైన జరిగిన చర్చ సందర్భంగా కొన్ని మౌలికమైన ప్రశ్నలని దేశం ముందు భారత ప్రభుత్వం ముందు ఎలక్షన్ కమిషన్ ముందు ఉంచారు భారతదేశంలో ఎన్నికల ప్రక్రియ ప్రహసనంగా మారిపోయింది ఎన్నికల ప్రక్రియ పైన దేశ ప్రజలకు అనేక అనుమానాలు పెరుగుతూ ఉన్న నేపథ్యంలో పార్లమెంట్లో ఎస్ఐఆర్ పైన చర్చ జరుగుతుంది.ఎస్ఐఆర్ పేరుతో కొంతమంది ఓట్లను కావాలని ఎలక్షన్ కమిషన్ తొలగించేస్తోంది అనేకమందికి దేశంలో ఓటు హక్కు లేకుండా చేస్తోంది ఓటు హక్కు పొందడానికి సంబంధించిన నిబంధనలు పెట్టే సందర్భంలో కావచ్చు ఓట్ల తొలగింపు అంశానికి సంబంధించి కావచ్చు ఈ మొత్తం వ్యవస్థని లోప భూయిష్టంగా మార్చింది.
ఓ పార్టీకి లబ్ది చేకూర్చేలా ప్రతిపక్షాలన్నిటికీ నష్టం చేకూర్చేలా ఎలక్షన్ కమిషన్ వ్యవహరిస్తోంది అనేది ప్రతిపక్షాలు చేస్తు చెప్తున్న మాట తాజాగా తమిళనాడులోనూ వెస్ట్ బెంగాల్లోనూ మిగతా 12 రాష్ట్రాల్లోనూ ఎస్ఐఆర్ పేరుతో సవరణలు చేస్తామంటూ ఎలక్షన్ కమిషన్ నిర్ణయం తీసుకునే నేపథ్యంలో అనేక రాజకీయ పార్టీలు కోర్టు కూడా వెళ్లి దీనిపైన పోరాటం చేస్త స్తున్నాయి ప్రతిపక్షాల డిమాండ్ మేరకు పార్లమెంట్లో నిన్న దీనిపైన చర్చ జరిగింది ఈ చర్చ సందర్భంగా రాహుల్ గాంధీ మూడు ప్రధానమైన అంశాలని లేవనెత్తారు మూడు ప్రధానమైన అంశాలకు ఎలక్షన్ కమిషన్ భారత ప్రభుత్వం సమాధానం చెప్పాలి అని ఆయన కోరుతున్నారు ఏంటి ఈ మూడు ప్రధానమైన అంశాలు నిజానికి ఈ అంశాలకు సంబంధించి అనేక సందర్భాల్లో రాహుల్ గాంధీ బయట మాట్లాడుతూ వస్తున్నప్పటికీ పార్లమెంట్ వేదికగా నిర్దిష్టంగా ప్రభుత్వాన్ని ఆన్సర్ చెప్పండి అని అడుగుతున్న ఈ అంశాలకి ప్రభుత్వం నుంచి కనుక ప్రాపర్ ఆన్సర్ వస్తే ఎన్నికల ప్రక్రియ పైన జనాలకు ఉన్న అనేక అనుమానాలు నివృత్తి అవుతాయి .దీనికి ప్రభుత్వం సరైన ఆన్సర్ చెప్తుందో లేదా చూడాలి రాహుల్ గాంధీ లేవరెత్తిన మూడు ప్రధానమైన అంశాలు ఏంటంటే ఒకటి రాహుల్ గాంధీ చెప్తున్నారు దేశంలో ఎన్నికల కమిషనర్ల నియామకం అంశానికి సంబంధించిన ప్యానల్ ఉండేది గతంలో దశాబ్దాలుగా కొనసాగుతూ ఉన్న ప్యానల్ ఆ ప్యానల్ ప్రకారం భారత ప్రధాన న్యాయమూర్తి అలాగే భారత ప్రతిపక్ష నేత ప్రధానమంత్రి వీళ్ళ ముగ్గురితో కూడిన ప్యానల్ ఎలక్షన్ కమిషనర్లని నియామకం చేస్తుంది.
ఎలక్షన్ కమిషనర్లుగా ఎవరు ఉండాలనే అంశం పైన ఒక నిర్ణయం తీసుకుంటుంది దాన్ని ఎన్డీఏ సర్కారు మోదీ నేతృత్వంలో ఇటీవల కాలంలో మార్పులు చేసింది మార్పులు ఏంటి అంటే ఈ ప్యానెల్ నుంచి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తిని తప్పించేసింది సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి బదులు భారత ప్రభుత్వంలోని సీనియర్ మంత్రి ప్యానల్ లోకి వచ్చి చేరారు సో భారతదేశానికి ప్రధానమంత్రిగా ఉన్న వ్యక్తి ఆయన క్యాబినెట్ లోని సీనియర్ మంత్రి ప్రతిపక్ష నేనేత వీళ్ళు ముగ్గురు కలిసి ఎలక్షన్ కమిషనర్ ని నియామకం చేయాలి సో భారత ప్రధానమంత్రికి ఆయన క్యాబినెట్ లోని సీనియర్ మంత్రికి ఒకే అభిప్రాయం ఉంటుంది కాబట్టి ప్రభుత్వం అనుకున్న వాళ్ళు ప్రధాని అనుకున్న వాళ్ళు మాత్రమే ఎన్నికల కమిషనర్ గా నియమించడానికి సంబంధించిన అవకాశం ఏర్పడింది గత కొద్ది రోజులుగా ఎలక్షన్ కమిషనర్ల నియామకం ఆ రకంగానే జరుగుతోంది భారత ప్రధాన న్యాయమూర్తిని తొలగించి ఆ స్థానంలో క్యాబినెట్ లోని సీనియర్ మంత్రిని పెట్టాల్సిన అవసరం ఎందుకు వచ్చింది. అనే ప్రశ్నకు ప్రభుత్వం వైపు నుంచి ప్రాపర్ ఆన్సర్ గనుక దేశానికి చెప్పగలిగితే ఎన్నికల కమిషన్ పైన వస్తున్న అనుమానాలకు చాలా వరకు పరిష్కారం దొరుకుతుంది.ఈ అంశంపై సీనియర్ జర్నలిస్ట్ 'YNR' విశ్లేషణ..!


