హిల్ట్‌ పాలసీ పైన ప్రభుత్వం వెనక్కి తగ్గినట్లు కనపడుతోంది. వెనక్కి తగ్గినట్టుగా హైకోర్టుకి ఆల్మోస్ట్ చెప్పేసింది.

హిల్ట్‌ పాలసీ పైన ప్రభుత్వం వెనక్కి తగ్గినట్లు కనపడుతోంది. వెనక్కి తగ్గినట్టుగా హైకోర్టుకి ఆల్మోస్ట్ చెప్పేసింది. అడ్వకేట్ జనరల్ హైకోర్టులో నిన్న వాదనల సందర్భంగా చెప్పిన మాట హిల్ట్‌ పాలసీ పైన, మేము పాలసీ మాత్రమే తీసుకొచ్చాం, భూములు జోన్ మార్చే వ్యవహారం ఇంకా సమయం పడుతుంది అంటూ ఓపెన్ గా హైకోర్టుకి చెప్పేశారు. పురుషోత్తం రెడ్డి అనే ఒక వ్యక్తి పిటిషన్ వేశారు, కేఏ పాల్‌ కూడా ఈ అంశం పైన పిటిషన్ వేశారు హిల్ట్‌ పాలసీ పేరుతో భూములు ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చే ప్రయత్నం చేస్తున్నారు, ఇది సరైనది కాదు దీనివల్ల హైదరాబాద్ కి సంబంధించిన ఈకో దెబ్బతింటుంది. హైదరాబాద్‌లో ఇంకా పొల్యూషన్ పెరిగిపోతుంది.

హైదరాబాద్‌లో పైగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిసి తీసుకోవాల్సిన నిర్ణయం ఎన్విరాన్మెంటల్ అసెస్మెంట్ జరగాల్సిన పరిస్థితి ఉంటుంది. అదేదీ కూడా జరగకుండానే హిల్ట్‌ పేరుతో ఒక పాలసీని తీసుకొచ్చి భూములన్నీ ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టే ప్రయత్నం తెలంగాణ రాష్ట్ర సర్కార్ చేస్తోంది. దీనిపైన స్టే ఇవ్వండి అంటూ కోర్టుకి వెళ్ళారు. కోర్టు స్టే మాత్రం ఇవ్వలేదు కానీ, అడ్వకేట్ జనరల్ చేసిన వాదనతో కోర్టు ఏకీభవించింది. అడ్వకేట్ జనరల్ చేసిన వాదనని కోర్టు బిలీవ్ చేసింది. నమ్ముతున్నాం మీరు చెప్పిన దాన్ని రికార్డ్ చేసి పెట్టుకుంటున్నాం, రేపు పొద్దున మీరు వేసే అఫిడవిట్ లో కూడా ఇదే విషయం ఉండాల్సిన అవసరం ఉంటుంది. అంటూ కోర్టు అడ్వకేట్ జనరల్ కి చెప్పింది. దీంతో పాటు కేంద్ర ప్రభుత్వానికి రాష్ట్ర ప్రభుత్వానికి కూడా నోటీసులు జారీ చేసింది. నోటీసులు జారీ చేసిన తర్వాత, ఈ అంశంలో అడ్వకేట్ జనరల్ కోర్టుకి చెప్పిన మాట ఇప్పటి వరకు జీఓలో ఉన్న దాని ప్రకారం, ప్రభుత్వం చెప్తున్న దాని ప్రకారం, హిల్ట్ పి పేరుతో ఆ భూములన్నీ ఎవరైతే హోల్డ్ చేస్తున్నారో, కంపెనీలు వాళ్ళకి ఇచ్చేస్తారు, వాళ్ళ అక్కడ స్కూల్లు, హాస్పిటల్స్ లేకపోతే రెసిడెన్షియల్ కాంప్లెక్సలలకు, విల్లాలు, అపార్ట్మెంట్లు ఏవైనా కట్టుకోవచ్చు అలా జోన్ మార్చడానికి సంబంధించిన ఫీస్ కూడా వాళ్ళ పైన ఉండదు.

మార్కెట్ ధరలో, సబ్ రిజిస్టర్ ఆఫీస్ ధరలో 30%కే వాళ్ళకి ఆ భూములు కట్టబెట్టాలని ఆలోచన కూడా ప్రభుత్వం చేసింది. దీన్ని 45 రోజుల్లోనే పూర్తి చేయాలనే ఆలోచన కూడా ప్రభుత్వం చేసింది. మంత్రులు ప్రభుత్వం ఆ మాట చెప్తూ వచ్చాయి కానీ, నిన్న హైకోర్టుకు అడ్వకేట్ జనరల్ చెప్పిన మాట, మేము కాలుష్య కారక పరిశ్రమలన్నిటిని 2013 లో చెప్పిన దాని ప్రకారం ఔటర్ రింగ్ రోడ్ బయటకి తరలించిన తర్వాతనే ఈ భూములకు సంబంధించిన అంశం పైన నిర్ణయం తీసుకుంటాం అనే మాట చెప్పారు. ఇప్పుడున్న వేల పరిశ్రమల్ని, రింగ్ రోడ్ లోపలున్న పరిశ్రమల్ని, రింగ్ రోడ్ బయటకి తరలించాలంటే సంవత్సరాల పాటు సమయం పడుతుంది. ఈ సంవత్సరాల పాటు వీటన్నిటిని తరలించిన తర్వాత మాత్రమే, ఈ భూముల పైన నిర్ణయం తీసుకుంటాం, ఇప్పుడు తీసుకొచ్చింది కేవలం పాలసీ మాత్రమే అనేది హైకోర్టు కి ఆయన చెప్పిన మాట. అడ్వకేట్ జనరల్ హైకోర్టుకి చెప్పిన మాటను బట్టి చూస్తే హిల్ట్‌ పీ అనేది ఇక కోల్డ్ స్టోరేజ్ కి వెళ్ళినట్టే. హిల్ట్ పి పేరుతో ప్రభుత్వం భూములు తీసుకునే అవకాశం ఇక లేనట్టే. ఈ అంశంపై సీనియర్ జర్నలిస్ట్ 'YNR' విశ్లేషణ..!

Updated On
ehatv

ehatv

Next Story