Bankacherla Project : బనకచర్లపై సర్కార్ ఎదురీత..!
బనకచచర్ల ప్రాజెక్టు అంశానికి సంబంధించి తెలంగాణలో కాంగ్రెస్ సర్కారు ఎదురు ఈదుతోందా లాంటి ఒక ఇంప్రెషన్ కనబడుతుంది.

బనకచచర్ల ప్రాజెక్టు అంశానికి సంబంధించి తెలంగాణలో కాంగ్రెస్ సర్కారు ఎదురు ఈదుతోందా లాంటి ఒక ఇంప్రెషన్ కనబడుతుంది. బనకచర్ల ప్రాజెక్టుకు సంబంధించి ప్రతిపాదనల్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి పంపించిన తర్వాత ఆ తెలంగాణ(Telangana) ప్రాంతానికి సంబంధించిన ప్రతిపక్ష పార్టీ, బీఆర్‌ఎస్(BRS) పార్టీ బనకచర్ల తెలంగాణ పాలిట ఒక శాపంగా మారబోతుంది.. తెలంగాణ ప్రయోజనాలకు విరుద్ధంగా ఉంది.. గోదావరి జలాలని తరలించుకుపోయే కుట్ర జరుగుతోంది, రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు స్పందించలేదు అంటూ మాట్లాడింది.
తెలంగాణ ప్రజలు బనకచర్ల పైన మొదటిగా బీఆర్ఎస్ పార్టీ మాట్లాడిన మాటలు మాత్రమే విన్నారు. బీఆర్ఎస్ రెస్పాన్స్ తర్వాతే ప్రభుత్వం వైపు నుంచి రెస్పాన్స్ చూశాం. కచ్చితంగా ఆ తర్వాత ప్రభుత్వం చాలా సీరియస్‌గా యాక్ట్ చేసింది.. కేంద్ర ప్రభుత్వానికి లేఖలు రాసింది, ముఖ్యమంత్రి కూడా మాట్లాడారు. అపెక్స్ కౌన్సిల్ లేకుండా ఏ రకంగా చేస్తారు అంటూ ఆయన మాట్లాడారు. సో కేంద్ర ప్రభుత్వం కిషన్ రెడ్డి(Kishan Reddy) కేంద్ర మంత్రిగా ఉన్నారు దీన్ని అడ్డుకోవాల్సిన అవసరం ఉంది అంటూ ఆయన మాట్లాడడం కూడా చూశాం.
ఆ తర్వాత రకరకాల అభ్యంతరాల నడుమ ఇటీవల పర్యావరణ అనుమతులను మేము ఇప్పుడు ఇవ్వలేము మీరు సీడబ్ల్యూసీ సంబంధించిన అనుమతులు తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. వరద జలాలకు సంబంధించిన అధ్యయనం ఏం చేశారో కూడా దానికి సంబంధించిన డీటెయిల్స్ ఇవ్వాల్సి ఉంటుంది.. ఆ తర్వాతనే పర్యావరణానికి సంబంధించిన అనుమతుల గురించి మా దగ్గరికి రండి అంటూ కేంద్ర ప్రభుత్వ ఏజెన్సీలు చెప్పాయి కాబట్టి ప్రస్తుతానికి బనకచర్ల పైన కేంద్ర ప్రభుత్వం చంద్రబాబు నాయుడు(Chandrababu Naidu) సర్కార్ షాక్ ఇచ్చినట్టుగానే చూడాలి. అయితే ఈ అంశానికి సంబంధించి నిన్న సుదీర్ఘంగా పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఒకటి రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసింది కొంతమంది, కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు నాయకులు అధికార యంత్రంగం అంతా కూడా కూర్చొని అసలు బనకచర్ల పైన ఏం జరుగుతుంది అనే అంశం పైన సుదీర్ఘంగా చర్చించారు. దానికి సంబంధించిన వివరాలను తెలంగాణ ప్రజలకు చెప్పారు ఈ వివరాలను చెబుతున్న సందర్భంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చెబుతున్న మాటలు తెలంగాణ ప్రయోజనాలకు విరుద్ధంగా ఉన్న ఇలాంటి ఒక చర్చ జరుగుతోంది.
ఏంటి ఆ చర్చ అంటే తెలంగాణ రాష్ట్రం బనకచచర్ల ప్రాజెక్ట్ (Bankacherla Project)ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh)రాష్ట్రం కడుతుంటే దానిపైన పోరాటం చేస్తోంది. ఆంధ్రప్రదేశ్ బనకచచర్లను ఏ రకంగా కడతారు మాకు తెలియకుండా మా రాష్ట్ర ప్రయోజనాలకు విరుద్ధంగా ఎలా ఆంధ్రప్రదేశ్ బనకచర్లని కడుతుంది అని. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రశ్నిస్తున్నట్టుగా ఎక్కడ కనపడలే మొత్తం ఎంటైర్ ఎపిసోడ్ లో కార్యక్రమం అంతా ముఖ్యమంత్రి, మిగతా వాళ్ళు మాట్లాడిన మాటలన్నీ చూసిన తర్వాత అర్థమైంది ఏంటి అంటే బిఆర్ఎస్ పార్టీ ఎలా ప్రశ్నిస్తుంది, బిఆర్ఎస్ పార్టీ ఎందుకు ప్రశ్నిస్తుంది అని అడిగినట్టు ఉంది.ఈ అంశంపై సీనియర్ జర్నలిస్ట్ 'YNR' విశ్లేషణ..
