సత్యసాయిబాబా 100వ జయంతి ఉత్సవాలను తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలనుకుంటుంది.

సత్యసాయిబాబా 100వ జయంతి ఉత్సవాలను తెలంగాణ ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాలనుకుంటుంది. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిన్న చేసిన ప్రకటన, తెలంగాణలో ఆయన బర్త్ డేని అఫీషియల్‌గా సెలబ్రేట్ చేయబోతున్నామని చెప్తున్నారు. సత్యసాయిబా జయంతిని తెలంగాణ రాష్ట్రం, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా నిర్వహించాల్సిన అవసరం ఎందుకుంది, సత్యసాయిబాబాని దేవుడిగా కంటే సత్యసాయిబా చేసిన సేవల కారణంగా ఆయన్ని గౌరవిద్దాం, ఓ గురువుగా డెఫినెట్ గా ఆయన్ని గౌరవించొచ్చు. ఓ గురువుగా ప్రజలను మంచి మార్గంలో నడిచేలా చేయడం కోసం ఆయన చేసిన బోధనల్ని స్వీకరిద్దాం, పాటిద్దాం, ఆయన ఆశీర్వాదాలు తీసుకుందాం, కానీ ఆయనను ప్రభుత్వం అధికారికంగా, ప్రభుత్వ కార్యాలయాల్లో ఆయన ఫోటోలు పెట్టి, జయంతులు చేయండి అని ఎలా చెప్తుంది, అది ఎంతవరకు సమంజసం. భారత ప్రధానమంత్రులకు కూడా దక్కని గౌరవాన్ని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు సత్య సాయిబాబాకి ఇవ్వాలనుకుంటుంది. ఈ దేశంలో ప్రధానమంత్రులుగా పనిచేసిన అనేక మందికి సంబంధించిన జయంతి ఉత్సవాలను కూడా అధికారికంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చాలామంది జయంతులను, భారత ప్రభుత్వము అధికారికంగా నిర్వహించట్లేదు, ఇప్పటికీ అఫీషియల్ గా ప్రభుత్వ కార్యాలయాల్లో నిర్వహించట్లేదు. పదే పదే ఇందిరమ్మ రాజ్యం అని మాట్లాడుతున్న మీరు, ఇందిరా గాంధీకి సంబంధించిన జయంతి కూడా అఫీషియల్ గా, ప్రభుత్వ కార్యాలయాలు నిర్వహించేలా, మేము ప్రభుత్వం నిర్ణయం తీసుకోలేదు, ఇప్పటివరకు దేశవ్యాప్తంగా ఓ నలుగురు, ఐదుగురు ప్రముఖులకు సంబంధించిన ప్రముఖ నాయకులకు సంబంధించిన జయంతి ఉత్సవాలను మాత్రమే కేంద్ర ప్రభుత్వం చేస్తుంటే, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం కూడా, తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత చాకలి ఐలమ్మ, కొండా లక్ష్మణ్ బాపూజీ లాంటి ప్రముఖులకు సంబంధించిన జయంతి ఉత్సవాలను చేస్తుంది. అధికారికంగా డెఫినెట్ గా చేయాల్సింది, గౌరవిద్దాం, ఆ తర్వాత బసవేశ్వరుడికి సంబంధించిన జయంతిని కూడా చేస్తుంది, గౌరవిద్దాం బసవేశ్వరుడు చాలా మందికి సంబంధించిన గురువుగా ఉన్నారు ఆయన జయంతిని చేస్తున్నారు గౌరవిద్దాం కానీ పుట్టపత్తి సాయిబాబాకి తెలంగాణ ప్రభుత్వం, ఈ స్థాయిలో గౌరవం ఇవ్వాల్సిన అవసరం ఉందా, ఆయన గౌరవాన్ని తగ్గించాల్సిన అవసరం ఉందని నేను చెప్పట్లే, ఏ రకంగా సంబంధం ఎందుకు సంబంధం ఎందుకు జయంతి ఉత్సవాలు చేయాల్సిన అవసరం తెలంగాణ రాష్ట్రంలో ఓ బాబాకు జయంతి ఉత్సవాలు ప్రభుత్వం, అధికారికంగా చేయడం ఏంటి ,ప్రభుత్వ కార్యాలయాల్లో అందరూ ఆయన ఫోటోలు పెట్టి రేపటి నుంచి జయంతి కార్యక్రమాలు చేయాలా? ఆయన చేసిన సేవలను గౌరవించడం వేరు, ప్రభుత్వంగా ఈ స్థాయి గౌరవం ఇవ్వడం వేరు, దేశానికి సేవలు అందించిన దేశం కోసం ప్రాణాలు కోల్పోయిన ప్రధానమంత్రి స్థాయి నాయకులకు కూడా మనం ఇంత గౌరవం ఇవ్వలేదు. ఈ అంశంపై సీనియర్ జర్నలిస్ట్ 'YNR' విశ్లేషణ..!


Updated On
ehatv

ehatv

Next Story