Journalist YNR : ఈవీఎం ట్యాంపరింగ్‌పై శరద్ పవార్ కీలక వ్యాఖ్యలు..!
ఎన్నికలు ముగిసిన తర్వాత, ఓడిపోయిన పార్టీలు ఈవీఎంలు ట్యాంపరింగ్ అనో, లేకపోతే మిషన్లు మార్చేశారనో, ఇంకేదో ఆరోపణలు చేయడం గడిచిన రెండు దశాబ్దాల్లో చాలా కాలంగా చూస్తూ ఉన్నాం.

ఎన్నికలు ముగిసిన తర్వాత, ఓడిపోయిన పార్టీలు ఈవీఎంలు ట్యాంపరింగ్ అనో, లేకపోతే మిషన్లు మార్చేశారనో, ఇంకేదో ఆరోపణలు చేయడం గడిచిన రెండు దశాబ్దాల్లో చాలా కాలంగా చూస్తూ ఉన్నాం. అయితే సార్వత్రిక ఎన్నికలు 2024 లో ముగిసిన ఏడాది తర్వాత కూడా ఈ దేశంలో ఎన్నికల ప్రక్రియపైన అనుమానాలు ఇంకా వ్యక్తమవుతూనే ఉన్నాయి. ఇటీవల రాహుల్ గాంధీ రైజ్ చేసిన అనుమానాల తర్వాత ఈ దేశంలోని ప్రతి సామాన్యుడు కూడా, ఈ దేశంలోని ప్రతి మారుమూల పల్లెల్లో కూడా, ఈ దేశంలోని ప్రతి ఇంట్లో కూడా ఈవీఎం లకు సంబంధించిన అంశం ఓట్ల ట్యాంపరింగ్, ఓట్ల దొంగతనానికి సంబంధించిన అంశం పైన చర్చ జరుగుతోంది. ఇది నిజమేననే నమ్మకం బలపడుతోంది. ఇది నిజమే కదా అనే ఎవిడెన్స్ కనపడుతున్నాయి, ఇది నిజం కాకపోతే ఎలక్షన్ కమిషన్ ఎందుకు మౌనంగా ఉంటుంది, ఇలాంటి ప్రశ్నలు తలెత్తుతున్నాయి, సో ఈ నేపథ్యంలో ఎన్నికలు వచ్చిన ప్రతిసారి ఆయా రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్న సందర్భంగా కొంతమంది టెక్నికల్ పీపుల్ పేరుతో, ఆ రాష్ట్రంలోని రాజకీయ నాయకుల దగ్గరికి వెళ్లి మీరు ఎలాగైనా గెలిచేలా, మేము చేస్తాము మాకు ఇంత డబ్బులు ఇవ్వండి, ఇదిగో రేడియో ఫ్రీక్వెన్సీస్ ద్వారా ట్యాంపరింగ్ చేస్తాం, ఇదిగో ఈ రకంగా ట్యాంపరింగ్ చేస్తాం, అంటూ నేతలని కొంతమంది కలిసే ప్రయత్నం చేస్తున్నారు. సో అలా కలిసే ప్రయత్నం చేసి కొంత డబ్బులు అడిగి మిమ్మల్ని గెలిపిస్తాం, ఇదిగో ఇలా గెలిపించబోతున్నాం లాంటి ఒక ప్రజెంటేషన్ కూడా ఇస్తూ వస్తున్నారు. ఇవ్వబోతున్నారు, సో ఈ నేపథ్యంలోనే మహారాష్ట్రలో ఇటీవల శాసనసభ ఎన్నికలు జరిగాయి.
మహారాష్ట్ర శాసనసభ ఎన్నికల్లో ఎవరు గెలిచినా నెక్ టు నెక్ ఫైట్ ఉంటుంది అనే వాతావరణం ఉన్న నేపథ్యంలో అక్కడ మహావికాస్ అగాడి దారుణమైన ఓటమిని చవి చూసింది. ఇంత స్థాయిలో మహావికాస్ అగాడి ఓడిపోతుందని, ఈవెన్ అక్కడ అధికారంలోకి వచ్చిన పార్టీలు కూడా ఊహించలేదు. సో ఆ స్థాయిలో దారుణమైన ఓటమి వెనక రీసన్స్ ఏంటి అనే దానిపైన ఇప్పటికే దేశంలో చర్చ జరుగుతోంది. అక్కడ ఈవీఎంల ట్యాంపరింగ్‌కి సంబంధించి, పోల్ పర్సెంటేజ్ పెంచడానికి సంబంధించి, ఏం జరిగింది అనేది మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలోనే భారత రాజకీయాల్లో సీనియర్ పొలిటీషియన్ గా పేరున్న ఎన్సీపీ అధినేత శరత్ పవార్ కొన్ని సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఎన్నికల కంటే ముందు, మహారాష్ట్ర ఎన్నికల కంటే ముందు, నేను ఇంతకుముందు వీడియోలో స్టార్టింగ్ చెప్పినట్టు, చాలా ఎన్నికల సందర్భంగా, చాలా మంది వచ్చి ఇలా పొలిటీషియన్స్ ని అప్రోచ్ అవుతుంటారు. ఒకటి రెండు సందర్భాల్లో కొంతమంది నేతలు మాట్లాడడం చూశాం, కొంతమందేమో ఇది బయటికి చెప్తే బాగుండదేమో అని ఆఫ్ ది రికార్డు గా షేర్ చేసుకోవడం చాలా సందర్భాల్లో నేను గమనించా. సో శరద్ పవార్ చెప్పిన మాట ఏంటి అంటే మహారాష్ట్ర ఎన్నికల సందర్భంగా కొంతమంది, ఒక ఇద్దరు వ్యక్తులు నా దగ్గరికి వచ్చారు. 160 సీట్లు మీరు గెలిచేలా చేస్తాం, మాకు ఇది ఇవ్వండి అంటూ వాళ్ళు మా ముందు ఒక ప్రపోజల్ పెట్టారు, 160 సీట్లు గెలవడానికి సంబంధించి ఏ రకంగా గెలవగలరు అనే అంశానికి సంబంధించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇచ్చారు. సో ఈ విషయాన్ని నేను రాహుల్ గాంధీ దృష్టికి తీసుకెళ్ళాను, బట్ రాహుల్ గాంధీ మాత్రం అటువంటివి వద్దు అంటూ తిరస్కరించారు, కాబట్టి మేము వాళ్ళ హెల్ప్ తీసుకోలేకపోయాం. ఈ దేశంలో ఎన్నికలు టాంపర్ అవుతున్నాయి ఎన్నికలు టాంపర్ అయ్యే ప్రయత్నం టాంపర్ చేసే ప్రయత్నం జరుగుతుంది అనడానికి ఇది ఒక ఉదాహరణ అంటూ శరత్ పవర్ మాట్లాడారు. ఈ అంశంపై సీనియర్ జర్నలిస్ట్ 'YNR' విశ్లేషణ..
