సింగయ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ ఇటీవల బాగా పరిచయం ఉన్న పేరు.

సింగయ్య ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ ఇటీవల బాగా పరిచయం ఉన్న పేరు. ఇటీవల సత్తెనపల్లిలో జగన్మోహన్ రెడ్డి పర్యటన సందర్భంగా జగన్మోహన్ రెడ్డి కాన్వాయ్ డీకొని మరణించిన వ్యక్తిగా చెప్పబడుతున్న సింగయ్య మరణం వెనక జగన్మోహన్ రెడ్డి(Ys Jagan) ఉన్నారు.. జగన్మోహన్ రెడ్డి కారణంగానే తన భర్త చనిపోయారు అంటూ ఆయన భార్య లూర్దు మేరి పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు వార్తలు చూశాం.

ఆ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసిన తర్వాత జగన్మోహన్ రెడ్డి హైకోర్టుకి వెళ్ళారు, హైకోర్టు స్టే ఇచ్చింది.. పోలీసులని కౌంటర్ దాఖల్ చేయమని అధికారి అధికారులను కోరినప్పటికీ, కోర్టు ఆదేశించినప్పటికీ ఇప్పటివరకు కౌంటర్ దాఖలు చేయకపోగా.. కౌంటర్ దాఖలు చేయడానికి మాకు ఇంకా సమయం కావాలి అంటూ ప్రభుత్వానికి సంబంధించిన న్యాయవాదులు కోరడం చూశాం. సో ప్రభుత్వం ఇది తప్పుడు కేసు నమోదు చేసింది ఈ కేసు ఇంటెన్షనల్ గా నమోదు చేసిన కేసుగా ఉంది ఇలాంటి ఒక ఇంప్రెషన్ కనపడుతుంది. జరుగుతున్న పరిణామాలను బట్టి చూస్తే అయితే జగన్మోహన్ రెడ్డి వాహనం ఎక్కి తొక్కించి చంపేశారు లాంటి మాటలకు బలం చేకూర్చేలా ఆ వీడియో లేదు.. ఆ వాహనం సింగయ్య పైకి ఎక్కుతున్న సందర్భంగా ఆ తర్వాత ఆగింది.. ఆ తర్వాత సింగయ్య (Singaiah )వాహనం నుంచి ఆ వాహనం కింద పడ్డ ఆయన్ని తీసి పక్కన పడుకోబెట్టారు.. ఆ తర్వాత దాదాపు అరగంట సేపు ఆయన అక్కడ ఉన్నారు, ఆ తర్వాత హాస్పిటల్కి తరలించారు.

హాస్పిటల్‌కి తరలించిన తర్వాత ఆయన మరణించినట్టుగా వార్తలు వచ్చాయి. ఈ మొత్తం వ్యవహారంపైన జగన్మోహన్ రెడ్డి కారణం.. జగన్మోహన్ రెడ్డి డ్రైవర్ అలాగే జగన్మోహన్ రెడ్డి తోటి ట్రావెల్ చేసిన వాళ్ళు అంతా కారణం అనేది ప్రభుత్వం చెప్తున్న మాట. కార్యకర్త చనిపోతే కనీసం పరామర్శించరా? చూడరా? కార్యకర్తను పట్టించుకోరా అంటూ పదే పదే మాట్లాడుతూ రావడం కూడా చూశాం. అయితే ఈరోజు ప్రభుత్వాన్ని ఇబ్బందులు పెట్టేలా ప్రభుత్వానికి షాక్ ని ఇచ్చేలా ఓ నిర్ణయం జరిగింది, ఒక ఇన్సిడెంట్ జరిగింది ఏంటి ఆ ఇన్సిడెంట్ అంటే సింగయ్య భార్య లూర్దు మేరి మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డిని కలిశారు. కలిసి తాను ఎందుకు జగన్మోహన్ రెడ్డి పైన కేసు పెట్టాల్సి వచ్చింది తను కేసు పెట్టడం వెనుక ఏం జరిగింది అనే విషయాన్ని ఓపెన్‌గా మీడియాతో మాట్లాడారు.. ఓపెన్‌గా మీడియాతో ఆమె మాట్లాడడంతో ప్రభుత్వానికి చుక్క ఎదురైనట్లయింది. ఈ అంశంపై సీనియర్‌ జర్నలిస్ట్ 'YNR' విశ్లేషణ..


ehatv

ehatv

Next Story