Journalist YNR : మద్యం కేసులో ఆపసోపాలు పడుతున్న సిట్..!
మద్యం కేసుకు సంబంధించి సిట్ ఆపసోపాలు పడుతున్నట్టు కనపడుతుంది.

మద్యం కేసుకు సంబంధించి సిట్ ఆపసోపాలు పడుతున్నట్టు కనపడుతుంది. సిట్ చాలా తిప్పలు పడుతున్నట్టు కనపడుతుంది. సిట్ ఏం చేస్తోంది, అనేది తెలుగుదేశం పార్టీ, తెలుగుదేశం పార్టీ మీడియా రోజుకో సీరియల్ రాస్తోంది. సిట్ మాత్రం న్యాయస్థానాల ముందు తమ చేతగాని తనాన్ని నిరూపించుకున్నట్లు కనపడుతుంది. ఈ మాట నేను ఎందుకు చెప్తున్నాను అంటే, సిట్ అధికారులు ఇటీవల సీస్ చేసిన 11 కోట్ల అంశానికి సంబంధించి భూమ్ రాంగ్ అయ్యే వాతావరణం కనపడుతుంది. ఆ 11 కోట్ల రూపాయలు హైదరాబాద్ లోని ఒక కాలేజీకి సంబంధించిన నిధులు అంటూ వైసీపీ చెప్తూ వస్తుంది, సో ఆ కాలేజీకి సంబంధించిన వ్యక్తి దగ్గర ఈ నిధులు పెట్టి, ఇవి మద్యం స్కామ్ కు సంబంధించిన డబ్బులు అని చెప్పే ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఒక బ్లేమ్ గేమ్ గానే ఉంది తప్ప , ఆ నిధులు మావి అని ప్రూవ్ చేయలేరు అనేది వైసీపీ చెప్తున్న మాట. సో ఈ అంశానికి సంబంధించి వైసీపీ ఏం చెప్తుంది, టీడిపి ఏం ప్రచారం చేస్తుంది అనే విషయాన్ని పక్కన పెడితే, 11 కోట్ల రూపాయల్ని సిట్ అధికారులు సీజ్ చేశారు. మద్యం కుంభకోణానికి సంబంధించిన డబ్బులుగా వీటిని చెప్తున్నారు, రాజ్‌కసి రెడ్డి అక్కడ ఆ డబ్బుల్ని దాచి ఉంచారు అనేది సిట్ చెప్తున్నట్లుగా, తెలుగుదేశం పార్టీ వైపు నుంచి బయటికి వస్తున్న వార్త. ఈ క్షణానికి సిట్ అంశం పైన ఎప్పుడూ కూడా ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టో, ఇంకోటి పెట్టో, అఫీషియల్ గా సమాచారాన్ని ఇవ్వలేదు. వాళ్ళ వాళ్ళు ఇప్పటి వరకు ఇచ్చిన చార్జ్ షీట్ మినహా వేరే సమాచారం ఏమీ లేదు. కానీ 11 కోట్ల రూపాయలు నావి కావు, ఆ 11 కోట్ల రూపాయల పైన ఉన్న నంబర్స్ అవి ఎప్పుడు ముద్రించారు అనే అంశానికి సంబంధించిన డీటెయిల్స్ కావాలి అంటూ, ఆ డీటెయిల్స్ ని భద్రపరచండి అంటూ ఆ నోట్లకు సంబంధించిన వీడియోస్, ఫోటోగ్రాఫ్స్ భద్రపరచండి అంటూ రాజకసి రెడ్డి కోర్టుకు వెళ్ళడంతో సిట్ అధికారులకు తిప్పలు మొదలయ్యాయి. సిట్ అధికారులు రాజకసిరెడ్డి కోర్టుకి వెళ్ళిన తర్వాత కోర్టులో వాదనలు జరగడానికంటే ముందు, ఆ డబ్బులన్నీ తీసుకొచ్చి బ్యాంకులో పెట్టి, వాటిని చలామణిలోకి తీసుకొచ్చే ప్రయత్నం చాలా స్పీడ్ గా చేశారు అని కనబడుతుంది. హైదరాబాద్ లో పట్టుకున్న ఆ డబ్బుల్ని విజయవాడకు తరలించారు. మాచవరం పోలీస్ స్టేషన్ కి తీసుకెళ్ళారు. మాచవరం పోలీస్ స్టేషన్ లో బ్యాంకులు ప్రస్తుతం వాటిని ఉంచినట్లుగా తాజాగా సమాచారం. సో ఇమ్మీడియట్ గా మూడు గంటల వ్యవధిలో 11 కోట్ల రూపాయలని లెక్కించడం, వాటిని అది ఫేక్ నోట్లా, ఒరిజినల్ నోట్లా, అని గమనించడం, వాటిని ఇమ్మీడియట్ గా చెస్ట్ బ్యాంకు తరలించడం, ఇవన్నీ ఎలా సాధ్యమైంది అనేది ఒక ప్రశ్న. సో ఆ నోట్లకు సంబంధించిన, ప్రతి నోటుకు సంబంధించిన, లేకపోతే ఆ సీరియల్ నోట్లకు సంబంధించిన, సీరియల్ నంబర్స్ కు సంబంధించిన డీటెయిల్స్ తీసుకున్నారా, లేదా అనేది కోర్టుకు చెప్పడంలో సిట్ అధికారులు ఎందుకో తటపటాయిస్తూ ఉన్నారు.ఈ అంశంపై సీనియర్ జర్నలిస్టు 'YNR' విశ్లేషణ..!
