బీహార్‌లో ఎన్నికల కమిషన్ తీరుకు సంబంధించి నేను కొన్ని వీడియోలు చేశా. జర్నలిస్ట్ వైఎన్ఆర్ ఛానల్ లో మీరు కూడా చూసి ఉంటారు.

బీహార్‌లో ఎన్నికల కమిషన్ తీరుకు సంబంధించి నేను కొన్ని వీడియోలు చేశా. జర్నలిస్ట్ వైఎన్ఆర్ ఛానల్ లో మీరు కూడా చూసి ఉంటారు.బీహార్ లో ఎన్నికల కమిషన్ వ్యవహరిస్తున్న తీరు రకరకాల అనుమానాలకు తావిస్తోంది. అనేక విమర్శలకు దారి తీస్తోంది అని మాట్లాడుకున్నాం. ఏ రకమైన అనుమానాలు ఉన్నాయి, విమర్శలకు దారి తీస్తుందో కూడా డీటెయిల్డ్‌గా నేను చెప్పా, సో బీహార్‌లో 11 ధృవీకరణ పత్రాల ద్వారా అక్కడ ఓటర్లకు సంబంధించిన జాబితాని మళ్ళీ చెక్ చేయబోతున్నారు.

2003లో చేసిన సవరణ సరిగ్గా లేదు అంటూ ఎలక్షన్ కమిషన్ ఇప్పుడు కొత్తగా పూర్తిగా ఓటర్ల జాబితా సవరణకు శ్రీకారం చుట్టింది. దీనిపైన విమర్శలు వస్తున్నాయి. 11 రకాల ధృవీకరణ పత్రాలు ఉంటే మాత్రమే వాళ్ళని మళ్ళీ మళ్ళీ ఓటర్లుగా గుర్తించే పరిస్థితి ఉంటుంది, ఓటర్లుగా గుర్తించే అవకాశాన్ని బూత్ లెవెల్ ఆఫీసర్ కి ఎలక్షన్ కమిషన్ కట్టబట్టింది. ఈ అంశం పైన తీవ్రమైన విమర్శలు వచ్చాయి. కొంతమంది కోర్టుకి కూడా వెళ్ళారు. సుప్రీంకోర్టు ఈ అంశంపైన నిన్న ఒక కీలకమైన తీర్పుని ఇచ్చింది. సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పుకు సంబంధించి నిన్న మధ్యాహ్నం నుంచి వార్తలు వచ్చాయి. సుప్రీం కోర్టు స్టే ఇవ్వడానికి నిరాకరించింది ఓటర్ల జాబితా సవరణ పైన. సుప్రీం కోర్టు తీర్పు ఎలక్షన్ కమిషన్ కి అనుకూలంగా ఉందని రకరకాల విశ్లేషణలు వచ్చాయి, ఈరోజు ఉదయం ఆ తీర్పుకు సంబంధించి డీటెయిల్డ్‌గా సమాచారం తీసుకున్న తర్వాత నేను ఆ సమాచారాన్ని మీ ముందు పెట్టడం కోసం ఈ వీడియో చేస్తున్నాను. ఎలక్షన్ కమిషన్ అంశానికి సంబంధించి సుప్రీం కోర్టు చెప్పింది ఏంటి అంటే.. ఓటర్ల జాబితా సవరణకు సంబంధించిన అంశంపైన అధికారం ఎలక్షన్ కమిషన్‌కే ఉంటుంది, ఓటర్ల జాబితా సవరణని ఆపేయండి అని నేను ఇప్పుడు.. మేము ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో ఎలక్షన్ కమిషన్ని ఆదేశించలేము, ఎలక్షన్ కమిషన్ తీసుకుంటున్న ఓటర్ల జాబితా సవరణ పైన స్టే విధించలేము అని చెప్పింది. సో ఎలక్షన్ కమిషన్ కి అటువంటి అధికారం ఉంది అనే విషయాన్ని సుప్రీం కోర్టు చెప్పింది. వాళ్ళకి ఆ అధికారం ఉంది కాబట్టి ఆ అధికారాన్ని మేము ఇప్పుడు ఆపలేము, దాన్ని దానిపైన స్టే విధించలేము అనే విషయాన్ని స్పష్టంగా చెప్పింది. అదే సమయంలో ఎలక్షన్ కమిషన్ కొన్ని కీలకమైన కామెంట్స్ కూడా చెప్పింది. ఈ అంశంపై సీనియర్‌ జర్నలిస్టు 'YNR' విశ్లేషణ..

ehatv

ehatv

Next Story