Supreme Court: సుప్రీం సంచలనం.. అనర్హత దిశగా!
Supreme Court sensation.. Possibility of disqualification of MLAs
తెలంగాణలో పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేల పైన అనర్హత వేటు దిశగా విచారణ జరుగుతున్నట్లు కనబడుతుంది. తెలంగాణకు సంబంధించిన 10 మంది బిఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, కాంగ్రెస్ పార్టీలో చేరారు. కాంగ్రెస్ పార్టీలో చేరిన సందర్భంగా వారిపైన అనర్హత వెయిటు వేయాలంటూ బిఆర్ఎస్ పార్టీ న్యాయ పోరాటం చేస్తూ వచ్చింది. హైకోర్టులోనూ, తర్వాత సుప్రీం కోర్టులోనూ కేస్ నడుస్తుంది. సుప్రీంకోర్టు ఈ అంశంపైన బిఆర్ఎస్ తరపున న్యాయవాదులు సమర్పించిన, ఆధారాలు చూసిన తర్వాత వీళ్ళపైన మూడు నెలల లోపు చర్యలు తీసుకోండి, ఎందుకు ఇంత ఆలస్యం చేశారు అంటూ, మూడు నెలల క్రితం సుప్రీం కోర్టు వ్యాఖ్యానించడం చూశాం. స్పీకర్‌కి ఆదేశాలు ఇవ్వడం చూశాం. దానిపైన సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు స్పీకర్ 10 మంది పార్టీ మారిన ఎమ్మెల్యేలతో వాళ్ళకు సంబంధించిన విచారణ చేస్తూ వచ్చారు. వాళ్ళని పిలిచి మాట్లాడే ప్రయత్నం చేశారు. వాళ్ళు పార్టీ మారారు అంటూ ఫిర్యాదు చేసిన బిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలను పిలిచి విచారణ చేశారు. పార్టీ మారిన నేపథ్యంలో వాళ్ళ పైన చర్యలు తీసుకోవడానికి సంబంధించిన ఒత్తిడిని బిఆర్ఎస్ పార్టీ చేస్తూ వస్తుంది. మూడు నెలలు గడిచినప్పటికీ సుప్రీం కోర్టు గతంలో ఇచ్చిన ఆదేశాల మేరకు, మూడు నెలలలోపు వాళ్ళపైన చర్యలు తీసుకోమని చెప్తే, మూడు నెలలు గడిచినప్పటికీ చర్యలు తీసుకోకపోవడం పట్ల సుప్రీంకోర్టుని మరోసారి ఆశ్రయించింది. బిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన లీగల్ టీం ఈ నేపథ్యంలో ఈరోజు సుప్రీం కోర్టులో ఈ అంశం పైన విచారణ జరిగింది. విచారణ జరిగిన సందర్భంగా సుప్రీంకోర్టు సభాపతి పైన ఆ సీరియస్ అయింది. ఎందుకు నిర్ణయం తీసుకోలేకపోయారు, మూడు నెలల సమయం ఇచ్చిన తర్వాత కూడా అని ప్రశ్నించింది. స్పీకర్ కు కోర్టు దిక్కరణ నోటీసులు ఇవ్వాలని, సుప్రీం కోర్టు నిర్ణయించుకున్నట్లుగా సమాచారం ఉంది. స్పీకర్ సుప్రీంకోర్టు ఆదేశాలని పాటించలేదు, సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలకు విరుద్ధంగా వ్యవహరించారు, సుప్రీం కోర్టు ఒక టైం బాండ్ పెట్టి, చర్యలు తీసుకోమని చెప్తే, ఆ టైం దాటినప్పటికీ చర్యలు తీసుకోకపోవటం ఏంటి అనేది సుప్రీం కోర్టు వేస్తున్న ప్రశ్నగా ఉంది.
సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ గవాయి నేతృత్వంలోని బెంచ్ విచారణ జరుపుతోంది, విచారణ ఇంకా కొనసాగుతోంది, ఈ విచారణ జరుగుతున్న సందర్భంగా, స్పీకర్‌పైన సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేయడం అనేది ఖచ్చితంగా రాజకీయంగా చాలా ఆసక్తిని కలిగించే అంశం. ఈ అంశంపై సీనియర్ జర్నలిస్ట్ 'YNR' విశ్లేషణ..!


