అరెస్ట్.. భారతదేశంలో ఇది చాలా చిన్న విషయం. తెలుగు రాష్ట్రాల్లో మరీ చిన్న విషయం అయిపోయింది.

అరెస్ట్.. భారతదేశంలో ఇది చాలా చిన్న విషయం. తెలుగు రాష్ట్రాల్లో మరీ చిన్న విషయం అయిపోయింది. ఎవరినైనా, ఎప్పుడైనా, ఎక్కడైనా అరెస్ట్ చేసేయొచ్చు, అరెస్ట్ చేసిన సందర్భంగా ఎందుకు అరెస్ట్ చేస్తున్నామో కూడా అరెస్ట్ అయిన వ్యక్తికి చెప్పాల్సిన అవసరం లేదు. మేము పోలీసులం ఖాకీ డ్రెస్ వేసుకున్నాం, మా పైన తెల్ల చొక్కాలు వేసుకున్న వాళ్ళు కొంతమంది ఉన్నారు, వాళ్ళు మాకు చెప్తారు, మేము ఎవరినైనా తీసుకొచ్చి అరెస్ట్ చేసి లోపల వేసేయొచ్చు ఇది సిస్టం నడుస్తుంది. గత కొద్ది రోజులుగా, గత కొద్ది సంవత్సరాలుగా అనేక చోట్ల చట్టాన్ని ఉల్లంఘించి, చట్టాన్ని ఏమాత్రం పట్టించుకోకుండా, మేమే సుప్రీం, మేమే చట్టం అన్నట్లుగా పోలీసులు వ్యవహరిస్తున్న తీరు చూశాం. అడపా దడప ఒకటి రెండు సందర్భాల్లో పోలీసుల వ్యవహార శైలికి సంబంధించి ఆధారాలు దొరికిన సందర్భంలో ఆధారాలని ఆ న్యాయవాదులు కోర్టులో సబ్మిట్ చేయగలిగిన సందర్భాల్లో. కోర్టులు పోలీసుల పైన సీరియస్ అవ్వడం, పోలీసుల పైన చర్యలు తీసుకోవడం, పోలీసుల పైన కేసు నమోదు చేస్తామంటూ మాట్లాడడం, కేసు నమోదులు చేయించడం చూశాం.

కొన్ని సందర్భాల్లో వార్నింగ్‌లు ఇచ్చి వదిలేయడం చూస్తున్నాం, కానీ పోలీస్ వ్యవస్థ అధికార పార్టీల చేతుల్లో కీలు బొమ్మలుగా మారిపోయి, ప్రజల ప్రాథమిక హక్కులకు కూడా భంగం కలిగిస్తున్న సందర్భాలు దేశంలో పెరిగిపోతున్నాయి. ఇవి ఇలాగే పెరిగితే దేశంలో అన్‌రెస్ట్ పెరుగుతుంది. ఓ వ్యక్తి అరెస్ట్ అయిన సందర్భంగా, తాను ఎందుకు అరెస్ట్ అయ్యానో తెలుసుకునే హక్కు అతనికి ఉంటుంది, చెప్పాల్సిన బాధ్యత పోలీసులకు ఉంటుంది. ఇలా అటువంటి హక్కు తనకు ఉందని కానీ, పౌరుడికి చెప్పాల్సిన బాధ్యత మాకు ఉందని కానీ, అటు పౌరులు, ఇటు పోలీసులు కూడా మర్చిపోయారు. ఈ నేపథ్యంలోనే సుప్రీం కోర్టు రెండు రోజుల క్రితం ఒక కీలకమైన తీర్పు చెప్పింది. మహారాష్ట్రకు సంబంధించిన ఒక ఇన్సిడెంట్లో సుప్రీం కోర్టు చెప్పిన తీర్పు ప్రకారం ఎవరైనా. ఒక వ్యక్తిని అరెస్ట్ చేసినప్పుడు అతన్ని ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు, అనే సమాచారాన్ని ఆ వ్యక్తికి తప్పకుండా ఇచ్చి తీరాలి, ఆన్ పేపర్ లిఖిత పూర్వకంగా అతనికి సమాచారాన్ని ఇవ్వాలి సుప్రీంకోర్ట్ చీఫ్ జస్టిస్ గవాయి నేతృత్వంలోని ద్విసభ్య బెంచ్ చెప్పిన మాట ఇది. అనేక చోట్ల దీన్ని పోలీసులు పాటించట్లేదు, ఖచ్చితంగా పాటించి తీరాలి అని చెప్పింది.ఈ అంశంపై సీనియర్ జర్నలిస్ట్ 'YNR' ఎనాలసిస్..!


Updated On
ehatv

ehatv

Next Story