తెలుగు రాష్ట్రాల్లో తెలుగుదేశం పార్టీకి ఓ ప్రత్యేకమైన గుర్తింపు ఉంది.

తెలుగు రాష్ట్రాల్లో తెలుగుదేశం పార్టీకి ఓ ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. తెలుగుదేశం పార్టీ కార్యక్రమాల నిర్వహణకు సంబంధించి చాలా అద్భుతంగా చేస్తుంది అని, తెలుగుదేశం పార్టీ క్యాడర్ ని బిల్డ్ చేసుకోవడంలో ఖచ్చితంగా వేరే రాజకీయ పార్టీలకు ఆదర్శంగా ఉండేది. ఒకప్పుడు కమ్యూనిస్ట్ పార్టీలకు సంబంధించిన క్యాడర్ బేస్డ్ పార్టీలుగా, కమ్యూనిస్టులకు ఉండే నెట్వర్క్ గురించి చెప్తూఉంటారు కానీ, తెలుగు రాష్ట్రాల్లో ఈరోజు ఉన్న పరిస్థితిలో క్రింది స్థాయి వరకు క్యాడర్ ని, బూత్ లెవెల్ వరకు బలంగా నడిపించగలిగేల బలంగా క్యాడర్ ని బిల్డ్ చేసుకున్నా ఆల్టర్నేట్ క్యాడర్ ని కూడా రెడీ చేసుకున్న పార్టీగా తెలుగుదేశం పార్టీని చూడొచ్చు. అటువంటి తెలుగుదేశం పార్టీ క్యాడర్ మొత్తం గడిచిన ఎన్నికల్లో విజయం కోసం పోరాడారు, విజయం సాధించడానికి వెనక కచ్చితంగా తెలుగుదేశం పార్టీకి సంబంధించిన క్యాడర్ పోరాటాన్ని గురించి చెప్పుకోవాలి. ఇదే సమయంలో అధికారంలోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం పార్టీకి సంబంధించిన క్యాడర్ కి గతంలో ఎప్పుడూ లేని స్థాయిలో పదవులు దక్కాయి.

తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సమయంలో నామినేటెడ్ పదవుల పంపకం అనేది చాలా అరకొరగా జరుగుతుంటుంది, 100 మంది పదవుల కోసం ఎదురు చూస్తుంటే, అక్కడ 200 పదవులు ఉన్నప్పటికీ చంద్రబాబు నాయుడు భర్తీ చేసేది మాత్రం 10, 20 ఉంటాయి. ఆ స్థాయిలో పదవులు పంచకుండా పదవులు అలాగే పెట్టి, ఒక పదవి ఎవరికైనా ఇస్తే 10 మంది శత్రువులు అవుతారేమో, 10 మందితో మనం వ్యతిరేకత తెచ్చుకోవాల్సి వస్తుందేమో అనే ఒక భయంతో, ఆయన కంటిన్యూస్ గా పదవులని ఫిల్ చేసిన పరిస్థితి చూడం. 2014 నుంచి 19 మధ్యలో కూడా పూర్తి స్థాయిలో నామినేటెడ్ పదవుల భర్తీ జరగలేదు, తెలుగుదేశం పార్టీకి సంబంధించి అనేక కార్పొరేషన్ చైర్మన్లు ఐదేళ్ళు ఖాళీగా ఉన్నాయి. మరికొన్ని కార్పొరేషన్ చైర్మన్లు రెండేళ్ళు ఖాళీగా ఉండి, ఆ తర్వాత భర్తీ చేశారు. చాలా నామినేటెడ్ పోస్టులని కనీసం ఒక్కసారి కూడా ఐదేళ్లలో భర్తీ చేసిన పరిస్థితి లేదు. ఈ రకంగా చేశారు గతంలో కొంతమంది పార్టీకి సంబంధించిన ముఖ్యులు ఇంకెవరో పోయి, ఒత్తిడి తీసుకొస్తే మీ వల్ల అధికారంలోకి రాలేదు, నేను పాదయాత్ర చేశాను, నేను ఇంకేదో చేశాను, దాని వల్ల అధికారం వచ్చింది, అధికారంలోకి వచ్చామంటూ చంద్రబాబు నాయుడు మాట్లాడారు అంటూ వార్తలు వచ్చాయి. ఎంతవరకు నిజమో తెలియదు.

పార్టీకి సంబంధించిన నాయకులకు నామినేటెడ్ పదవులు ఇవ్వడానికి సంబంధించి ఎందుకో ఆ పార్టీ కాస్త అజిటేట్ చేస్తూ ఉండేది, పార్టీ క్యాడర్ నిర్మాణంలో మాత్రం కచ్చితంగా తెలుగు రాష్ట్రాల్లో తెలుగుదేశం పార్టీని మించిన పార్టీ లేదని చెప్పొచ్చు. అయితే గడిచిన ఎన్నికల్లో భారీ విజయం తర్వాత గతంలో ఎప్పుడూ లేని స్థాయిలో పదవుల భర్తీ జరిగింది, అనేకమంది నాయకులకు పదవులు ఇచ్చారు. నేరుగా కేంద్ర కార్యాలయమే ఇన్వాల్వ్ అయి పార్టీ కోసం పని చేసిన వాళ్ళు ఎవరో ఐడెంటిఫై చేసి, ఆయా నియోజక వర్గాలకు సంబంధించిన ఎమ్మెల్యేలకు, జిల్లా బాధ్యులకు తెలియకుండా కూడా పదవులు ఇచ్చారు. పార్టీ రాష్ట్ర స్థాయి నుంచి మిమ్మల్ని మానిటర్ చేస్తుంది, మీరు నేరుగా పార్టీ కోసం పని చేయొచ్చు, అక్కడ స్థానిక నాయకత్వంతో సంబంధం లేదు అనుకునే స్థాయిలో కూడా పదవులు ఇచ్చారు. పదవుల పంపిణీకి సంబంధించి, పదవులు కేటాయింపులకు సంబంధించి, పార్టీ కోసం పని చేసిన వాళ్ళకు మెజారిటీ పదవులు దక్కాయి లాంటి ఒక ఇంప్రెషన్ అయితే ఉంది. ఇంకా కొంతమంది పదవులు లేకుండా ఉంటే ఉండొచ్చు గాక, అటువంటి పార్టీ గడిచిన 17 నెలల కాలంలో అద్భుతమైన పరిపాలన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చేస్తామని చెప్పుకుంటూ వస్తుంది. ఈ అంశంపై సీనియర్ జర్నలిస్ట్ 'YNR' విశ్లేషణ..!


Updated On
ehatv

ehatv

Next Story