నిన్నటి జగన్మోహన్ రెడ్డి పర్యటన ఏ స్థాయిలో సక్సెస్ అయింది అనే దానిపైన రకరకాల వార్తలు చూస్తున్నాం.

నిన్నటి జగన్మోహన్ రెడ్డి పర్యటన ఏ స్థాయిలో సక్సెస్ అయింది అనే దానిపైన రకరకాల వార్తలు చూస్తున్నాం. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చాలా బలంగా నమ్ముతుంది, చాలా పెద్ద ఎత్తున సక్సెస్ చేయగలిగాం, ఆ ప్రోగ్రాంని, జగన్మోహన్ రెడ్డి పర్యటనకి భారీగా జనాలు వచ్చారు, జన సమీకరణ చేశారా, లేకపోతే జనాలు స్వచ్ఛందంగా వచ్చారా కానీ జనం బాగా కనిపించారు. పర్యటన సక్సెస్ అయిందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుకుంటుంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మెడికల్ కాలేజీల అంశాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి సంబంధించి, మొదటి కార్యక్రమంగా జగన్మోహన్ రెడ్డి నేరుగా, ఓ మెడికల్ కాలేజీని సందర్శించాలనుకున్నారు. ఆ సందర్శలో భాగంగా నర్సీపట్నం నియోజక వర్గంలోని మాకవరపాలెంలో మెడికల్ కాలేజీని సందర్శించారు. దీని ద్వారా రాష్ట్రవ్యాప్తంగా ఒక అటెన్షన్ వచ్చింది, మెడికల్ కాలేజీల అంశంలో ఏం జరుగుతుంది, ఇలాంటి ఒక చర్చ చూశాం.

ఈ సందర్భంగా వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది, వైసార్ కాంగ్రెస్ పార్టీ ఆ మెడికల్ కాలేజీల అంశం పైన ఎటువంటి పోరాటం చేసింది అనే దానికంటే కూడా, దాని వల్ల వచ్చిన స్పందన కంటే కూడా, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన ఆందోళన చూస్తే తెలుగుదేశం పార్టీ, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అంటే ఏ స్థాయిలో భయపడుతుందో అర్థమవుతుంది. తెలుగుదేశం పార్టీలో ఏంటి ఆందోళన అంటే, తెలుగుదేశం పార్టీ నిన్న జగన్మోహన్ రెడ్డి విశాఖపట్నంలోని నర్సీపట్నం వెళ్లి మెడికల్ కాలేజీ సందర్శిస్తారు అని ప్రకటన తర్వాత, ఆయన అక్కడికి బయలుదేరిన తర్వాత, తెలుగుదేశం పార్టీ అఫీషియల్ ట్విట్టర్‌ హ్యాండిల్ లో వరసగా ట్వీట్లు వేస్తూ పోయింది. వరసగా దాదాపు 19 ట్వీట్లు చేశారు. కేవలం జగన్మోహన్ రెడ్డి నర్సీపట్నం పర్యటన అంశానికి సంబంధించి, నిజానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కూడా అంత అటెన్షన్ ఇవ్వలేదు జగన్మోహన్ రెడ్డి పర్యటన గురించి, తెలుగుదేశం పార్టీ ఇచ్చినంత అటెన్షన్, తెలుగుదేశం పార్టీ చూపించినంత కన్సన్, తెలుగుదేశం పార్టీకి సంబంధించిన లక్షలాది మంది, కోట్లాది మంది ఫాలోవర్స్ అంతా జగన్మోహన్ రెడ్డి పర్యటన గురించి తెలుసుకునేలా చేసింది.

తెలుగుదేశం పార్టీ సోషల్ మీడియా, తెలుగుదేశం పార్టీ అఫీషియల్ ట్విట్టర్‌ హ్యాండిల్ 19 ట్వీట్లు జగన్మోహన్ రెడ్డి నర్సీపీట్నం పర్యటన గురించి వాళ్ళు వేశారంటే, 19 సార్లు ట్వీట్ చేసే పరిస్థితి వచ్చిందంటే, 19 సార్లు అక్కడేం తప్పు జరగట్లేదు, జగన్మోహన్ రెడ్డిదే తప్పు, మేము అద్భుతంగా చేశామని చెప్పే ప్రయత్నం అధికార పార్టీ చేసిందంటే, ఏ స్థాయిలో జగన్మోహన్ రెడ్డి అక్కడికి వెళ్ళడం పట్ల తెలుగుదేశం పార్టీలో ఆందోళన కనపడుతుంది అనేదానికి, దాన్ని ఒక ఉదాహరణగా చూడాల్సి ఉంది. నిజానికి ఒక ప్రతిపక్ష నేత, ఆయన ప్రతిపక్ష నేత హోదా కూడా లేదు, ప్రతిపక్ష నేత, మాజీ ముఖ్యమంత్రి, పార్టీ అధ్యక్షుడు, ఆయన అక్కడికి వెళ్తున్నారు, ఆ ప్రోగ్రాం చేసుకుంటారు, వచ్చేస్తారు. దాని గురించి పెద్ద చర్చ లేదు, నిజంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కూడా అంత పెద్ద చర్చ లేదు, కానీ తెలుగుదేశం పార్టీ, ఆ స్థాయిలో ఆందోళన పడడం చూస్తే, మెడికల్ కాలేజీల అంశం అంశంలో, రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా, ప్రజల్లో ఒక అభిప్రాయం రైజ్ అవుతోంది, ప్రజలు ఒక అభిప్రాయానికి వస్తున్నారు లాంటి భయం తెలుగుదేశం పార్టీలో కనపడుతుంది.

జగన్మోహన్ రెడ్డి అక్కడికి వెళ్లి మెడికల్ కాలేజీల అంశాన్ని ప్రస్తావిస్తే, ప్రభుత్వానికి వ్యతిరేకత పెరుగుతుంది, ప్రభుత్వం తీసుకున్న చర్య తప్పు అని ప్రజలంతా భావించే పరిస్థితి ఉంటుంది కాబట్టి, దానికంటే ముందే జగన్మోహన్ రెడ్డి తప్పు చేస్తున్నాడని, లేకపోతే జగన్మోహన్ రెడ్డి గతంలో చేసిన తప్పులేంటో ఇప్పుడు ప్రజల ముందు పెట్టే ప్రయత్నం చేద్దాం, లేదా జగన్మోహన్ రెడ్డి మెడికల్ కాలేజీని అసలుఏం పట్టించుకోలేదు తేలేదు, కట్టలేదు అని ప్రజలకు చెప్పే ప్రయత్నం చేద్దాం, జగన్మోహన్ రెడ్డి అక్కడికి వెళ్లి మాట్లాడడానికంటే ముందే, మనం ఇవన్నీ చేసేద్దాం అనే ఆదుర్ద తెలుగుదేశం పార్టీలో కనబడింది. డాక్టర్ సుధాకర్ అంశాన్ని తెరపైకి తీసుకురావడం కావచ్చు, అక్కడ కొంతమంది దళిత నాయకులతో ర్యాలీలు చేయించడం కావచ్చు, ఇంకా ఇంకా రకరకాల కార్యక్రమాలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అక్కడ ప్రోగ్రాం కోసం చేసిన సన్నద్ధత కంటే, తెలుగుదేశం పార్టీ దాన్ని కౌంటర్ చేయడం కోసం చేసిన ఏర్పాట్లు చేసిన సన్నద్ధత చాలా ఎక్కువగా కనబడింది. ఈ ఎక్కువగా కనపడడం అనేది తెలుగుదేశం పార్టీలో ఆందోళనను సూచిస్తుంది. ఇక్కడ తెలుగుదేశం పార్టీకి ఒక అడ్వాంటేజ్ ఏం దొరుకుతుంది అంటే, నిన్నటి జగన్మోహన్ రెడ్డి నర్సీపట్నం పర్యటనలో మాట్లాడిన మాటలన్నీ చాలా బోరింగ్ గా ఉన్నాయి, మెడికల్ కాలేజీలకు సంబంధించిన అంశం పైన, ఆయన ప్రజల దగ్గరికి వెళ్ళినప్పుడు, మెడికల్ కాలేజీల అంశానికి సంబంధించి ప్రజలకు నష్టం జరిగే నష్టం ఏంటో వివరించాల్సిన పరిస్థితిలో, జగన్మోహన్ రెడ్డి దాన్ని పక్కన పెట్టి దాని గురించి మాట్లాడినప్పటికీ, దానికంటే కూడా ఇంకా ఏదో ఇష్యూస్ అన్నిటిని అక్కడ రైజ్ చేసే ప్రయత్నం చేశారు.

జగన్మోహన్ రెడ్డి నిన్న నర్సీపట్నం మెడికల్ కాలేజీ దగ్గర మాట్లాడుతున్న మాటలు చూసిన వాళ్ళకి ఎవరికైనా బోర్ కొట్టింది. ఈ మాట నేను చెప్పడం కాదు జగన్మోహన్ రెడ్డి ఎదురుగా ఉన్న కార్యకర్తలే సీఎం సీఎం అని నినదించారు తప్ప, ఆయన ఏం మాట్లాడుతున్నారో ఆలకించలేదు, ఆయన అక్కడికి వెళ్ళారు అనేది మాత్రమే హైలైట్ అయింది తప్ప, అక్కడ జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడారు అనేది జనాల్లో చర్చ లేదు, జగన్మోహన్ రెడ్డి వెళ్ళాడు, జగన్మోహన్ రెడ్డికి హైప్ వచ్చింది, జగన్మోహన్ రెడ్డికి జనాలు వచ్చారు, ఇంకేదో ఇంకేదో వీటికి మాత్రమే పరిమితం అవుతున్నారు. ఈ సోషల్ మీడియా హైప్స్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి లాభం చేయవు. జగన్మోహన్ రెడ్డి చెప్పే మాట. జగన్మోహన్ రెడ్డి అక్కడ రైజ్ చేసే ఇష్యూస్. అవి రాష్ట్ర ప్రజలని ఆలోచింప చేసేలా ఉండాలి. జగన్మోహన్ రెడ్డి అక్కడ రాష్ట్రంలో ఉన్న ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే భావిస్తోందో, కూటమి సర్కార్ ప్రజలకి ఏం చేయలేదని, అవన్నీ అక్కడ ఏకరువు పెట్టే ప్రయత్నం చేశారు.


Updated On
ehatv

ehatv

Next Story