పులివెందులలో జెడ్పీటీసీ స్థానానికి ఎన్నిక జరుగుతుంది. జెడ్పీటీసీ స్థానానికి ఎన్నిక జరుగుతున్న సందర్భంగా అధికార పార్టీ అక్కడ చేస్తున్న దౌర్జన్యాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి.

పులివెందులలో జెడ్పీటీసీ స్థానానికి ఎన్నిక జరుగుతుంది. జెడ్పీటీసీ స్థానానికి ఎన్నిక జరుగుతున్న సందర్భంగా అధికార పార్టీ అక్కడ చేస్తున్న దౌర్జన్యాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. అధికార పార్టీ దౌర్జన్యాలు చేస్తుంది అని వైస్రార్ కాంగ్రెస్ పార్టీ (YSRCP)ఆరోపిస్తుంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆరోపణ మాత్రమే కాదు, అధికార పార్టీ దౌర్జన్యాలు చేస్తున్నది నిజమని ఈరోజు ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ పైన జరిగిన దాడి నిరూపిస్తుంది. గతంలో కూడా అధికారంలో ఉన్న సందర్భంగా, అధికార పార్టీలు, ఎన్నికలు వచ్చిన సందర్భంలో, బై ఎలక్షన్స్, ఇంకేదో ఎలక్షన్స్ వచ్చిన సందర్భంగా, బుల్డోజ్ చేసి గెలిచే ప్రయత్నం చాలా సందర్భాల్లో చేశాయి. ఆంధ్రప్రదేష్‌(AP)లో పర్టికులర్‌గా చూస్తూ ఉన్నాం. ఆంధ్రప్రదేష్‌లో గతంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్న సమయంలో, స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి, చాలా మంది ప్రతిపక్ష పార్టీలకు సంబంధించిన వాళ్ళు నామినేషన్లు వేయకుండా అడ్డుకున్నారు లాంటి విమర్శలు ఉన్నాయి. కొన్ని చోట్ల అటువంటి విజువల్స్ కూడా చూశాం. సో ఇప్పుడు పులివెందులలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన సిట్టింగ్ స్థానం జెడ్పీటీసీ స్థానం. అక్కడ బై ఎలక్షన్ జరుగుతోంది, బై ఎలక్షన్ జరుగుతున్న సందర్భంగా బిటెక్ రవి తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నేత ఇంచార్జ్ ఉన్నారు తెలుగుదేశం పార్టీకి. సో ఆయన భార్య తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేస్తున్నారు, ఈ నేపథ్యంలో ఎట్టి పరిస్థితిలో పులివెందుల్లో గెలవాలని అధికార పార్టీ బలంగా నిర్ణయించుకుంది. దానికి సంబంధించి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులని చెదరగొట్టే ప్రయత్నం చేస్తుంది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకుల పైన దాడులు చేసే ప్రయత్నం చేస్తుంది. రమేష్ యాదవ్ నల్లగొండవారిపల్లి అనే విలేజ్ కి వెళ్ళిన సందర్భంగా ఆయన పైన, ఆయన వాహనం పైన దాడి ఏ రకంగా చేశారు అనే విజువల్స్ నేను మీకు పక్కన చూపిస్తున్నాను. ఓ ఎమ్మెల్సీ అక్కడికి వచ్చిన సందర్భంగా ఆయన పైన దాడి చేయాల్సిన అవసరం ఎందుకు వస్తుంది, ఎలక్షన్ క్యాంపెయిన్ ఎవరైనా చేస్తారు, ఎలక్షన్ క్యాంపెయిన్ జరుగుతున్న సందర్భంగా అన్ని పార్టీలకు సంబంధించిన వాళ్ళు ప్రజల దగ్గరికి వెళ్లి ఓట్లు అడిగే ప్రయత్నం చేస్తారు. సో ఇప్పుడు అధికార పార్టీ దాడులు చేసి బెదిరించాలని ఎందుకు అనుకుంటుంది. ఏం సాధించదలుచుకుంటుంది, ఆ ఎన్నికల్లో గెలవడం ద్వారా పులివేందులలో కూడా తెలుగుదేశం పార్టీ గెలిచింది అని చెప్పడం ద్వారా, కొత్తగా కూటమి సర్కార్‌కు వచ్చేది ఏంటి. 164 సీట్లతో అధికారంలోకి వచ్చిన పార్టీ పులివెందుల జెడ్పీటీసీని గెలవడం ద్వారా కొత్తగా సాధించేది ఏంటి, గత అనుభవాల్ని ఎందుకు మర్చిపోతున్నారు, అధికార పార్టీ ఎన్నికల్ని సీరియస్ గా తీసుకొని విజయం సాధించి, ఆ తర్వాత పరాభవాన్ని ఎదుర్కొన్న సందర్భాలు తెలుగుదేశం పార్టీకి చాలా గుర్తుండి ఉండాలి. నంద్యాల బై ఎలక్షన్ సందర్భంగా నంద్యాల బై ఎలక్షన్స్ కోసం అప్పుడు అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ ఎన్ని డబ్బులు ఖర్చు పెట్టిందో, ఏ స్థాయిలో వనరులు సమీకరించిందో, ఏ స్థాయిలో దౌర్జన్యాలు చేసిందో, ఏ స్థాయిలో అక్కడ గెలవడానికి సంబంధించి ప్రయత్నం చేసిందో చూశాం. ఓటుకి 5000 రూపాయలు, 10వే రూపాయలు అక్కడ ఇచ్చారు అంటూ ప్రచారం జరిగింది. చాలా పెద్ద సెన్సేషన్ అయింది నంద్యాల ఉపఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయం సాధించింది, కానీ ఆ తర్వాత కొద్ది నెలల్లోనే జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో నంద్యాలలో ఏం జరిగిందో రాష్ట్రంలో ఏం జరిగిందో తెలుగుదేశం పార్టీ ఎక్స్పీరియన్స్ చేసింది. ఈ అంశంపై సీనియర్‌ జర్నలిస్ట్ 'YNR' విశ్లేషణ..!


ehatv

ehatv

Next Story