YS Jagan Hyderabad Tour : జగన్ పర్యటనే నేరమా ?
జగన్మోహన్ రెడ్డి నిన్న హైదరాబాద్ వచ్చారు. ఆయన విదేశీ పర్యటనలకు సంబంధించిన అంశంపైన వేసిన పిటేషన్‌ను క్లోజ్ చేయడానికి సంబంధించి, ఆయన విదేశీ పర్యటనలకి వెళ్ళడానికి అనుమతి తీసుకున్నారు.

జగన్‌మోహన్ రెడ్డి నిన్న హైదరాబాద్ వచ్చారు. ఆయన విదేశీ పర్యటనలకు సంబంధించిన అంశంపైన వేసిన పిటేషన్‌ను క్లోజ్ చేయడానికి సంబంధించి, ఆయన విదేశీ పర్యటనలకి వెళ్ళడానికి అనుమతి తీసుకున్నారు. విదేశాల నుంచి వచ్చిన తర్వాత వ్యక్తిగతంగా హాజరు కావాలని కోర్టు కోరింది. ఈ నేపథ్యంలో వ్యక్తిగతంగా హాజరుకావడం కోసం హైదరాబాద్ వచ్చారుజ. ఇది అక్రమాల కేసులో విచారణకు వచ్చింది కాదు,విదేశీ పర్యటన నేపథ్యంలో ఉన్న పిటిషన్ నేపధ్యంలో పర్సనల్‌గా వ్యక్తిగతంగా వచ్చి కలవమని కోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు వచ్చి, కోర్టులో అప్పియర్ అయ్యి వెళ్లారు. అప్పియర్ అయ్యి వెళ్ళిన తర్వాత ఆయనకు సంబంధించిన పిటిషన్ కేసు క్లోజ్ అయిపోయింది.
ఇప్పుడు ఈ అంశం పైన జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్ రావడాన్ని చాలా పెద్ద నేరంగా ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిన సెక్షన్ ఆఫ్ మీడియా, ఆంధ్రప్రదేశ్ లోని అధికార పార్టీ మాట్లాడుతోంది. ఏంటి జగన్మోహన్ రెడ్డి హైదరాబాద్ కి రావడంలో నేరం, జగన్మోహన్ రెడ్డి ఇక్కడ చాలా పెద్ద ఎత్తున జనాలని గ్యాదర్ చేశారు అంత అవసరమా, ఆయన ఏమన్నా జాతిపితనా, ఒక నేరస్తుడు, నేరస్తుడు జనాలని గ్యాదర్ చేయడం ఏంటి, ఇలా గ్యాదర్ చేసి ర్యాలీలు తీయడం ఏంటి, ర్యాలీలు తీస్తుంటే పోలీసులు ఏం చేస్తున్నారు, పోలీసులు ఎలా మౌనంగా ఉంటారు, పోలీసులు ఎందుకు మౌనంగా ఉంటారు, ఇంత రాద్దాంతం చేస్తున్నారు, పక్క రాష్ట్రంలో కూడా ఇంత గ్యాదర్ చేయాల్సిన అవసరం ఏంటి, కోర్టులకు కూడా టైం వేయాల్సిన అవసరం ఏంటి, ఫలానా టైంలో నేను కోర్టుకి వస్తానని, కోర్టుకి ఎలా చెప్తారు, ఇదంతా కూడా ప్రజల పాయింట్ ఆఫ్ వ్యూ లో ఏంటి పనికొచ్చేది, తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన ప్రతిపక్షానికి, తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన రాజకీయ పార్టీలకి, తెలంగాణ ప్రాంతానికి సంబంధించిన అధికార పార్టీకి , తెలంగాణలోని పోలీసులకి, కోర్టుకి లేని అభ్యంతరం తెలుగుదేశం పార్టీ మీడియాకి, తెలుగుదేశం పార్టీకి ఎందుకు ఇక్కడ జగన్మోహన్ రెడ్డి రావడం వల్ల న్యూసెన్స్ అయితే, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి రావడం వల్ల ప్రజలు ఇబ్బంది పడితే, ఇక్కడ జగన్మోహన్ రెడ్డి రావడం వల్ల కోర్టులకి, పోలీసులకి ఇబ్బంది అయితే, ఇక్కడ వీళ్ళు రియాక్ట్ అవుతారు కదా, మీకు ఎందుకు అంత ఆత్రం. మీకు ఎందుకు అంత బాధ. దేనికోసం ఎవరిని సంతృప్తి పరచడం కోసం, జగన్మోహన్ రెడ్డి నేరస్తుడు కాబట్టి, చట్టాలను పట్టించుకోవట్లేదు కాబట్టి, ఎన్కౌంటర్ చేసేయాలని మాట్లాడుతారు. నా సహచర జర్నలిస్టులు చాలామంది నిన్న మాట్లాడిన మాటలు చూసిన తర్వాత జాలి అనిపించింది, వాళ్ళ పరిస్థితి చూసి ఎవరికోసం పని చేస్తున్నారో కదా అనిపించింది. మేము ఎవరి కోసం పని చేస్తున్నామో దాచుకోవాల్సిన అవసరం లేదు, మేము బయట పెట్టుకుంటామ అనే విషయాన్ని వాళ్ళు చెప్పడం కనిపించింది. జగన్మోహన్ రెడ్డి ఇక్కడికి వస్తే కోర్టులు కూడా పట్టించుకోకపోతే ఎట్లా, కోర్టులు కూడా పర్టికులర్ టైంలో ఆయన విచారణ చేసి పంపించేస్తారా, అలా ఎలా పంపిస్తారు, ఆయనకు మాత్రమే దక్కిన గౌరవమా ఇది, కోర్టులకు ఈయనే అపాయింట్మెంట్ ఇచ్చి వెళ్లి కలిసి వస్తారా ఇటువంటి భాష మాట్లాడుతున్నారు. జగన్ హైదరాబాద్ రావడమే తప్పు అని మాట్లాడుతున్నవారిపై వైఎన్‌ఆర్ ఎనాలసిస్..!


