Medical College Privatization : ప్రజల కళ్లకు ఆ మీడియా గంతలు..!
ఆంధ్రప్రదేష్‌లో మెడికల్ కాలేజీలు ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వడం పట్ల తీవ్రమైన వ్యతిరేకత ఉంది.

ఆంధ్రప్రదేష్‌లో మెడికల్ కాలేజీలు ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వడం పట్ల తీవ్రమైన వ్యతిరేకత ఉంది. ఆంధ్రప్రదేష్‌లో ఈ స్థాయిలో ప్రజలు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణని వ్యతిరేకిస్తున్నారా అని వైసర్ కాంగ్రెస్ పార్టీ ఇచ్చిన పిలుపుతో రాష్ట్రవ్యాప్తంగా వేల సంఖ్యలో జనాలు రోడ్డు ఎక్కడం చూసిన తర్వాత, ప్రజల్లో ప్రభుత్వ నిర్ణయం పట్ల ఉన్న వ్యతిరేకత అర్థమవుతుంది. ఈ స్థాయిలో ప్రజల వ్యతిరేకత కనపడితే రాష్ట్రవ్యాప్తంగా, ప్రతి ఊర్లో, ప్రతి నియోజక వర్గంలో, ఈ స్థాయిలో ప్రజలు రోడ్డు ఎక్కి ప్రభుత్వ నిర్ణయాన్ని తప్పుపడుతూ నిరసన ప్రదర్శన చేయడం కనబడుతాయి. అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన కార్యక్రమం కావచ్చు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన ఎన్నికల ర్యాలీ కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసిన విజయోత్సవ సభ కాదు అది, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా చేసిన ఆందోళన కార్యక్రమం ప్రజలు పార్టిసిపేట్ చేసిన కార్యక్రమం పిపిపి పద్ధతిలో ప్రైవేట్ వ్యక్తులకు మెడికల్ కాలేజీలు ఇవ్వడాన్ని ఆంధ్రప్రదేశ్ లోని అనేకమంది వ్యతిరేకిస్తున్నారు. చాలా రాజకీయ పార్టీలు కూడా. అటువంటప్పుడు ప్రభుత్వం దాన్ని పట్టించుకోవట్లేదు, ప్రభుత్వం ఈ నిరసనలు ఏమాత్రం పట్టించుకున్నట్టు కూడా కనపడట్లేదు. ఇంటర్నల్ గా నిరసనలు ఉన్నాయని తెలిసినా, ఇంటర్నల్ గా వ్యతిరేకత ఉందని తెలిసినా, వ్యతిరేకత ఉన్నప్పటికీ మనం మన వాళ్ళకి ఇచ్చేయాల్సిందే, అని ప్రభుత్వం అనుకుంటుందేమో అర్థం కాలేదు కానీ, ఆంధ్రప్రదేష్ పట్ల బాధ్యత ఉండాల్సిన మీడియా, ఆంధ్రప్రదేష్ ప్రజలు ఏమనుకుంటున్నారో కనీసం ప్రపంచానికి చెప్పాల్సిన మీడియా ఆంధ్రప్రదేశ్ ప్రజల ఆకాంక్షలకు కనీసం ఒక్క శాతం అయినా అద్దం పట్టేలా రాయాల్సిన మీడియా, చూపించాల్సిన మీడియా కళ్ళు మూసుకుంది. చెవులు మూసుకుంది.
నిన్న ఆ స్థాయిలో రాష్ట్ర రాష్ట్రవ్యాప్తంగా ప్రదర్శనలు రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చూసిన తర్వాత, ఈరోజు ఆంధ్రప్రదేశ్ సంబంధించిన ప్రధాన దిన పత్రికలో, తెలుగు దేశం పార్టీ పత్రికలే ఒక ముక్క రాయలేదు, ఆంధ్రప్రదేష్‌లో నిరసనలే జరగలేదు అన్నట్టు రాశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జెండాలు తీసేసి, వైస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల మొహాలకు మాస్కులు వేసి అయినా, నిరసనను ఐడెంటిఫై చేయాలి కదా. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ పట్ల ఉన్న నిరసనని ఐడెంటిఫై చేయాలి కదా. ఆంధ్రప్రదేశ్ ప్రజల దురదృష్టం మీ మీడియా, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణని నిస్సిగ్గుగా గుడ్డిగా సమర్ధిస్తుంది. అదే ద్రోహం. కనీసం మీరు సమర్ధించారు మీరు ఆ పార్టీలకి అమ్ముడుపోయారు మీరు ఆ పార్టీల కోసం పని చేస్తున్నారో ఏదో నాకు తెలియదు కానీ అక్కడ ప్రజల ఆకాంక్షలనైనా అడ్రెస్ చేయాలి కదా, ప్రభుత్వం నుంచి ప్రతి ఏట వందల కోట్ల రూపాయల అడ్వర్టైస్మెంట్లు తీసుకుంటాం. అది ప్రభుత్వ ధనం అంటే ప్రజల డబ్బు కదా, ప్రజల డబ్బుతో తీసుకున్నప్పుడు ఆంధ్రప్రదేష్ ప్రజలు రోడ్డు ఎక్కి నిదీస్తుంటే, ఆ గొంతుని బయట ప్రపంచానికి వినిపించకుండా చేస్తే ఎట్లా. ఆంధ్రప్రదేశ్‌లో మీడియా వైఖరిపై సీనియర్ జర్నలిస్ట్ 'YNR' ఎనాలసిస్..!


