తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పరిస్థితి చూస్తే అయ్యో పాపం అనిపిస్తుంది.

తెలంగాణలో తెలుగుదేశం పార్టీ పరిస్థితి చూస్తే అయ్యో పాపం అనిపిస్తుంది. తెలంగాణలో తెలుగుదేశం పార్టీ ఉందా అసలు, తెలుగుదేశం పార్టీని చూసి అయ్యో పాపం అనే పరిస్థితి ఉందా అంటే, అలా అనుకునే వాళ్ళు కూడా ఉన్నారు కానీ, తెలుగుదేశం పార్టీ తెలంగాణలో ఉంది, తెలంగాణలో తెలుగుదేశం పార్టీకి సంబంధించి ఇంకా ఓ డజన్ మందికి పైగా కీలకమైన నేతలు ఉన్నారు. వాళ్ళు యాక్టివ్‌గా పార్టీ కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేస్తూ ఉన్నారు. ఇటీవల సభ్యత్వం నమోదు కూడా చేసింది తెలంగాణలో తెలుగుదేశం పార్టీ. ఆంధ్రప్రదేశ్ లో 2024 ఎన్నికల్లో పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత టిడిపి అధినేత చంద్రబాబు హైదరాబాద్ కి వచ్చి ఎన్టీఆర్ ట్రస్ట్ భవన్ లో మీటింగ్ పెట్టి ఇకపైన ప్రతి వారం ఒకరోజు నేను తెలంగాణ తెలుగుదేశం పార్టీ కోసం సమయం ఇవ్వబోతున్నాను, వారంలో ఒకరోజు ట్రస్ట్ భవన్ కేంద్రంగా మనం కార్యక్రమాలు చేసుకుందాం, తెలంగాణలో తెలుగుదేశం పార్టీని బలోపేతం చేద్దాం అంటూ, తెలంగాణ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులకు దిశా నిర్దేశం చేశారు. మీరు కష్టపడి పని చేయండి, పార్టీని ఇక్కడ మళ్ళీ మనం రివ్యాంప్ చేయొచ్చు, నేను మీకు టైం ఇస్తాను ప్రతివారం, గతంలో ఇవ్వలేకపోయాను, 14 నుంచి 19 మధ్యలో, ఈసారి మాత్రం సమయం ఇస్తాను అని చెప్పారు.
కారణం ఏంటో తెలియదు కానీ ఆ మీటింగ్ లో చెప్పిన తర్వాత ఆయన ఒకసారి రెండు సార్లు కూడా తెలంగాణ తెలుగు దేశం పార్టీకి సంబంధించిన నాయకులతో, ట్రస్ట్ భవన్లో సమావేశం కాలా, పార్టీ అధికారంలోకి వచ్చి ఆంధ్రప్రదేశ్లో 15 నెలలు దాటుతోంది, బట్ ఒక్కసారి కూడా తెలంగాణ తెలుగుదేశం భవిష్యత్తు ఏంటి, తెలంగాణలో తెలుగుదేశం పార్టీ విస్తరణకు సంబంధించో, పార్టీని బలోపేతం చేయడానికి సంబంధించి ఏం చేయాలనేది, నాయకులకు ఆరోజు చెప్పిన మాటని, ఆ తర్వాత ఎక్కడ ఆయన నిలబెట్టుకున్నట్టు కనపడలే, అడపా దడపా కొంతమంది నాయకులు వెళ్లి అక్కడ కలిసి రావడమో, లేకపోతే ఇక్కడ ఇక్కడికి ఆయన వచ్చినప్పుడు వెళ్లి కలవడమో చేస్తున్నారు తప్ప, ఇక సభ్యత్వ నమోదు, మహానాడు కార్యక్రమాల సందర్భంగా తెలంగాణ తెలుగుదేశం పార్టీ శాఖ, తెలంగాణ తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకత్వం, ఈ వ్యవహారాలన్నీ కాస్త అటెన్షన్ ని తీసుకొస్తూ ఉన్నాయి. సో గడిచిన శాసనసభ ఎన్నికల సందర్భంగా తెలంగాణలో 2023లో, శాసన సభ ఎన్నికల సందర్భంగా తెలంగాణలో, తెలుగుదేశం పార్టీ అన్ని స్థానాల్లో పోటీ చేయాలని నిర్ణయం తీసుకున్నప్పటికీ, తెలంగాణ పార్టీ అటువంటి నిర్ణయం తీసుకున్నప్పటికి, పార్టీ అధ్యక్షుడిగా ఉన్న కాసాని జ్ఞానేశ్వర్ అప్పుడు అన్ని చోట్ల పోటీ చేయాలని నిర్ణయం తీసుకొని, అన్ని చోట్ల పోటీకి సంబంధించి సమాయాతం అవుతున్న టైంలో ,తెలుగు దేశం పార్టీ అనుూహ్యంగా తెలంగాణలో అసలు అసెంబ్లీ ఎన్నికలో పోటీ చేయకూడదు అని నిర్ణయం తీసుకుంది.
రాజకీయ పార్టీ అసెంబ్లీ ఎన్నికలో అసలు పోటీ చేయకూడదని నిర్ణయం తీసుకోవడం అనేది అనూహ్యం. డెఫినెట్గా కనీసం ఒక 60-70 స్థానాల్లో అభ్యర్థులని పెట్టగలిగిన పరిస్థితిలో ఉన్న తెలుగుదేశం పార్టీ అసలు పోటీ చేయకూడదని నిర్ణయం తీసుకుంది. పోటీ చేయకూడదని నిర్ణయం తీసుకున్నా సరే ఎవరో ఒకరికి మద్దతు తెలిపారా, అటు భారతీయ జనతా పార్టీకి, మా మద్దతనో ఇటు, లేదు జనసేన పార్టీకి మా మద్దతనో, లేకపోతే కాంగ్రెస్ పార్టీకి మా మద్దతనో, ఏదో ఎవరికో ఒకరికి మద్దతు ప్రకటించి ఉండాలి. ఎవరికీ మద్దతు ప్రకటించలేదు. తాము మాత్రం పోటీ చేయకూడదు అని ఓ విలక్షణమైన నిర్ణయం, ఎప్పుడు ఎక్కడ ఎటువంటి రాజకీయ పార్టీ తీసుకొని ఒక నిర్ణయం తెలుగుదేశం పార్టీ తీసుకుంది.సీనియర్ జర్నలిస్ట్ 'YNR' విశ్లేషణ..
