ఏబీ వెంకటేశ్వరరావు గడిచిన ఐదేళ్ల కాలంలో ఆంధ్రప్రదేశ్‌లో జగన్ సర్కార్‌కు వ్యతిరేకంగా పోరాటం చేస్తూ వచ్చారు.

ఏబీ వెంకటేశ్వరరావు గడిచిన ఐదేళ్ల కాలంలో ఆంధ్రప్రదేశ్‌లో జగన్ సర్కార్‌కు వ్యతిరేకంగా పోరాటం చేస్తూ వచ్చారు. జగన్ సర్కార్ తనని అక్రమంగా సస్పెండ్ చేసిందంటూ ఆరోపిస్తూ వచ్చారు. ఆ సందర్భంలో జగన్ సర్కార్‌పై న్యాయ పోరాటం చేశారు. క్రింది స్థాయి కోర్టు నుంచి సుప్రీం కోర్టు వరకు ఆల్మోస్ట్ న్యాయ పోరాటం చేసి జగన్ సర్కార్ దిగిపోతున్న కొద్ది రోజుల ముందు పోస్టింగ్ తీసుకున్నారు. ఆయన పోస్టింగ్ తీసుకున్న రోజే రిటైర్మెంట్ కూడా అయ్యారు. సో ఆయనకు గడిచిన ఐదేళలో జగన్మోహన్ రెడ్డి సర్కార్ ఆయన్ని వేధించింది లాంటి ఒక చర్చ తెలుగుదేశం పార్టీ మీడియాలో జరగడం చూశాం. జగన్మోహన్ రెడ్డి సర్కార్‌పై ఏబి వెంకటేశ్వరావు ఫైట్ చేయడం కూడా లీగల్‌గా చూశాం. ఆయన గతంలో 2014 నుంచి 19 వరకు తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్న సమయంలో ఇంటెలిజెన్స్ చీఫ్ గా ఉన్నారు. ఆ సమయంలో వైసీపీ ఎమ్మెల్యేల కొనుగోలు అంశం.. వైసీపీ ఎమ్మెల్యేలు 23 మంది టీడీపీలోకి వెళ్లడం వెనక ఏబి వెంకటేశ్వరరావు ఉన్నారు.. అప్పుడు ఎమ్మెల్యేలను బెదిరించి ప్రలోభ పెట్టి వాళ్లు టీడీపీలోకి వెళ్ళేలా చేశారని ఒక ఆరోపణ అప్పుడు వైసీపీ చేసింది. దానికి రివెంజ్‌గానే బహుశా వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏబీవీని వేధించిందన్న ఇంప్రెషన్ ఉంది. ఏబి వెంకటేశ్వరావు గడిచిన ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలవాలని కోరుకున్నారు. తెలుగుదేశం పార్టీ విజయాన్ని కాంక్షించారు. వైసీపీ ఓటమి కోసం ఆయన ప్రయత్నం చేశారు. సో గడిచిన ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో తెలుగుదేశం పార్టీ కూటమే విజయం సాధించింది. తెలుగుదేశం పార్టీ కూటమే విజయం సాధించిన తర్వాత ఏబి వెంకటేశ్వరావుకు ఏదో కీలకమైన పదవి ఉంటుంది.. చాలా ప్రయారిటీ ఈ ప్రభుత్వంలో ఆయనకు ఉంటుంది అంటూ చాలా మంది భావించారు. ఏబి వెంకటేశ్వరరావు భావించారో లేదో తెలియదు కానీ చాలా మంది భావించారు. నిజానికి ఎన్నికల సమయంలో ఎన్నికల కంటే కొద్దిగా ముందు ఓ సెక్షన్ ఆఫ్ పోలీస్ ఆఫీసర్లంతా తెలుగుదేశం పార్టీకి అనుకూలంగా కూటమి నాయకత్వానికి అనుకూలంగా పని చేసేలా ఏబి వెంకటేశ్వరరావు చేశారంటూ వార్తలు వచ్చాయి. ఎన్నికలు జరుగుతున్న సందర్భంలోనే పోలీస్ అధికారి, మాజీ పోలీస్ అధికారులు తెలుగుదేశం పార్టీ ఆఫీస్‌లో కూర్చొని ఎలక్షన్ కమిషన్ అడ్డం పెట్టుకొని జిల్లాల ఎస్పీలకు ఫోన్లు చేసి బెదిరిస్తూ వాళ్లు కూటమికి అనుకూలంగా పని చేసేలా ఒత్తిడి చేస్తున్నారని వైసీపీ ఆరోపించింది. సో ఆ స్థాయిలో తెలుగుదేశం పార్టీ విజయం కోసం ఏబీవీ పని చేశారన్నఒక ఇంప్రెషన్ ఉంది. అటువంటి ఏబి వెంకటేశ్వరరావుపై ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ కక్ష కట్టినట్టు కనపడుతోంది.ఈ అంశంపై సీనియర్‌ జర్నలిస్ట్ 'YNR' విశ్లేషణ..!

ehatv

ehatv

Next Story