Phone Tapping : ట్యాపింగ్‌పై ఆ మీడియా పిచ్చి కూతలు..!
తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించిన వ్యవహారంపైన చర్చ చూస్తున్నాం. రాజకీయంగా దానికి సంబంధించిన వార్తలని చూస్తున్నాం.

తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించిన వ్యవహారంపైన చర్చ చూస్తున్నాం. రాజకీయంగా దానికి సంబంధించిన వార్తలని చూస్తున్నాం. బీఆర్‌ఎస్, కాంగ్రెస్ పార్టీల మధ్య విమర్శలు ప్రతివిమర్శలు చూస్తున్నాం. మధ్యలో భారతీయ జనతా పార్టీకి సంబంధించిన నాయకులు కూడా బీఆర్ఎస్ (BRS)పైన విమర్శలు చేయడం చూస్తున్నాం. అసలు ఏంటి ఫోన్ ట్యాపింగ్ ఫోన్ ట్యాపింగ్ ఎలా నేరం ఎక్కడ నేరం.. ఎందుకు నేరం ప్రభుత్వాలు ఫోన్ టాప్ చేయటం నేరమేనా... ప్రభుత్వాలు ఏ ప్రభుత్వం ఎక్కడ ఫోన్ ట్యాపింగ్ చేయట్లేదా.. ఏడాది కాలంలో కాంగ్రెస్ సర్కారు ఎవ్వరి ఫోన్లని టాప్ చేయలేదా అంటే చేస్తాయి.. కచ్చితంగా దేశంలోని అన్ని రాష్ట్రాలు భారతదేశం కూడా ఫోన్లు టాప్ చేస్తూ ఉంటుంది. ఎందుకంటే ఎన్నికైన ప్రభుత్వాలు తమ ప్రభుత్వం స్టేబుల్‌గా ఉండటానికి సంబంధించి తమ ప్రభుత్వాన్ని కూల్చే కుట్రలు ఎవరైనా చేస్తున్నారా.. తమ ప్రభుత్వాన్ని అస్థిరపరచడానికి జరుగుతున్న ప్రయత్నాలు ఏంటి.. రాజద్రోహానికి ఎవరైనా పాల్పడుతున్నారా అనే దానిపైన తెలుసుకోవడం కోసం ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్ ఫోన్ ట్యాపింగ్(Phone Tapping) చేస్తుంది. ఫోన్ ట్యాపింగ్ ఫోన్లు అందుబాటులోకి వచ్చిన తర్వాత వచ్చింది.. అంతకుముందు ఇంటెలిజెన్స్ వాళ్లు ఫిజికల్‌గా వెళ్లి సమాచారాన్ని సేకరించే వాళ్లు.. రకరకాల వ్యక్తుల ద్వారా రకరకాల మార్గాల ద్వారా సమాచారాన్ని స్వీకరించేవాళ్లు. సొంతంగా ఏజెట్లు పెట్టుకునే వాళ్లు.. పోలీస్ డిపార్ట్మెంట్ కి సంబంధం లేకుండా కొంతమందికి డబ్బులు ఇచ్చి సమాచారాన్ని తెప్పించుకునే వాళ్లు.. సో ఇప్పుడు ఫోన్ టాప్ చేయడం ద్వారా ఎవరు ఎవరితో ఏం మాట్లాడుతున్నారో తెలుసుకునే అవకాశం ఉంది కాబట్టి అన్ని ప్రభుత్వాలు అనేక సందర్భాల్లో ఫోన్ ట్యాపింగ్ కి పాల్పడుతూ ఉన్నాయి. సో ఇటువంటి ఫోన్ ట్యాపింగ్ చేయడం కారణంగానే తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత తొలి ఏడాదిలోనే తెలంగాణ(Telangana) రాష్ట్ర ప్రభుత్వాన్ని కూల్చే కుట్రని అప్పటి ప్రభుత్వం బయట పెట్టగలిగింది. తెలంగాణ రాష్ట్ర సర్కార్‌ను కూల్చాలి.. ఎమ్మెల్యలని కొనేయాలి అని ఆంధ్రప్రదేశ్(Andhra pradsh)కు సంబంధించిన ఒక రాజకీయ పార్టీ చేసిన ప్రయత్నాలని ఫోన్ ట్యాపింగ్ ద్వారానే అప్పటి తెలంగాణ తొలి సర్కారు బయట పెట్టింది. ఆ ప్రయత్నాలని తిప్పికొట్టింది. ఆ ప్రభుత్వాన్ని, ఆ పార్టీ నాయకుడిని ఇక్కడి నుంచి పంపించేసింది. సో ప్రభుత్వాలని కాపాడుకోవడం కోసం ప్రభుత్వాన్ని అస్థిరపరిచే ప్రయత్నాలను అడ్డుకోవడం కోసం ఫోన్ ట్యాపింగ్ చేయడం తప్పేమీ కాదు.. అయితే గత ప్రభుత్వంలో బీఆర్ఎస్ పాలనలో ఈ ఫోన్ ట్యాపింగ్ ద్వారా కొంతమందికి సంబంధించిన వ్యక్తిగత విషయాలను తీసుకొని వాళ్లని బ్లాక్ మెయిల్ చేసి.. వాళ్ల ద్వారా రాజకీయ వాళ్ళ ద్వారా వాళ్ళని రాజకీయంగా వేధించారని వాళ్లని.. ఆర్థికంగా వేధించారని వాళ్లని లైంగికంగా కూడా వేధించారనేది ప్రస్తుతం ఉన్న ఆరోపణ. ఈ ఆరోపణలపైన అనే ప్రస్తుతం విచారణ జరుగుతుంది. విచారణ చేస్తున్న సిట్ గతంలో మా ఫోన్లు టాప్ అయ్యాయి అని బయట మీడియాతో మాట్లాడిన కొంతమంది నేతలకు నోటీసులు ఇచ్చి పిలిచి వాళ్లని విచారణ చేస్తున్నారు. ఈ అంశంపై సీనియర్ జర్నలిస్ట్ 'YNR'విశ్లేషణ..!
