ఏపీలో కల్తీ మద్యం వ్యవహారంపైన ప్రభుత్వం సిట్‌ని ఏర్పాటు చేసింది.

ఏపీలో కల్తీ మద్యం వ్యవహారంపైన ప్రభుత్వం సిట్‌ని ఏర్పాటు చేసింది. నిన్న ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు సిట్‌ని ఏర్పాటు చేస్తున్నట్టుగా ప్రకటించారు. సిట్ ఏం చేస్తుంది, సిట్ చేసేది ఏమీ ఉండదు డెఫినెట్ గా ఈ మాట చెప్పగలం. ఆంధ్రప్రదేశ్ కు సంబంధించి గత ప్రభుత్వం కావచ్చు, గతంలో చంద్రబాబు నాయుడు 14 నుంచి 19 వరకు ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో కావచ్చు, 19 నుంచి 24 వరకు జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలో కావచ్చు, ఇప్పుడు కావచ్చు, ఎన్ని సిట్‌లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏర్పడయ్యాయో, ఏ సీట్ ఏం తేల్చిందో ప్రజలకి ఎవరికీ గుర్తులేదు, సిట్‌ల ఏర్పాటు మాత్రమే గుర్తుంది, సిట్‌లు తేల్చింది ఏంటో ఎవరికీ గుర్తులేదు. ఎందుకంటే అసలు ఏమి తేల్చట్లేదు సిట్‌లు ప్రభుత్వాలు ఏం చెప్తే అది రాస్తున్నాయి, సిట్‌లు ప్రభుత్వాలు కూర్చోమంటే కూర్చుంటున్నాయి, లేవమంటే లేస్తున్నాయి. ప్రభుత్వం సిట్ అంటే సిట్ మోడ్లోకి వెళ్ళిపోతున్నాయి.
ఈ కారణంగానే ప్రభుత్వాలు సిట్ వైపు మొగ్గు చూపుతూ ఉన్నాయి. లడ్డు పైన వేసిన సిట్ ఏమైంది. ఆంధ్రప్రదేశ్‌లో జగన్మోహన్ రెడ్డి సర్కారు చేసిన అక్రమాల పైన సిట్‌లు ఏర్పాటు చేసిన అంటూ చాలా సిట్‌లు వేశారు, ఏమైనాయి. వివేకానంద రెడ్డి హత్య కేసు పైన సిట్‌లు వేశారు, మూడు నాలుగు సిట్‌లు ఏం తెలిచాయి. విశాఖ భూముల కుంభకోణం పైన సిట్‌లు వేశారు, సిట్ వన్ సిట్ సిట్ త్రీ లేదో చాలా వేశారు. ఏమన్నా తెల్చాయా ఏ అంశంలో సిట్ ఏం తెలిచింది . ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఏం తేల్చలా, అధికార పార్టీ ప్రభుత్వంలో ఉన్న ముఖ్యులు ఏం చెప్తే అవి చేయడానికే సిట్‌లు ఉన్నాయి. మరి ఎందుకు సిట్ వేయాల్సి వచ్చింది, కల్తీ మదంమం అంశం పైన సిట్ వేయడం అంటే, ప్రభుత్వం కల్తీ మద్యాన్ని కంట్రోల్ చేయడంలో ఫెయిల్ అయినట్టుగానే భావించాలి. కల్తీ మద్యం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో విచ్చలవిడిగా నడుస్తుంది అని ప్రభుత్వం అంగీకరించినట్టుగా భావించాలి కదా. ఇక్కడ తప్పు జరిగింది, ఫ్యాక్టరీలు పెట్టి ఎవడో కల్తీ మద్యాన్ని షాపులకు అమ్ముతున్నాడు, ప్రజలకందరికీ కల్తీ మద్యాన్ని సప్లై చేస్తున్నాడు అని, ప్రభుత్వం కూడా నమ్మింది కాబట్టి, ఆ అంశం పైన మరిన్ని వివరాలు తెలుసుకోవడం కోసం సిట్ వేసిందని భావించాలి.ఈ అంశంపై సీనియర్ జర్నలిస్ట్ 'YNR' విశ్లేషణ..
