ఐబొమ్మ రవి అరెస్ట్ కు సంబంధించిన వ్యవహారం పైన చాలా వీడియోస్ ఇంతకుముందు కూడా మనం చేసుకున్నాం.

ఐబొమ్మ రవి అరెస్ట్ కు సంబంధించిన వ్యవహారం పైన చాలా వీడియోస్ ఇంతకుముందు కూడా మనం చేసుకున్నాం. ఐబొమ్మ రవి అరెస్టు తర్వాత ఆయనకు చాలా పెద్ద ఎత్తున సమాజం నుంచి మద్దతు రావడం చూస్తున్నాం. ఆయన చేసిన తప్పు ఏంటి అంటూ ప్రశ్నించడం చూస్తున్నాం. ఆయనకు మద్దతుగా మేము ఉన్నామంటూ మాట్లాడుతున్న వాళ్ళ సంఖ్య సోషల్ మీడియాలో విస్తృతంగా పెరుగుతోంది. అనేకమంది రవికి మద్దతుగా ఉంటున్నారు. రవి తప్పేం లేదు అని చెప్తున్నారు. రవి ఆ వైపు వెళ్ళడం వెనక సినిమా పరిశ్రమే ఉంది అని చెప్తున్నారు. రవి పెడుతున్న పైరసీ సినిమాలు జనం చూడడానికి కారణం సినిమా రేట్లు ఎక్కువగా ఉండడమే అని చెప్తున్నారు.

సినిమా రేట్లు ఎక్కువ చేసి ప్రజల్ని అటువైపు మళ్లిచ్చింది. సినిమా ఇండస్ట్రీనే అని చెప్తున్నారు, కొద్దిమంది వ్యాపారులు కొద్దిమంది లాభాల కోసం కోట్లాది మంది ప్రేక్షకుల్ని దోపిడికి గురి చేస్తున్నారు, ఆ దోపిడి నుంచి రవి ప్రేక్షకులని కాపాడాడు అని చెప్తున్నారు. ఒక రాబిన్‌ హుడ్ లాగా ఓ మధ్య తరగతి దేవుడిలాగా రవిని కొలుస్తున్నారు. ఓ నేరం చేసిన వ్యక్తి పట్ల ఈ స్థాయిలో ప్రేమ ఆప్యాయత జనాలు చూపడం, ఈ స్థాయిలో కన్సర్న్ చూపడం చాలా అరుదు అటువంటి అరుదైన ఘటన, రవి విషయంలో మనం చూస్తున్నాం. ఈ సందర్భంగా రవి ఎందుకు అలా తయారవ్వాల్సి వచ్చింది, రవిని అలా తయారు చేసింది ఎవరు, సినిమా ఇండస్ట్రీ దానికి కారణమా కాదా ఆలోచన చేసుకోవాల్సిన అవసరం, ఆత్మ విమర్శ చేసుకోవాల్సిన అవసరం ఇండస్ట్రీ పైన ఖచ్చితంగా ఉంటుంది. అలాంటి ఆత్మ విమర్శ చేసుకోకపోగా, రవిని ఒక దేశద్రోహిగా ఆయన్ని ఎన్‌కౌంటర్‌ చేయాలి తరహా మాటలు సినిమా ఇండస్ట్రీ వైపు నుంచి మాట్లాడుతున్నారు. ఇది రవిని అభిమానిస్తున్న వాళ్ళలో మరింత కోపాన్ని పెంచుతోంది. ఆయనకు మద్దతును కూడా మరింతగా పెంచుతోంది.

ఈ సందర్భంగా సరే రవి చేసింది తప్పే, పోలీసులు అరెస్ట్ చేశారు, ఏం జరుగుతుందో చూద్దాం. దీంతో పైరసీ ఆగిపోతుందా, ఇక వచ్చే వారం నుంచి రిలీజ్ అవుతున్న సినిమాలన్నీ, కోర్టులు కుమ్మరిస్తాయా, ఇక సినిమా ఇండస్ట్రీలో ఫ్లాప్‌లే ఉండవా కేవలం రవి కారణంగానే సినిమా ఇండస్ట్రీ అంతా నష్టపోతే, ఇప్పుడు రవి అరెస్ట్ చేసి లోపల వేసి ఆయన వెబ్సైట్లు అన్నీ క్లోజ్ చేశారు కాబట్టి, ఇక ఇండస్ట్రీకి నష్టాలు ఉండవా, ఇండస్ట్రీ రేపటి నుంచి కలకలలాడిపోతుందా, థియేటర్లకి జనాలు క్యూ కడతారా, ఇంటర్నెట్ లో అందుబాటులో లేదు కాబట్టి సినిమా మల్టీప్లెక్స్ వైపే వస్తారా, ఆ ధైర్యం ఉందా, సినిమా ఇండస్ట్రీ చెప్పగలదా, ఆ నమ్మకం ఉందా, సినిమా ఇండస్ట్రీ కి చెప్పగలదా, చెప్పలేదు ఎందుకంటే రవి పోతే ఇంకో రవి పుట్టుకొస్తారు. ఐ బొమ్మ కాకపోతే ఇంకో బొమ్మ పుట్టుకొస్తుంది. ఈ అంశంపై సీనియర్ జర్నలిస్ట్ 'YNR' విశ్లేషణ..!


Updated On
ehatv

ehatv

Next Story