Uttam Kumar Reddy : ఉత్తంకుమార్‌రెడ్డికి ఆత్మగౌరవం ఉంది..! సీఎంపై తిరగబడ్డారా..!
తెలంగాణకు సంబంధించిన సీనియర్ పొలిటీషియన్ పీసీసీ మాజీ అధ్యక్షుడు, ప్రస్తుత మంత్రి ఉత్తంకుమార్‌రెడ్డికి ఆత్మగౌరవం ఉంది.

తెలంగాణకు సంబంధించిన సీనియర్ పొలిటీషియన్ పీసీసీ మాజీ అధ్యక్షుడు, ప్రస్తుత మంత్రి ఉత్తంకుమార్‌రెడ్డికి ఆత్మగౌరవం ఉంది.నాకు ఆత్మగౌరవం ఉంది అని నిన్న ప్రూవ్ చేశారు. ఆయన ఆయన ఆత్మగౌరవం లేదని నీకు డౌట్ ఎప్పుడు వచ్చింది. ఆయన ఆత్మగౌరవం ఉందని, నిన్న నీకు ఎప్పుడు ప్రూవ్ అయింది అంటే, కొద్ది రోజుల క్రితం ఆంధ్రజ్యోతి గ్రూప్ సంస్థల అధినేత వేమూరి రాధాకృష్ణ ఒక ఆర్టికల్ రాశారు.ఆ ఆర్టికల్ లో తెలంగాణ మంత్రులంతా పనికిమాలిన వాళ్ళు అని రాశారు. తెలంగాణ మంత్రులకు క్యాబినెట్ సమావేశంలో ముఖ్యమంత్రి తలంటారు అని రాశారు.
తెలంగాణ మంత్రులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్యాబినెట్ సమావేశంలో వార్నింగ్‌లు ఇచ్చారు అని రాశారు.తెలంగాణ మంత్రులకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి క్యాబినెట్ సమావేశంలో మీరు ఇలాగే ఉంటే మీ సంగతి చూస్తానని వార్నింగ్ ఇచ్చారు అని రాశారు. ఇక నేను తాడో పేడో తేల్చుకుంటాను అని చెప్పి అన్నాడు అని రాశారు, ఎవరిని ఉంచాలో, ఎవరిని పీకేయాలో డెసిషన్ తీసుకుంటాను అని రేవంత్ రెడ్డి మంత్రులను ఉద్దేశించి అన్నారు అని రాశారు. పర్టికులర్ గా పేరు పెట్టి మరీ ప్రతీ మంత్రిని మీరేం చేస్తున్నారు, మీరు ఏమడిగారు మీకు ఏం చేశాను, మీరు నా వెనక గోతులు ఎలా తీస్తున్నారు అనే విషయాన్ని వాళ్ళకే చెప్పి, ఆయన ఓ గంట సేపు అధికారులందరినీ బయటికి పంపించి తలంటే కార్యక్రమం చేశారు. డబ్బాలు డబ్బాలు షాంపూలు కూడా దానికి వాడారు అని రాశారు. ఆయన ఇంకా చాలా రాశారు, ముఖ్యమంత్రి ఒక్కడు కష్టపడుతున్నాడు, మొత్తం మంత్రులంతా ప్రభుత్వ ఇమేజ్‌ను డామేజ్ చేస్తున్నారు, ముఖ్యమంత్రి ఒక్కడు కష్టపడుతున్నారు, మొత్తం మంత్రులంతా అవినీతిలో కూరుకుపోయారు, ముఖ్యమంత్రి ఒక్కడు కష్టపడుతున్నారు, మొత్తం మంత్రులంతా రాష్ట్రంలో పాలనని దివాళా తీయించేశారు, ప్రజల్ని గాలికి వదిలేశారు, ఇది సదరు పత్రికాధిపతి రాసిన మాటల వెనక ఉద్దేశం, వెనక ఉద్దేశం కాదు ముందు ఉద్దేశం కూడా అది. ఓపెన్ గానే రాశారు, ఆయన ఆ మాటలు రాసిన తర్వాత, దాంతో పాటు ఇంకో మాట కూడా రాశారు, ఏ మాట కొంతమంది మంత్రులు, మహిళా అధికారులని, ఇంటికి పిలిపించుకొని రివీల్ చేస్తున్నారు అని రాశారు. చాలా పెద్ద అలిగేషన్ అది,ఎవరు మాట్లాడలే ఆ ఆర్టికల్ తర్వాత రోజు ఒకరోజు గ్యాప్ ఇచ్చి నేను ఒక వీడియో చేశా.
జర్నలిస్ట్ వైఎన్ఆర్ ఛానల్ ద్వారా, ఏమని మంత్రుల్ని తల అంటింది నిజమా, కాదా తల అంటితే అంటించుకున్నామని, అంటించుకోకపోతే అంటించుకోలేదని, ఆయన తిడితే తిట్లు తిన్నామని, లేకపోతే ఆయన మమ్మల్ని తిట్టలేదని, మేము ఏ మహిళా అధికారిని ఇంటికి పిలిపించుకోలేదని, లేదా పిలిపిస్తే పిలిపించాం, ఇక పిలిపించమని, ఏదో ఒకటి మంత్రుల వైపు నుంచి ఒక రెస్పాన్స్ ఉండాలిగా. మంత్రులు రెస్పాండ్ అవ్వాలి కదా, ఓ పత్రిక ముఖ్యమంత్రి కోసం మాత్రమే పని చేసే పత్రికగా పేరున్న పత్రిక, మొత్తం మంత్రుల క్యారెక్టర్స్ ని అసాసినేట్ చేస్తున్నట్టుగా వార్త రాస్తే, ఆ వార్త నిజమా కాదా కనీసం చెప్పలేని పరిస్థితిలో మంత్రివర్గం మొత్తం ఉండటం, ఆత్మగౌరవం లేకపోవడం కదా అనిపించింది. ఏ ఒక్క మంత్రికి ఆత్మగౌరవం లేదా అనిపించింది, ఏ ఒక్క మంత్రి దీనిపైన స్పందించడా అనిపించింది, అడిగాను, అందుకే మంత్రులకు ఆత్మగౌరవం లేదా, మిమ్మల్ని తిట్టాడా, మీకు తలకుపోశాడామీకు వార్నింగ్‌లు ఇచ్చాడా, మిమ్మల్ని బెదిరించాడా, ఇవన్నీ చేశాడని ఆయన రాశాడు. అది అవునో కాదో చెప్పలేని పరిస్థితిలోకి మీరు ఎందుకు వెళ్ళిపోయారు, కనీసం స్పందించండి, ఆత్మగౌరవంతో స్పందించండి, పదవులు ఉంటే ఉంటాయి పోతాయి, పదవులతో పుట్టలేదు,పదవులతో పోరు.
ఎవరు కానీ అటువంటి వ్యాఖ్యలు రాస్తే మీ కుటుంబ సభ్యులకైనా మీరు ఆన్సర్ చేయాలి కదా, మీ కుటుంబ సభ్యులని అడుగుతారు కదా, ముఖ్యమంత్రి తిట్టాడు అంట కదా డాడీ, మిమ్మల్ని ఇంట్లో పిల్లలని అడుగుతారు కదా, వాళ్ళకన్నా ఆన్సర్ చెప్పాలి కదా, ఆ మాత్రం ఆత్మగౌరవం లేకుండా ఎందుకున్నారు. తెలంగాణ ప్రజలు అంటేనే, తెలంగాణ గడ్డ, తెలంగాణ ప్రజలు మేజర్ గా వర్రీ అయ్యేది ఆత్మగౌరవం కోసమే, ఆత్మగౌరవం కోసం నినదించిన గడ్డ ఆత్మగౌరవం కోసం మాత్రమే పోరాడిన ప్రాంతం ఇది. అటువంటి ప్రాంతంలో మంత్రులను తిట్టారని పెద్దగా తాటికాయ అంత అక్షరాలతో రాస్తే ఒక్కడు మాట్లాడడా ఏంటి, ఒక్కరు మాట్లాడరు, ఏంటి వీళ్ళ ఆత్మగౌరవం చచ్చిపోయిందా అని అడిగారు. సరే ఎమ్మటే కాకపోయినా నిన్న ఉత్తం కుమార్ రెడ్డి స్పందించారు. సదరు విలేకరులను మాకు ఎవరూ తలంటలేదు, మాకు తలంటే పరిస్థితి ఏమీ ఉండదు తరహాలో. మమ్మల్ని తలంటారు అనే రాసిన వార్త శుద్ధ అబద్ధం, మీరు అటువంటి వార్తలు ఎందుకు వండి వారుస్తున్నారో మాకు తెలుసు, ఇక మీ ఇష్టం అని ఆయన వ్యాఖ్యానించినట్లుగా ఒక కథనాన్ని చూశారు.ఈ అంశంపై సీనియర్ జర్నలిస్ట్ 'YNR' ఎనాలసిస్..!


