Vallabhaneni Vamsi : వేధింపుల నుంచి వల్లభనేనికి విముక్తి..!
వల్లభనేని వంశీ దాదాపు 140 రోజుల తర్వాత ఈరోజు ఆయన జైలు నుంచి విడుదల అయ్యారు.

వల్లభనేని వంశీ దాదాపు 140 రోజుల తర్వాత ఈరోజు ఆయన జైలు నుంచి విడుదల అయ్యారు. వల్లభనేని వంశీ అరెస్ట్ అయిన సందర్భంగా చాలా మంది తెలుగుదేశం పార్టీకి సంబంధించిన నాయకులు సంబరాలు చేసుకున్నారు.. జబ్బలు జరుచుకున్నారు.. చప్పట్లు కొట్టుకున్నారు.. మేము అరెస్ట్ చేసాం రెడ్ బుక్ రాజ్యాంగం ఎలా ఉంటదో చూపిస్తున్నాం అని మాట్లాడారు. కొంతమంది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు కావచ్చు ఇతర రాజకీయ పార్టీలకి సంబంధించిన నాయకులు కూడా వల్లభనేని వంశి అరెస్టుని గట్టిగా ఖండించలేకపోయారు. వల్లభనేనని వంశీని అరెస్ట్ చేయడం సరైందే లాంటి ఒక ఇంప్రెషన్ కూడా ఆయన అరెస్ట్ అయిన సందర్భంగా చాలా వర్గాల్లో కనబడింది. కారణం ఏంటంటే ఆయన గతంలో అప్పటి మాజీ సీఎం చంద్రబాబు నాయుడు గారి సతీమణి గురించి చేసిన కొన్ని వ్యాఖ్యలు.. ఆ వ్యాఖ్యల కారణంగా సమాజంలో ఆయనకు మద్దతు లేకుండా పోయింది. సో ఆ వ్యాఖ్యల కారణంగా ఆయనకు సమాజంలో మద్దతు లేకుండా పోయింది కాబట్టి దాన్ని అడ్వాంటేజ్‌గా తీసుకొని ప్రభుత్వం ఆయన పైన వరసగా కేసులు నమోదు చేస్తూ వచ్చింది. ఓ కేసులో బెయిలు వస్తుంది అంటే మరో కేసు పెట్టి ఆయన్ని మళ్లీ లోపలే ఉంచే ప్రయత్నం చేసింది. పిటీ వారెంట్ల పేరుతో దాదాపు నాకు తెలుసు ఒక 6, 7 కేసెస్ ఆయన పైన నమోదు చేసినట్టున్నారు. కంటిన్యూస్‌గా కేసులు నమోదు చేయడం ద్వారా ఎక్కువ కాలం ఆయన్ని జైల్లో ఉంచాలనే ప్రయత్నం చేసింది. సో ఇటీవల ఓపెన్ గా బహిరంగ సభల్లో మీటింగ్ లో నారా లోకేష్ మాట్లాడుతూ వస్తున్నారు.. మా అమ్మ గురించి మాట్లాడాడు ఒకడు వాడి సంగతి ఎలా ఉందో చూశారు కదా జైల్‌కి వెళ్లడానికి ముందు ఎలా ఉన్నాడు.. జైల్ కి వెళ్ళిన తర్వాత ఎలా ఉన్నారో చూశారు కదా అన్నారు. సో ఈ ఒక్క పాయింట్ ని దయచేసి గమనించమని కోరుతున్నా.. అందరూ గత ముఖ్యమంత్రి సతీమణిని తిట్టాడు అనే కారణంతో కేసు పెట్టి వల్లభనేని వంశీని అరెస్ట్ చేసి జైలుకి పంపిస్తే ఎవ్వరికీ అభ్యంతరం ఉండదు.. ఎవరూ అభ్యంతరం వ్యక్తం చేసే పరిస్థితి లేదు.. బట్ దాన్ని మనసులో పెట్టుకొని ఆ కారణంగా తప్పుడు కేసులు పెట్టి చట్టం కళ్లు కప్పి ఆయన పైన అక్రమంగా ఆయన్ని జైల్లో ఉంచే ప్రయత్నం చేసింది ప్రభుత్వం. ఈ అంశంపై సీనియర్ జర్నలిస్ట్ 'YNR' విశ్లేషణ..
- journalistynrvallabhanenivamsiysjaganysrcpvijayawadavallabhanenivamsireleaseapnewssupremecourtaphighcourtVallabhaneniVamsiVamsiReleased137DaysInJailVamsiOutOnBailAndhraPoliticsTDPYSRCPVamsiJailStoryAPPolitics2025VamsiVsTDPPoliticalTwistBreakingNewsAPVamsiIsBackVallabhaneniVamsiNewsAndhraPradeshehatv
