రాజకీయాల్లో ఉన్న నాయకులు భాష పట్ల జాగ్రత్తగా ఉండాలి, భాష అంటే బూతులు మాట్లాడకుండా ఉండడానికి మాత్రమే, జాగ్రత్తగా ఉండడం కాదు, భాష అంటే బూతులు మాట్లాడడం మాత్రమే తప్పు కాదు

రాజకీయాల్లో ఉన్న నాయకులు భాష పట్ల జాగ్రత్తగా ఉండాలి, భాష అంటే బూతులు మాట్లాడకుండా ఉండడానికి మాత్రమే, జాగ్రత్తగా ఉండడం కాదు, భాష అంటే బూతులు మాట్లాడడం మాత్రమే తప్పు కాదు, మనం మాట్లాడుతున్న భాష అవతలి వ్యక్తుల మనోభావాలని దెబ్బ తీయకుండా ఉండాలి, అవతల వ్యక్తులని హర్ట్ చేయకుండా ఉండాలి, వర్గాల మధ్య కులాల మధ్య విభేదాలు తీసుకొచ్చేలా ఉండకూడదు, అలా ఉండకూడదు అనే క్రమంలో మేమంతా ఒకటే అని చెప్పే క్రమంలో, ఇంకొకరిని తక్కువ చేసి మాట్లాడే ప్రయత్నం చేయడం కూడా సరైంది కాదు. ఇటీవల కృష్ణా జిల్లాలో కార్తీక వనభోజనాలకు సంబంధించిన కమ్యూనిటీ ఏర్పాటు చేసింది. ఆ కార్యక్రమానికి ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ వెళ్ళారు, వసంత కృష్ణ ప్రసాద్ తో పాటు అక్కడికి మాజీ ఎమ్మెల్యే మాజీ వైసీపీ నేత ప్రస్తుత జనసేన నేత కాపు సామాజిక వర్గానికి సంబంధించిన సామినేని ఉదయభాను కూడా వెళ్ళారు. కార్తీక వనభోజనాల కార్యక్రమానికి కాపు సామాజిక వర్గానికి సంబంధించిన ఉదయబానును కూడా పిలిచారు.

అక్కడ అందరూ కలిసి ఆ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేశారు. ఒక చిన్న డయాస్ ఏర్పాటు చేశారు, డయాస్ మీద ఉపన్యాసాలు ప్రసంగాలు జరుగుతున్నాయి, ఈ ప్రసంగాలు జరుగుతున్న సందర్భంగా సామినేని ఉదయభానుని ఉద్దేశించి వాళ్ళద్దరు గతంలో వైసీపీలో ఎమ్మెల్యేలుగా పని చేశారు. కాబట్టి నేను తొందరగా బయటపడ్డాను, ఉదయబాను కూడా ముందే వైసీపీ నుంచి బయటపడి ఉంటే, ఇప్పుడు ఎమ్మెల్యే గా మాతో పాటు ఉండేవాడు, ఆలస్యం చేశాడు, నష్టపోయాడు, ఓడిపోయాడు ఇవన్నీ ఏదో మాట్లాడాడు, ఆయన ఇవన్నీ మాట్లాడారు వసంత కృష్ణ ప్రసాద్. ఓకే గానీ ఆయన మాట్లాడిన మరొక మాట ఆంధ్రప్రదేశ్ లో కాపు సామాజిక వర్గంలో అసంతృప్తికి కారణం అవుతుంది. ఏం మాట్లాడారు ఆయన కాపు-కమ్మ విభేదాలు అవసరం లేదు, అందరూ కలిసే ఉండాలనేది, బహుశా ఆయన ఇంటెన్షన్, ఆయన ఇంటెన్షన్ తప్పు అని చెప్పడం నా ఉద్దేశం కాదు కానీ, ఆయన మాట్లాడే క్రమంలో, ఆయన మిగతా వాళ్ళ కంటే మేము ఎక్కువ, మాకంటే మిగతా వాళ్ళు తక్కువ అనే భావాన్ని వెలిబుచ్చారు. ఏంటది ఆయన ఏం మాట్లాడారో, చిన్న కమ్మోళ్ళు అంటే కాపులు, పెద్ద కమ్మోళ్ళు అంటే కమ్మోళ్ళు, ఎందుకంటే ఆర్థికంగా మొదటి నుంచి పొలాలు కలిగి ఉన్నారు. కాబట్టి రెండు కలిపి ఊరిలో తక్కువ పొలం ఉంటే వాళ్ళని కాపులు అనేవాళ్ళు, మా ఊర్లో అంతే తప్పితే ఇక్కడ ఏమి వ్యత్యాసం లేదు.ఆయన మాట్లాడుతున్న దాని ప్రకారం గ్రామాల్లో మా చిన్నప్పుడు ఎక్కువ భూములు ఉన్నవాళ్ళనేమో కమ్మోలు అనేవాళ్ళు, తక్కువ భూములు ఉన్నవాళ్ళను కాపులు అనేవాళ్ళు చిన్న కమ్మోలు అనేవాళ్ళు అని ఆయన ఉద్దేశం. అంటే కాపులు కమ్మ వాళ్ళ కంటే సెకండ్ గ్రేడ్ అనేది ఆయన మాటల్లో ధ్వనించిన శబ్దం.ఈ అంశంపై సీనియర్ జర్నలిస్ట్ 'YNR' విశ్లేషణ..!


Updated On
ehatv

ehatv

Next Story