Vijayasai Reddy : జగన్‌ను సాయిరెడ్డి మిస్సవుతున్నారా ?
వైసీపీ మాజీ నేత, మాజీ ఎంపి విజయసాయి రెడ్డి నిన్న ఒక ప్రకటన చేశారు. ఆయన ప్రకటన సారాంశం ఏంటి అంటే, తాను రాజకీయాలలో ప్రస్తుతం లేను, తాను ప్రస్తుతానికి ఒక రైతును మాత్రమే అనే విషయాన్ని చెప్తున్నారు.

వైసీపీ మాజీ నేత, మాజీ ఎంపి విజయసాయి రెడ్డి నిన్న ఒక ప్రకటన చేశారు. ఆయన ప్రకటన సారాంశం ఏంటి అంటే, తాను రాజకీయాలలో ప్రస్తుతం లేను, తాను ప్రస్తుతానికి ఒక రైతును మాత్రమే అనే విషయాన్ని చెప్తున్నారు. విజయసాయిరెడ్డి చాలా కాలంగా మౌనంగా ఉంటూ వస్తున్నారు. ఆయన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేశారు, రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు, ఆ తర్వాత లిక్కర్ స్కాం అంశానికి సంబంధించి పోలీసుల సిట్ ఎదుట విచారణకు హాజరయ్యారు. విచారణకు హాజరైన సందర్భంగా కొంతమంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులపైన, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వానికి దగ్గరగా ఉన్న వ్యక్తుల పైన విమర్శలు చేస్తూ వచ్చారు. ఆయన గత ప్రభుత్వంలో లిక్కర్ అంశానికి సంబంధించి, ప్రభుత్వానికి సంబంధించిన కొంతమంది వ్యక్తులకు వ్యతిరేకంగా, వాంగ్మూలం ఇచ్చారు లాంటి వార్తలు వచ్చినప్పటికీ, ఆయన సిట్ అధికారులకు చెప్పిన సమాచారం ఏంటో ఓపెన్ గానే చెప్పారు. రాజ్‌కసి రెడ్డికి సంబంధించి, ఆయన తన దగ్గర ఉన్న సమాచారాన్ని చెప్పినట్లుగా చెప్పారు. ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన నాయకులు విజయసాయిరెడ్డితో దూరం మెయింటైన్ చేస్తూ వస్తున్నారు. నిజానికి విజయసాయిరెడ్డి వైసీపీ కి రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన సందర్భంలో. వైసీపీ నాయకులు ఎవరూ ఆయన పైన పెద్ద ఎత్తున విమర్శలు చేయలేదు.
గతంలో వైసీపీని వదిలి వెళ్ళిన నాయకుల పట్ల వ్యవహరించినట్లుగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీగాని ,వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం గాని, విజయసాయిరెడ్డిపై విమర్శలు చేయలేదు. విజయసాయిరెడ్డి తీసుకున్న నిర్ణయాన్ని గౌరవిస్తున్నామంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారికంగా స్పందించింది. ఆ సమయంలో, ఆ తరువాత నేరుగా మాజీ సీఎం వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి, విజయ సాయిరెడ్డిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్య, విజయసాయిరెడ్డికి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి గ్యాప్‌ని మరింత పెంచింది. అఫ్కోర్స్ రాజీనామా చేసిన తర్వాతే సంబంధం లేదనుకోండి, ఆయనకు ఆ పార్టీకి మధ్యలో ఉన్న ఒక ఎమోషనల్ బాండ్ ని తగ్గించే ప్రయత్నం చేసింది. ప్రలోభాలు ఉన్నాయనో, ఎవరో భయపెట్టారనో, ఎవరో బెదిరించారనో, క్యారెక్టర్ ని పోగొట్టుకుంటే ఎట్లా, రాజకీయలో ఉన్నప్పుడు క్యారెక్టర్ ఉండాలి కదా అంటూ జగన్మోహన్ రెడ్డి, విజయసాయిరెడ్డిని ఉద్దేశించి ఒక వ్యాఖ్య చేశారు. దానికి కౌంటర్‌గా విజయసాయిరెడ్డి కూడా చెప్పారు. తాను భయపడే వ్యక్తిని కాదు, తాను ప్రలోభాలకు లొంగే వ్యక్తిని కాదు, తన క్యారెక్టర్ పోగొట్టుకునే వ్యక్తిని కూడా కాదు, నేను క్యారెక్టర్ ని పోగొట్టుకోలేదు, అనే విషయాన్ని కూడా విజయ సాయి రెడ్డి ఆ తర్వాత ట్వీట్ చేయడం చూశాం. అక్కడితో ఆగిపోయింది వ్యవహారం, ఆ తర్వాత ఆయన ఎక్కడ మళ్ళీ మాట్లాడలేదు, విజయ్ సాయిరెడ్డికి గవర్నర్ ఇస్తున్నారు, విజయసాయి రెడ్డి భారతీయ జనతా పార్టీలో చేరబోతున్నారు, ఇటువంటి వార్తలు కూడా సోషల్ మీడియాలో చాలా వచ్చాయి, కానీ అవి నిజం కాలేదు, అయితే తాజాగా నిన్న శ్రీకాకుళం జిల్లాలో రెడ్డీ సంక్షేమం సంఘానికి సంబంధించిన ఆత్మీయ సమావేశంలో ఆయన పార్టిసిపేట్ చేశారు, పార్టిసిపేట్ చేసిన సందర్భంగా విజయ్ సాయి రెడ్డి రాజకీయాలకు సంబంధించిన అడిగిన ప్రశ్నలకు కూడా సమాధానం చెప్పారు. ఏంటా ప్రకటన..దీనిపై సీనియర్ జర్నలిస్ట్ 'YNR' విశ్లేషణ..!


