IPS Puran Case : IPS ఆఫీసర్ పురాణ్ హత్య కేసులో ఏం జరుగుతోంది..!
ఐపిఎస్ అధికారి పూరణ హత్య కేసుకు సంబంధించి ఎంత ఒత్తిడి వస్తున్నా కుటుంబం ఆందోళన చేస్తున్నా, పోస్టుమార్టం జరగకుండా వారం రోజులుగా డెడ్ బాడీ అలాగే ఉన్నా, కేంద్రం వైపు నుంచి చలనం కనిపించట్లేదు సరి కదా

ఐపిఎస్ అధికారి పూరణ హత్య కేసుకు సంబంధించి ఎంత ఒత్తిడి వస్తున్నా కుటుంబం ఆందోళన చేస్తున్నా, పోస్టుమార్టం జరగకుండా వారం రోజులుగా డెడ్ బాడీ అలాగే ఉన్నా, కేంద్రం వైపు నుంచి చలనం కనిపించట్లేదు సరి కదా, ఇంకా ఈ కేసు జటిలం చేయడానికి సంబంధించిన ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆ ప్రయత్నాలు ఎవరు చేస్తున్నారు అనేదానికి నేను ప్రత్యేకంగా ఆన్సర్ చెప్పాల్సిన అవసరం లేదు. కానీ డెఫినెట్ గా ఆ ప్రయత్నం చాలా సీరియస్ గా జరుగుతుంది, నిన్నటికి నిన్న మరొక అధికారి, మరో పోలీస్ అధికారి ఆత్మహత్య చేసుకున్నారు. హర్యాణలో సుందీప్ కుమార్ అనే అధికారి ఏఎస్ఐ పూరణ్‌పైన వచ్చిన అవినీతి ఆరోపణలకు సంబంధించిన కేసుని విచారణ చేస్తున్న అధికారి, ఈ విచారణ చేస్తున్న అధికారి, సడన్ గా రివాల్వర్ తో కాల్చుకొని ఆత్మహత్య చేసుకోవాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది అనేది ఇప్పుడు ప్రశ్న. ఆయన ఆత్మహత్య చేసుకుంటున్న సందర్భంగా ఒక లేఖ రాశారు, మళ్ళీ ఆయన రాసిన లేఖలో చనిపోయిన పూరణ్‌కి వ్యతిరేకంగా అనేక మాటలు ఉన్నాయి, పూరణ్ అవినీతిపరుడు, పూరణ్ కుటుంబాన్ని వదలొద్దు, పూరణ్ కుటుంబాన్ని శిక్షించాలి అంటూ సందీప్ కుమార్ ఆత్మహత్య లేఖలో రాసినట్లుగా సమాచారం.
లేఖ ఇప్పటి వరకు బయటికి రాలేదు. ఆ జిల్లా అధికారులు, జిల్లా ఎస్పీ ఆ లేఖ ఇప్పటికే బయటకి వస్తే ఇంకా ఇబ్బంది అవుతుంది, అది ఫోరెన్సిక్ వాళ్ళకి ఎవరికో పంపించాం, బట్ లేఖలోని అంశాలు మాత్రం బయటికి వచ్చాయి. లేఖలోని అంశాల ప్రకారం ఏ ఎస్పీ పైన అయితే, డిజీపితో పాటు ఏ ఎస్పీ పైన అయితే పూరణ్ కుమార్ ఆరోపణలు చేశారో, ఏ ఎస్పీ కుల వివక్ష చూపించాడు అని చెప్పారో, ఏ ఎస్పీ తనను వేధించారు అని చెప్పారో, ఆ ఎస్పీ చాలా మంచివాడు అని సందీప్ కుమార్ లేఖ రాశారు. ఆ ఎస్పీ చాలా అద్భుతమైన వ్యక్తి అంటూ లేఖ రాశారు, చనిపోయిన పూరణ్ చాలా అవినీతిపరుడు అంటూ రాశారు. పూరణ్ కుటుంబాన్ని, వదలద్దు పూరణ్ కుటుంబం పూర్తిగా అవినీతిలో కూరుకుపోయింది అంటూ రాశారు. సదరు ఎస్పీ మాటల మేరకు సందీప్ కుమార్ ఏఎస్ఐ గా ఉన్న సందీప్ కుమార్, పూరణ్‌కు దగ్గరగా ఉంటున్నారు అని భావిస్తున్న ఒక కానిస్టేబుల్ ని సస్పెండ్ చేశారు. ఆ కానిస్టేబుల్ ని సస్పెండ్ చేయడానికి సంబంధించి కీలకమైన వ్యక్తిగా సందీప్ కుమార్ వ్యవహరించారు, ఆ సందీప్ కుమార్ ఇప్పుడు ఆత్మహత్యకు పాల్పడ్డారు, సందీప్ కుమార్ కుటుంబం ఏమనుకుంటుంది అనేది బయటికి రావాల్సి ఉంది, సందీప్ కుమార్ కుటుంబాన్ని పూరణ్ వేధించినట్లు, పూరణ్ హింసించినట్లు ఎక్కడా లేదు. ఎందుకంటే సందీప్ కుమార్ పై ఆఫీసర్ గా పూరణ్ ఎక్కడా లేరు, మరి సందీప్ కుమార్ ఆత్మహత్య చేసుకునే పరిస్థితి ఎందుకు వచ్చింది.ఈ అంశంపై సీనియర్ జర్నలిస్ట్ 'YNR' విశ్లేషణ..
