Phone tapping: ఫోన్‌ ట్యాపింగ్‌కు, పార్టీ ఫండింగ్‌కు లింకేంటి..!

తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ అంశానికి సంబంధించిన విచారణ డైలీ సీరియల్‌లా సాగుతోంది. ఈ ఫోన్ ట్యాపింగ్ కి సంబంధించిన అంశంపైన దాదాపు రెండేళ్లుగా తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ ఆధ్వర్యంలో విచారణ జరుగుతోంది. సీట్ ఇప్పటికే అనేక మందిని అరెస్టులు చేసింది, నెలల తరబడి కొంతమంది పోలీస్ అధికారులు జైల్లో ఉన్నారు. అనేకమంది పోలీస్ అధికారులను విచారణ కూడా చేసింది. అయితే ఈ అంశానికి సంబంధించి రెండు రోజుల నుంచి బిఆర్ఎస్ పార్టీ అగ్రనేతలు హరీష్‌రావు, అలాగే కేటీఆర్‌లను కూడా విచారణకు పిలిచింది. ఈ విచారణకు పిలిచిన సందర్భంగా రోజుకో లీకులు రావడం చూస్తూ ఉన్నాం. ఫోన్ ట్యాపింగ్ అంశం మొదట్లో వెలుగు చూసిన సందర్భంగా, చాలా పెద్ద ఎత్తున ప్రభుత్వ అనుకూల మీడియాలోనో, ప్రభుత్వానికి సంబంధించిన అధికార పార్టీకి సంబంధించిన నాయకులు మాట్లాడిన మాటలు ఏంటి అంటే, ఫోన్ ట్యాపింగ్ చేసి అనేకమంది హీరోయిన్ల వ్యక్తిగత విషయాలను తెలుసుకున్నారు. సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళ వ్యక్తిగత విషయాలను తెలుసుకున్నారు. కొంతమంది బ్లాక్ మెయిల్ చేశారు, ఈ తరహ క్యాంపెయిన్‌ని అధికార పార్టీ అనుకూల మీడియా చేస్తూ వచ్చింది. శాటిలైట్ ఛానల్ లో కూడా కేటీఆర్ అండ్ టీం సినిమా ఇండస్ట్రీ వాళ్ళని బ్లాక్ మెయిల్ చేయడం కోసం ఫోన్ ట్యాపింగ్ ని వాడుకున్నారు అంటూ, మాట్లాడుతూ ఉండడం చూశాం. అనేక వార్తా కథనాలు వండి వార్చడం కూడా ఆ సందర్భంగా చూశాం. బహుశా నిజమేనేమో అదంతా అని అనుకునే వాళ్ళందరికీ ఆ తర్వాత అటువంటిది ఏమీ లేదు, ఈ ఫోన్ ట్యాపింగ్ ని బెదిరింపుల కోసం, పారిశ్రామిక వేత్తలని బెదిరించడం కోసం చేశారు లాంటి ఆరోపణలు కూడా ఆ తర్వాత చేయడం చూశాం. ఇతర పార్టీలకు సంబంధించిన నాయకుల మూమెంట్ ని తెలుసుకోవడం కోసం, ఫోన్ ట్యాపింగ్ చేశారు లాంటి వార్తలని కూడా చూశాం. అప్పుడు ప్రతిపక్ష పార్టీగా ఉన్న భారతీయ జనతా పా,ర్టీ కాంగ్రెస్ పార్టీలకు సంబంధించిన నాయకుల ఫోన్లు ట్యాపింగ్ చేయడం కోసం, బిఆర్ఎస్ పార్టీ ఈ అనేకమంది ఫోన్లను ట్యాప్ చేసింది, ప్రస్తుత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇంటి సమీపంలోనే ఒక ప్రత్యేకమైన నిఘాగా పరికరాలను ఇజ్రాయిల్ నుంచి కొనుక్కొచ్చి మరి ఫోన్ ట్యాపింగ్ చేశారు లాంటి వార్తలు, కథనాలు లీకులు చాలా చూశాం. ఎండ్ గా ఇప్పుడు ఈరోజు కేటీఆర్ విచారణ జరుగుతున్న సందర్భంగా అధికార పార్టీకి సంబంధించిన మీడియాలో, అధికార పార్టీ వైపు నుంచి వస్తున్న వార్తలు ఏంటి అంటే, కేటీఆర్ అంట ఫోన్ ట్యాపింగ్ చేసి కొంతమంది పారిశ్రామిక వేత్తలని బెదిరించి, వాళ్ళ ద్వారా ఎలక్టోరల్ బాండ్స్ తీసుకున్నారు, బిఆర్ఎస్ పార్టీకి ఎలక్షన్ ఫండ్ కోసం, బిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఫండ్ కోసం వాళ్ళని బెదిరించారు అనేది తాజా వార్త. ఈ వార్త నిజమైతే ఇప్పటి వరకు చేసిన క్యాంపెయిన్ అంతా బక్వాస్ క్యాంపెయిన్ గా చూడాలా, ఏది నిజమని నమ్మాలి, ఇప్పటి వరకు సిట్ ఈ అంశానికి సంబంధించి ఏమి విచారణ చేశారు, ఏం తేల్చారు, ఏం అనుమానాలు ఉన్నాయి, వీటికి సంబంధించి సిట్ ఎక్కడ అఫీషియల్ గా ఎటువంటి ప్రకటన చేయలేదు కానీ, ప్రభుత్వానికి సంబంధించిన, ఆ ప్రభుత్వానికి సంబంధించిన పెద్దల నుంచి, ప్రభుత్వానుకూల మీడియా నుంచి కథనాలు మాత్రం కథనాలు చాలా వస్తూ ఉండడం చూశాం. తాజా కథనం ఏంటి అంటే, పార్టీ ఫండ్ కోసం కొంతమంది పారిశ్రామిక వేత్తలని బెదిరించి డబ్బులు వసూలు చేశారు అని. ఒక చిన్న ఎగ్జాంపుల్ చూద్దాం, ఇక్కడ ఎవరైనా కిడ్నాప్ చేస్తే, కిడ్నాప్ చేసి మీరు నాకు డబ్బులు ఇవ్వండి అని డిమాండ్ చేస్తే, ఆ తీసుకునే డబ్బులు చెక్ రూపంలో తీసుకుంటారా, వైట్ మనీ ఇవ్వండి, మాకు చెక్ రాసి ఇవ్వండి, మేము కిడ్నాప్ చేసిన మీ వాళ్ళని వదిలేస్తామని అంటారా, బిఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు వ్యాపారస్తుల్ని వాళ్ళ ఫోన్లు విని. బెదిరించి. బ్లాక్ మెయిల్ చేసి పార్టీకి ఎలక్టోరల్ బాండ్స్ రూపంలో, డబ్బులు తీసుకుంటారా, ఎలక్టోరల్బాండ్స్ అనేవి ఓపెన్ కదా, ఎవరు ఇచ్చారు, ఎంత ఇచ్చారు క్లియర్ గా ఉంటుంది కదా, పైగా వైట్ మనీ కదా, పార్టీకి ఫండ్ రైజ్ చేయడం కోసం, ఫోన్ ట్యాపింగ్లు చేసి, వాళ్ళని బెదిరించే పరిస్థితి, అటువంటి అవసరం ఉంటుందా. ఈ అంశంపై పూర్తి విశ్లేషణ ఈ వీడియోలో..!

Updated On
ehatv

ehatv

Next Story