Journalist YNR : ఓట్ల చోరీపై మౌనమేలా.. సీనియర్ జర్నలిస్ట్ 'YNR' సూపర్ ఎనాలసిస్..!
ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం, ప్రపంచంలోనే అతి గొప్ప ప్రజాస్వామ్య దేశం

ప్రపంచంలోనే అతి పెద్ద ప్రజాస్వామ్య దేశం, ప్రపంచంలోనే అతి గొప్ప ప్రజాస్వామ్య దేశం, ప్రపంచంలో చాలా దేశాల్లో నియంత పాలనలు వచ్చాయి, సైన్యం తిరుగుబాటు చేయడం చూశాం, ప్రజల తిరుగుబాటు చేయడం చూశాం, కానీ భారతదేశం మాత్రం 75 సంవత్సరాలుగా ప్రజాస్వామ్యాన్ని చాలా పర్ఫెక్ట్ గా అమలు చేస్తూ వచ్చింది. ప్రజాస్వామ్యం భారతదేశంలో సక్సెస్ ఫుల్ అయింది. ఇది చాలా సందర్భాల్లో డెమోక్రటిక్ సిస్టం గురించి మాట్లాడుకుంటున్నప్పుడు, పెద్దవాళ్ళు చెప్పే మాటలు. కానీ ఇటీవల భారతదేశంలో జరుగుతున్న పరిణామాలు చూసినప్పుడు, ప్రధానంగా భారతదేశ ఎన్నికల ప్రక్రియకు సంబంధించి వస్తున్న అనుమానాలు చూసినప్పుడు, భారతదేశంలో ప్రజాస్వామ్యం ఒక ఫార్స్ గా మారిపోయిందా, భారతదేశంలో ప్రజాస్వామ్యం చీటింగ్ కి గురవుతుందా, భారతదేశంలో ప్రజాస్వామ్యం కొంతమంది వ్యక్తుల చేతిలో నలిగిపోతుందా అని అనిపిస్తుంది.
ఎందుకు ఈ మాటలు చెప్పాల్సి వస్తుంది అంటే, భారతదేశంలో ఎన్నికల ప్రక్రియ పైన, ఎన్నికలు నిర్వహిస్తున్న ఏజెన్సీ పైన చాలా పెద్ద ఎత్తున అనుమానాలు వస్తున్నాయి, ఆరోపణలు గతంలోనే వచ్చాయి. బట్ ఇప్పుడు అనుమానాలు వస్తున్నాయి, ఈ అనుమానాలు రాజకీయ పార్టీలకు ఎన్నికల్లో పోటీ చేస్తున్న అభ్యర్థులకు మాత్రమే కాదు, సాధారణ ప్రజలకు కూడా వస్తున్నాయి. సాధారణ ప్రజల్లో కూడా ఇటువంటి అనుమానాలు బలపడుతున్నాయి. గతంలో ఓడిపోవడానికి రీజన్స్ వెతుక్కుంటూ, గెలవడానికి రీజన్స్ చెప్పుకుంటూ నాయకులు మాట్లాడేవాళ్ళు ఎలక్షన్ కమిషన్ గురించి, బట్ ఈరోజు సాధారణ ప్రజలు మాట్లాడుకుంటున్నారు, నేను వేసిన ఓటు సరిగ్గానే కాస్ట్ అయిందా, సరిగ్గానే నేను ఎవరికైతే ఓటు వేశానో వాళ్ళకే వెళ్ళిందా, లేదా అనే అనుమానాన్ని సాధారణ ప్రజలు, సాధారణ ఓటర్లు వ్యక్తం చేస్తున్నారు. సో ఇది భారతదేశ ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉంది అనడానికి ఒక సంకేతం. దేశం మొత్తం, మొత్తం ప్రపంచంలో అత్యధికమంది ఓ ప్రక్రియలో, ఒక ప్రజాస్వామ్య ప్రక్రియలో, పార్టిసిపేట్ చేసే చర్య ఎన్నికలు దాదాపు కొన్ని కోట్ల మంది ప్రజలు, కొన్ని కోట్ల మంది ప్రజలు ఎన్నికల్లో పార్టిసిపేట్ చేసి తమ కన్సర్న్ తెలియజేయడం అనేది ప్రపంచంలో భారతదేశం మినహా ఇంకెక్కడా లేదు. ఇంత స్థాయిలో, ఈ స్థాయిలో ప్రజలు వచ్చి ఓటు హక్కును వినియోగించుకోవడం అనేది.
అటువంటి ఓటు హక్కు వినియోగం జరుగుతున్న దేశంలో ఆ ఓటు హక్కుని ఎవరో కొనేస్తున్నారు, ఎవరో టాంపర్ చేస్తున్నారు, ఎవరో మిస్‌లీడ్ చేస్తున్నారు, ఎవరో కొంతమంది కోసం , మరి కొంతమంది దాన్ని యూటిలైజ్ చేస్తున్నారు లాంటి ఒక చర్చకు ఇప్పుడు ఆస్కారం రావడం అనేది, దేశానికి మంచిది కాదు. ఇటీవల రాహుల్ గాంధీ బయట పెట్టిన నిజాలు చూసిన తర్వాత ఏ ఒక్కరు కూడా రాహుల్ గాంధీని తప్పు పట్టే పరిస్థితి లేకుండా పోతోంది. ఈవెన్ రాహుల్ గాంధీ ఎవరిపైనతే ఆరోపణలు చేశారో, అటువంటి ఎలక్షన్ కమిషన్ కూడా, రాహుల్ గాంధీ నువ్వు చెప్పింది తప్పు అని మాట్లాడలేకపోతుంది. ముసుగులో దాక్కొని ట్విట్టర్‌లో ట్వీట్ చేస్తోంది, తప్ప ఎలక్షన్ కమిషన్ ధైర్యంగా ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టి, రాహుల్ నువ్వు చెప్పింది తప్పు, రాహుల్ బెంగళూరు సెంట్రల్ పార్లమెంట్ నియోజక వర్గానికి సంబంధించి నువ్వు చెప్పింది తప్పు, ఇదిగో ఆధారాలు అని ఎలక్షన్ కమిషన్ చెప్పే పరిస్థితి లేకుండా పోయింది. సో ఈ ఒక్క కారణం చాలు ఎలక్షన్ కమిషన్ తప్పు చేసింది అని చెప్పడానికి, రాహుల్ వేసిన ప్రశ్నలకు సంబంధించి, రాహుల్ అడిగిన ప్రశ్నలకు సంబంధించి సమాధానం చెప్పలేక, బిక్క చచ్చిపోయి కూర్చున్న ఎలక్షన్ కమిషన్ని చూస్తే, ఈ దేశంలో ఎన్నికలు ఎలా జరుగుతున్నాయో మనం అర్థం చేసుకోవచ్చు. ఈ అంశంపై సీనియర్ జర్నలిస్ట్ 'YNR' విశ్లేషణ..
