సూపర్‌ సిక్స్‌కు మంగళం పాడేసింది కూటమి సర్కార్‌ అనేది నిన్న చంద్రబాబు వ్యాఖ్యలను చూస్తే ఎవరికైనా అర్థమవుతుంది.

సూపర్‌ సిక్స్‌కు మంగళం పాడేసింది కూటమి సర్కార్‌ అనేది నిన్న చంద్రబాబు వ్యాఖ్యలను చూస్తే ఎవరికైనా అర్థమవుతుంది. సూపర్‌ సిక్స్‌ అమలుకు సంబంధించి ప్రస్తుతం అమలు చేయలేం, సంపద సృష్టించిన తర్వాతనే అమలు చేస్తామని చంద్రబాబు నేరుగా చెప్పకున్నా ఆయన మాటలను బట్టి చూస్తే ఇట్లే అర్థమవుతుంది. చంద్రబాబు మాటలు విన్న తర్వాత సూపర్‌ సిక్స్‌ హామీలపై ఆంధ్రప్రదేశ్‌ ప్రజలు ఆశలు వదులేసుకోవాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. సూపర్‌ సిక్స్‌ కొత్త హామీలు అమలు చేయకపోయినప్పటికీ అల్‌రెడ్డీ ఎగ్జిస్టింగ్ హామీలను కంటిన్యూ చేయకపోతే ఎట్లా అంటూ కూటమిలో కూడా ఓ చర్చ వింటున్నాం. టీడీపీ ఎమ్మెల్యేలు కూడా మదనపడిపోతున్నారు. ప్రతి ఇంటికీ వెళ్లి అమ్మ ఒడి, ఫ్రీ బస్, సూపర్ సిక్స్ హామీలు, అన్నదాత సుఖీభవ ఇచ్చాం. ఇప్పుడు ఇవన్నీ లేవు అంటే రేపటి నుంచి ప్రజలకు ఎలా మొహం చూపించగలం పార్టీ నాయకత్వాన్ని అడుగుతున్నారు. ప్రతి నెలా ఒకటో తారీఖు వెళ్లి పెన్షన్‌ ఇవ్వాలని మాకే చెప్తున్నారు.. మేం ప్రజల దగ్గరికి వెళ్లినప్పుడు జనాలు ప్రశ్నిస్తే ఎలా ఫేస్ చేయాలని అడుగుతున్నారు. సూపర్‌ సిక్స్‌ హామీలపై జనాల్లో ఆశలు తుంచేయాలని పార్టీ నాయకత్వం చూసిందా అనే ప్రశ్న మొదలైంది. సూపర్ సిక్స్‌ హామీల అమలుపై సీనియర్‌ జర్నలిస్టు 'YNR' చేసిన విశ్లేషణ



Updated On
ehatv

ehatv

Next Story