PPP Model : కూటమికి అవమానం.. జగన్ మాటను నమ్మిన బిడ్డర్లు..!
ఆంధ్రప్రదేశ్‌లో కూటమి సర్కార్‌కు అవమానం జరిగింది. అవమానం మామూలు అవమానం కాదు, చాలా దారుణమైన అవమానం కూటమి సర్కారుకు జరిగింది.

ఆంధ్రప్రదేశ్‌లో కూటమి సర్కార్‌కు అవమానం జరిగింది. అవమానం మామూలు అవమానం కాదు, చాలా దారుణమైన అవమానం కూటమి సర్కారుకు జరిగింది. ఆంధ్రప్రదేశ్‌లో మెడికల్ కాలేజీల్ని ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించే కుట్ర చేసింది. ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించడానికి సంబంధించి ఓ విధానాన్ని తీసుకొచ్చింది. దానికి పిపిపి అని పేరు పెట్టింది. పిపిపి అని పేరు పెట్టి, వచ్చే 30 ఏళ్ళు వచ్చే, 60 ఏళ్ళు మెడికల్ కాలేజీల్ని తమ అనుకున్న ప్రైవేట్ వ్యక్తుల చేతిలో పెట్టడానికి సంబంధించి రంగం సిద్ధం చేసింది. ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ హయాంలో కేంద్రం నుంచి 17 మెడికల్ కాలేజీలని శాంక్షన్ చేయించారు. ఇందులో దాదాపు ఐదు మెడికల్ కాలేజీలకు సంబంధించిన నిర్మాణం పూర్తయపోయింది. కొన్ని కాలేజీల్లో రెండో సంవత్సరం అడ్మిషన్స్ కూడా పూర్తయపోయాయి. ఈ పరిస్థితుల్లో కొత్తగా వచ్చిన సర్కారు మెడికల్ కాలేజీల నిర్మాణం చేయాల్సి ఉండగా, మెడికల్ కాలేజీ నిర్మాణం చేస్తే రాష్ట్ర ప్రభుత్వం పైన ఆర్థికంగా భారం పడుతుంది అంటూ ఒక థియరీ తీసుకొచ్చి, ఆ కాలేజీలన్నీ ప్రైవేట్ వ్యక్తులకు అప్పగిస్తున్నాం అంటూ చెప్పింది. గత సర్కారు భూమి ఇచ్చింది, గత సర్కార్ టెండర్లు పిలిచింది, గత సర్కారు దాదాపు ఏడు కాలేజీల్లో నిర్మాణాలు కూడా ఆల్మోస్ట్ పూర్తి చేసింది. వాటినైనా వదలకుండా, వాటిని కూడా ప్రైవేట్ వ్యక్తులకే ఇవ్వాలని నిర్ణయం తీసుకుంది. ప్రైవేట్ వ్యక్తులకి ఇవ్వడం మాత్రమే కాదు, ప్రైవేట్ వ్యక్తులు కాలేజీలు రన్ చేస్తారు, కాలేజీలో పని చేస్తే స్టాఫ్ మొత్తానికి ప్రభుత్వమే జీతాలు ఇస్తుంది, ఆ కాలేజీ నిర్మాణానికి ప్రభుత్వమే భూమి ఇస్తుంది, కాలేజీల నిర్మాణాలు ప్రభుత్వమే పూర్తి చేస్తుంది, ఆ తర్వాత నిర్మాణం పూర్తి అయిన తర్వాత కాలేజీ లోపలికి వచ్చే విద్యార్థుల దగ్గర నుంచి ఫీజులు మాత్రం ప్రైవేట్ వాళ్ళు వసూలు చేస్తారు. ఆ హాస్పిటల్‌కు వచ్చే పేదల దగ్గర నుంచి ఫీజులు మాత్రం, ప్రైవేట్ వాళ్ళు వసూలు చేస్తారు, 60 ఏళ్ల పాటు వాళ్ళు వసూలు చేసి ఆ తర్వాత ప్రభుత్వానికి ఇస్తారు అనేది ప్రభుత్వం చెప్తున్న తీరు. ఇది అనుమానాలకు తావిచ్చేలా ఉంది, ఇది పేద ప్రజలకు నష్టం చేసేలా ఉంది, ఇది పేద విద్యార్థులు వైద్య విద్యని అభ్యసించకుండా చేసేలా ఉంది, అనే నిరసన రాష్ట్రవ్యాప్తంగా వ్యక్తమైంది. కూటమిలోని పార్టీలు మినహా ఆంధ్రప్రదేశ్‌లో ఉన్న ఏ రాజకీయ పార్టీ కూడా పిపిపి పద్ధతులు మెడికల్ కాలేజీలని ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించడాన్ని సమర్ధించలేదు. కూటమిలో పార్టీలు మాత్రం దాన్ని సమర్ధించడానికి కారణాలు ఏంటో, సరిగ్గా చెప్పలేక బుల్డోజ్ చేసే ప్రయత్నం చేస్తూ వచ్చారు. ఇటీవల ఆంధ్రప్రదేశ్‌లో ప్రతిపక్ష పార్టీ కోటి సంతకాలు సేకరించి గవర్నర్ కు అందించింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ పైన ఏ స్థాయిలో వ్యతిరేకంగా ఉన్నారో ఇది ఒక నిదర్శనంగా చూడొచ్చు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం మేము వెనక్కి తగ్గం మేము ఎవరికో హామీ ఇచ్చేశాం, వాళ్ళ కాలేజీలు కట్టబెట్టాల్సిందే అన్నట్టుగా బిహేవ్ చేసింది. దానిలో భాగంగానే నాలుగు మెడికల్ కాలేజీలకు సంబంధించి బిడ్లు పిలిచింది, టెండర్లు పిలిచింది. మేము ఈ కాలేజీలు ఇచ్చేస్తాం ఎవరైనా వచ్చి పాడుకోండి అంటూ టెండర్లు పిలిచింది. టెండర్లు పిలిచి కూడా దాదాపు రెండు నెలలు అవుతుంది. ఈ టెండర్లు పిలిచిన కాలేజీలు పులివెందుల, మార్కాపురం, మదనపల్లి, ఆదోని. ఈ నాలుగు కాలేజీలు ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వడానికి సంబంధించి టెండర్లు పిలిస్తే, టెండర్లు పిలిచిన తర్వాత ఆసక్తి ఉన్న వ్యక్తులను పిలిచి వాళ్ళకు టెండర్ల పైన ఉన్న అనుమానాలు ఏంటో నివృత్తి చేసింది. ఆ తర్వాత వాళ్ళు కొంత సమయం పెంచండి, మేము టెండర్లు దాఖలు చేయడానికి అని అడిగారు రెండు సార్లు టెండర్లకు సంబంధించిన సమయాన్ని పెంచింది. నిన్నటితో టెండర్ల దాఖలకు సమయం ముగిసిపోయింది. ముగిసిన తర్వాత నాలుగు కాలేజీల్లో కేవలం ఒక్క కాలేజీకి మాత్రమే అది కూడా ఒక్క టెండర్ మాత్రమే దాఖలయింది. ఇది కూటమి సర్కార్‌కు దారుణమైన అవమానంగా చూడాలి. ఇదే అంశంపై సీనియర్ జర్నలిస్ట్ 'YNR' విశ్లేషణ..!


