వైసీపీ ముఖ్యనేత విజయసాయిరెడ్డి రాజీనామా ప్రకటన తెలుగు రాష్ట్రాల్లో సంచలనానికి కారణమైంది.

వైసీపీ ముఖ్యనేత విజయసాయిరెడ్డి రాజీనామా ప్రకటన తెలుగు రాష్ట్రాల్లో సంచలనానికి కారణమైంది. ఎవరు అవునన్నా కాదన్నా ఈ రాజీనామా ప్రకటన వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీని షాక్‌కు గురిచేసింది. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీని ఇబ్బందులకు గురిచేసింది. విజయసాయిరెడ్డి రాజీనామా ప్రకటన వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీకి నష్టం జరిగిందని ఓ వైపు వాదిస్తుంటే.. ఓ ఎంపీ వెళ్లడంతో లాభాలు, నష్టాల కంటే ఎమోషనల్‌గా, నైతికంగా వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌ పార్టీకి ఇబ్బంది జరిగే అవకాశం ఉంది. వైఎస్‌ఆర్ కాంగ్రెస్‌ పార్టీలో తొలి నుంచీ ఉన్నారు, పార్టీ పెట్టినప్పటి నుంచి జగన్‌తో ఉన్నారు. ఆ పార్టీ నుంచి మొదటి రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. అటువంటి విజయసాయిరెడ్డి ఇప్పుడు రాజీనామా చేయడం, రాజకీయాలను వదిలేస్తున్నానని చెప్పడం నైతికంగా వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి నష్టమనే వాదన వినపడుతోంది. ఓ వైపు కుటుంబం కూడా వైసీపీకి దూరం కావడం, షర్మిల, విజయమ్మ దూరం కావడం.. కుటుంబ సభ్యులే జగన్‌కు దూరంగా వెళ్లిపోయారన్న వాదన ఉంది. మరోవైపు జగన్ మనసెరిగి పనిచేసే విజయసాయిరెడ్డి పార్టీకి దూరం కావడం వైసీపీకి ఇబ్బంది కల్గించేదిగా మనం చూడాలి. మరోవైపు విజయసాయి పార్టీ మారడం వెనుక ఏదో జరిగందనే వార్తలు వస్తున్నాయి. ఈ అంశంపై సీనియర్ జర్నలిస్ట్ 'YNR' విశ్లేషణ ఈ వీడియోలో..!


Updated On
ehatv

ehatv

Next Story