Journalist YNR : బీజేపీని చంద్రబాబు వదిలేస్తున్నారా..!
బీహార్ ఎన్నికలకు, దేశ రాజకీయాలకు, ఆంధ్రప్రదేష్‌కు సంబంధం ఉందా, బీహార్ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోతే దేశంలో జరిగే పరిణామాలు ఏంటి

బీహార్ ఎన్నికలకు, దేశ రాజకీయాలకు, ఆంధ్రప్రదేష్‌కు సంబంధం ఉందా, బీహార్ ఎన్నికల్లో బీజేపీ ఓడిపోతే దేశంలో జరిగే పరిణామాలు ఏంటి బీహార్ నుంచి భారతీయ జనతా పార్టీని బయటకు పంపించేసేయండి, భారతీయ జనతా పార్టీ దేశం నుంచే బయటకి వెళ్ళిపోతుంది, బీహార్ లో ప్రభుత్వం భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాన్ని దించేయండి, ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం పడిపోతుంది, కాంగ్రెస్ పార్టీ బీహార్ ఎన్నికల వేళ చేస్తున్న క్యాంపెయిన్ ఇది. బీహార్ నుంచి బీజేపీని తరిమేద్దాం, దేశంలో బీజేపీని దింపేద్దాం, కాంగ్రెస్ పార్టీ పదే పదే ఇదే స్లోగన్‌తో, ఇదే వ్యాఖ్యాలతో, బీహార్ ఎన్నికల్లో ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తుంది.
ఇటీవల వరుస పరిణామాలు, ఆపరేషన్ సింధూర్, ఆ తర్వాత జరిగిన సంఘటనలు, ఇవన్నీ చూసిన తర్వాత, దేశంలో భారతీయ జనతా పార్టీ ప్రతిష్ట మసకబారింది, ఇలాంటి ఒక చర్చ జరుగుతున్న నేపథ్యంలో, బీహార్ ఎన్నికలు భారతీయ జనతా పార్టీకి భయం పుట్టిస్తున్నాయి, ఇలాంటి ఒక ఇంప్రెషన్ ఉన్న నేపథ్యంలో బీహార్‌లో గెలవడానికి సంబంధించి, ప్రజల మద్దతుతో కాకుండా, ఎలక్షన్ కమిషన్లతో ఈవీఎంలతో, దొంగ ఓట్లతో గెలిచే ప్రయత్నం, బీజేపీ చేస్తుందని దేశంలో ప్రజలు బలంగా నమ్ముతున్న నేపథ్యంలో, కాంగ్రెస్ పార్టీ బీహార్ లో చేస్తున్న ఈ క్యాంపెయిన్ ఆసక్తిని కలిగిస్తోంది, బీహార్‌లో కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఈ క్యాంపెయిన్ కి ఆంధ్రప్రదేశ్ రాజకీయాలకు సంబంధం ఉంది, ఆంధ్రప్రదేశ్ రాజకీయాలని ఊటంకిస్తూ, కాంగ్రెస్ పార్టీ నేతలు బీహార్ ఎన్నికల క్యాంపెయిన్ చేస్తున్నారు.
బీహార్‌లో బీజేపీని ఓడిస్తే, మీరు ఓటు వేయండి బీహార్‌లో బీజేపీ ఓడిపోయిందంటే ఎన్డిఏ నుంచి బయటికి రావడానికి టీడిపి రెడీగా ఉంది. బీహార్ నుంచి మీరు బీజేపీని బయటికి పంపించండి, ఎన్డిఏ నుంచి టీడీపీ బయటికి రావడానికి రెడీగా ఉంది, మీరు ఇక్కడ గనుక బిజేపీని ఓడిస్తే కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం పడిపోతుంది, ఎందుకంటే ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి బీజేపీకి మద్దతు ఉపసంహరించడానికి రెడీగా ఉన్నాడు, బీజేపీ బలంగా ఉందనో, మరో కారణాలతోటి ఆయన బీజేపీతో ఉంటున్నాడు తప్ప బీజేపీ పైన ఇష్టంతో కాదు, బీజేపీ బీహార్‌లో ఓడిపోయిందంటే చంద్రబాబు కేంద్రానికి మద్దతు ఉపసంహరిస్తారు అంటూ కాంగ్రెస్ పార్టీ క్యాంపెయిన్ చేస్తుంది. చంద్రబాబు మద్దతు ఉపసంహరిస్తారని, ఎవరికి చెప్పారు, కాంగ్రెస్ పార్టీకి చెప్పారా, కాంగ్రెస్ పార్టీకి తెలుసా, లేదా చంద్రబాబు మద్దతు ఉపసంహరిస్తారని, కాంగ్రెస్ బీహార్‌లో క్యాంపెయిన్ చేస్తున్న విషయం చంద్రబాబుకి తెలుసా, తెలిస్తే కూడా మౌనంగా ఉన్నారా ఇవి ఇప్పుడు చర్చనీయ అంశమైన విషయాలుగా ఉన్నాయి. ఈ అంశంపై సీనియర్ జర్నలిస్ట్ 'YNR' విశ్లేషణ..
