Journalist YNR : పార్లమెంట్‌కు ప్రమాదకర బిల్లు..!
ఈ దేశంలో 30 రోజుల పాటు శిక్ష అనుభవించిన రాజకీయ నాయకుడు పదవిని కోల్పోతాడు, ఏ రాజకీయ నాయకుడు ముఖ్యమంత్రిగానో, మంత్రిగానో, ఉన్నవాళ్ళు ప్రధానమంత్రిగానో, కేంద్ర మంత్రిగానో ఉన్నవాళ్ళు

ఈ దేశంలో 30 రోజుల పాటు శిక్ష అనుభవించిన రాజకీయ నాయకుడు పదవిని కోల్పోతాడు, ఏ రాజకీయ నాయకుడు ముఖ్యమంత్రిగానో, మంత్రిగానో, ఉన్నవాళ్ళు ప్రధానమంత్రిగానో, కేంద్ర మంత్రిగానో ఉన్నవాళ్ళు, ఆ స్థాయిల్లో పదవుల్లో ఉన్నవాళ్ళు, ఏదైనా ఒక నేరం చేసి ఐదేళ్లకు పైగా శిక్ష పడే నేరానికి సంబంధించిన కేసులో, 30 రోజుల కంటే ఎక్కువ జైల్లో ఉంటే, అంటే 31 రోజులు జైల్లో ఉన్న బై డీఫాల్ట్ వాళ్ళ పదవి పోతుంది. వాళ్ళ పదవి పోయేలా ఒక కొత్త చట్టాన్ని కేంద్ర ప్రభుత్వం తీసుకురాబోతుంది. ఈ కొత్త చట్టం తీసుకురాబోతున్న నేపథ్యంలో దీనిపైన ప్రతిపక్షాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఇది ప్రతిపక్షాలని టార్గెట్ చేసి కేంద్రం తీసుకొస్తున్న చట్టం, ఇదొక నల్ల చట్టం లాంటిది అంటూ విమర్శలు మొదలుపెట్టాయి, నిజానికి ఆ బిల్లు చట్టానికి సంబంధించిన ముసాయిదా ఏంటి, కేంద్రం ఏమనుకుంటుంది, దానికి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ రావాల్సి ఉంది.
బహుశా కేంద్ర ప్రభుత్వం అటువంటి చట్టాన్ని తీసుకురాబోతున్నాం అంటూ ఒక లీడ్ మాత్రమే ప్రస్తుతం ఇచ్చినట్టుగా అర్థం చేసుకోవాలి, అయితే ఈ చట్టం ఖచ్చితంగా ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నట్లుగా ప్రజాస్వామ్యానికి విఘాతం కలిగించే చట్టం గానే చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ దేశంలో ఇప్పటికే గడిచిన రెండు దశాబ్దాలుగా కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వాలు, ప్రతిపక్షాలని వేధించడం కోసం దర్యాప్తు సంస్థల్ని, కేంద్ర సంస్థల్ని దుర్వినియోగం చేస్తున్నాయి. ఇలాంటి విమర్శ ఉంది. గత యూపిఏ సర్కార్ కావచ్చు, 11 ఏళ్లుగా భారతీయ జనతా పార్టీ సర్కార్ కావచ్చు, ఆ రకంగా చట్టాన్ని దుర్వినియోగం చేసి తమ రాజకీయ ప్రత్యర్థులని, కేసుల్లో ఇరికించడం కోసం తమ రాజకీయ ప్రత్యర్థుల పైన కేసులు పెట్టడం కోసం, కేంద్ర ఏజెన్సీల్ని ఉపయోగించుకుంటున్నాయి. ఇలాంటి ఒక ఇంప్రెషన్ కనబడుతుంది. అటువంటి కేసులు, అటువంటి ఎగ్జాంపుల్స్ చాలా ఉన్నాయి, ఇప్పటికి ఇటీవల కాలంలో మరీ ఎక్కువగా సిబిఐ అంటే కేంద్ర ప్రభుత్వానికి సంబంధించిన జేబు సంస్థగా మారిపోయిందని, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అంటే కేంద్ర ప్రభుత్వం ఏం చెప్తే అది చేస్తుందని, ఈవెన్ కోర్టుల పైన కూడా అటువంటి వ్యాఖ్యలు, అటువంటి విమర్శలు వినిపిస్తున్నాయి.
ఈ నేపథ్యంలో ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం తీసుకురాబోతున్న ఈ చట్టం, దేశంలో ప్రతిపక్షాలని టార్గెట్ చేయబోతుంది. భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ముఖ్యమంత్రులు, భారతీయ జనతా పార్టీకి సంబంధించిన మంత్రులు ఎవరైనా తప్పులు చేస్తే 30 రోజుల కంటే ఎక్కువ జైల్లో ఉండే పరిస్థితి ఉండదు, ఎందుకంటే అన్ని వ్యవస్థలని భారతీయ జనతా పార్టీ, కేంద్ర ప్రభుత్వం మేనేజ్ చేస్తున్నాయి, ఇలాంటి ఇంప్రెషన్ ఉంది. అదే ప్రతిపక్షాలకు సంబంధించిన వాళ్ళు ఎక్కడైనా, పదవుల్లో అధికారంలో ఉన్న సమయంలో వాళ్ళు మాత్రం కేసుల పాలై జైలుకి వెళ్లి పదవులని పోకొట్టుకోవాల్సి వస్తుంది. ఇది రాజకీయ పరంగా దుర్వినియోగం అయ్యే ప్రమాదం చాలా ఎక్కువగా ఉంది. పైగా ముఖ్యమంత్రిగానో, మంత్రిగానో, పదవుల్లో ఉన్నవాళ్ళు ఎవరో దయాదాక్షిణ్యాలపై ఆ పదవుల్లోకి వచ్చిన వాళ్ళు కాదు, ప్రజల మద్దతుతో, ప్రజల ఓట్లతో, ప్రజల అంగీకారంతో, ప్రజలు కోరుకుంటే ఆ పదవిలోకి వచ్చిన వాళ్ళు కాబట్టి, వాళ్ళ పదవి తొలగించడం అనేది, చట్ట కోర్టులు వేసే శిక్షల ఆధారంగా ఉండకూడదు లాంటి ఒక చర్చ జరుగుతోంది.ఈ అంశంపై సీనియర్ జర్నలిస్ట్ 'YNR' విశ్లేషణ..
