ఆంధ్రప్రదేష్‌లో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అంశానికి సంబంధించి చాలా సందర్భాల్లో దృష్టికి తీసుకొస్తున్నా.

ఆంధ్రప్రదేష్‌లో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అంశానికి సంబంధించి చాలా సందర్భాల్లో దృష్టికి తీసుకొస్తున్నా. అనేక వీడియోలు చేసే దానికి సంబంధించి చాలా బలంగా నమ్ముతున్నా, ప్రైవేటు వ్యక్తులకు మెడికల్ కాలేజీలు ఇవ్వడం, పిపిపి మోడల్లో వాటిని అప్పగించడం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి దీర్ఘకాలింగా నష్టం చేస్తుంది. భవిష్యత్తులో ఆంధ్రప్రదేష్‌ ప్రజలు ఆరోగ్యానికి దూరమయ్యే పరిస్థితి ఉంటుంది. ఆరోగ్యాన్ని కొనుక్కోవడం కోసం డబ్బులు లేక ప్రాణాలు కోల్పోవాల్సిన పరిస్థితి ఉంటుంది. ఆంధ్రప్రదేష్‌లో వైద్య విద్య అనేది పేదలకు మిగతా వాళ్ళకు అందని పరిస్థితి అవుతుంది. కేవలం డబ్బు ఉన్న వాళ్లకు మాత్రమే వైద్య విద్య ఉండే పరిస్థితి ఉంటుంది. డబ్బులు ఉన్న వాళ్ళు వైద్య విద్య అభ్యసించాలనో లేకపోతే వైద్యం చేసి సేవ చేయాలనే దానికంటే ఒక ఫ్యాషన్ గా, ఒక స్టేటస్ గా వైద్య విద్యలోకి రావడం చూస్తున్నాం. ఆ తర్వాత వాళ్ళు వ్యాపారం చేయడమే చూస్తున్నాం. ప్రేమతో ప్రజలకు సేవ చేయాలనే ఆలోచనతో పేదరికం నుంచి వచ్చి ప్రజల ఆరోగ్య కష్టాలు తెలిసిన వాళ్ళు వైద్య విద్య చదివే అవకాశం లేకుండా చేస్తుంది ప్రభుత్వం అనే బాధ ఉంది. ఆంధ్రప్రదేష్‌ ప్రజలకు సంబంధించిన ఒపీనియన్ కూడా ఉంది.

వైద్య కళాశాలలు ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వడాన్ని ప్రజలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ఆంధ్రప్రదేష్‌ బాగుండాలని కోరుకునే వాళ్ళు వ్యతిరేకిస్తున్నారు. ఆంధ్రప్రదేష్‌లో వైద్యరంగంలో విశేష అనుభవం ఉన్న వాళ్ళంతా కూడా ప్రైవేట్ వ్యక్తులకు మెడికల్ కాలేజీలు ఇవ్వడం సరైనది కాదు అని చాలా బలంగా చెప్తున్నారు. సమ్మేళనాలు పెడుతున్నారు, రౌండ్ టేబుల్ మీటింగ్స్ పెడుతున్నారు. ప్రభుత్వానికి చెప్తూ వస్తున్నారు, ఈ పని చేయకండి అని చెప్తూ వస్తున్నారు. చేయడం వల్ల జరిగే నష్టం ఏంటో చెప్తున్నారు. స్వాతంత్రం వచ్చిన తర్వాత అమృత ఉత్సవాలు మనం చేసుకుంటున్నాం. ఈ సందర్భంలో కూడా ఈ దేశంలో టాప్ 10 మెడికల్ కాలేజీలు ఏంటి అంటే, మొత్తం ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఉన్నాయి, తప్ప ప్రైవేట్ మెడికల్ కాలేజీలు ఏం లేవు, తెలుగు రాష్ట్రాల్లో చూస్తున్నాం, టాప్ మెడికల్ కాలేజీలు ఏవి అంటే మనకి ప్రభుత్వ మెడికల్ కాలేజీలో కనపడుతున్నాయి తప్ప, ప్రైవేట్ మెడికల్ కాలేజీలు కాదు. మొత్తం ఉపోద్గాతం ఎందుకు చెప్తున్నాను అంటే మెడికల్ కాలేజీలకు సంబంధించిన అంశం పైన ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత, ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల ఉంది.

నేను దాన్ని వ్యతిరేకిస్తూ వస్తున్నారు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని, ప్రజలు కూడా దాన్ని వ్యతిరేకిస్తున్నారు. ప్రజలు కూడా దాన్ని వ్యతిరేకిస్తున్నారు అనేది ఎలా అర్థమవుతుంది అంటే రెండు రోజుల క్రితం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ లో రాష్ట్రవ్యాప్తంగా మెడికల్ కాలేజీల అంశానికి సంబంధించి నిరసనలు తెలిపింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాజకీయంగా లబ్ది కోసం చేస్తే చేసిఉండొచ్చు కదా, రాజకీయ పార్టీ రాజకీయ లబ్ది కోసం ప్రయత్నాలు చేసుకోవడం తప్పేమ కాదు కానీ, ఆ పర్టికులర్ అంశం పైన ప్రజలు ఆ స్థాయిలో రోడ్లు ఎక్కడం అనేది ఖచ్చితంగా ఆసక్తి కలిగించింది. మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ ఈ అంశం అనేది రూరల్ ప్రాంత ఏరియాకు సంబంధించిన అంశం కాదు కానీ, మొత్తం రాష్ట్రంలోని రూరల్ ఏరియాస్ నుంచి కూడా ప్రజలు చాలా పెద్ద ఎత్తున బయటికి వచ్చి ప్రభుత్వానికి నిరసన తెలపడం చూసాం.సీనియర్ జర్నలిస్ట్ 'YNR' విశ్లేషణ..!


Updated On
ehatv

ehatv

Next Story