రాజకీయ పార్టీలకు వివిధ రకాల వ్యక్తులు వ్యాపారస్తులు, రాజకీయ పార్టీల్లో పని చేస్తున్న వాళ్ళు చందాలు ఇస్తూ ఉంటారు.

రాజకీయ పార్టీలకు వివిధ రకాల వ్యక్తులు వ్యాపారస్తులు, రాజకీయ పార్టీల్లో పని చేస్తున్న వాళ్ళు చందాలు ఇస్తూ ఉంటారు. పార్టీలు నడపడానికి, ఆ పార్టీలు ప్రజల కోసం పని చేస్తూ ఉన్నాయన్న కారణంతో రాజకీయ పార్టీలకు చాలామంది చందాలు ఇస్తూ ఉంటారు. ఆ చందాల వివాదంగా మారడం కూడా చాలా సందర్భాల్లో చూస్తూ ఉన్నాం. 20వేల కంటే తక్కువ రూపాయలు చందాలు ఇచ్చిన వాళ్ళు రిసిప్ట్ కూడా ఇవ్వాల్సిన అవసరం లేదు, వాళ్ళకి సంబంధించిన పేరు కూడా గోప్యంగా ఉంటుంది, కాబట్టి సో అలా ఇస్తుంటారు, కొంతమంది. ఎందుకంటే ఎక్కువ చందాలు కూడా ఇస్తుంటారు, ఆ తర్వాత ఎలక్టోరల్ బాండ్స్ అవి కూడా చూశాం. అయితే ఆంధ్రప్రదేశ్ కి సంబంధించిన ఒక ఇంట్రెస్టింగ్ డెవలప్మెంట్ దీనికి సంబంధించి, ఈరోజు కొన్ని పత్రికల్లో రిపోర్ట్ అయింది. జస్ట్ దాన్ని మీ ముందుకు తీసుకురావడం కోసమే ఈ వీడియో. ఏంటది అంటే ఆంధ్రప్రదేశ్ లో ఈ ఏడాది పొలిటికల్ పార్టీలకు ఇచ్చిన ఫండింగ్ వివరాలు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉన్నాయి. ఏంటి ఆ ఫండింగ్ వివరాలు అంటే, ఆంధ్రప్రదేశ్ లో తెలుగుదేశం పార్టీ, కూటమి సర్కార్ ప్రస్తుతం అధికారంలో ఉంది. కూటమి సర్కార్‌ఖు 2024-25 ఆర్థిక సంవత్సరంలో 83 కోట్ల రూపాయల చందాలు వచ్చాయి, నిధులు వచ్చాయి. పార్టీని నడుపుకోండి మీరు అంటూ వివిధ రకాల వ్యక్తులు చందాలు ఇచ్చారు ఆ పార్టీకి. ఈ పార్టీ ఏ పార్టీ అయినా ఏ రాజకీయ రిజిస్టర్డ్ పొలిటికల్ పార్టీ అయినా, గుర్తింపొందిన ఏ రాజకీయ పార్టీ అయినా, తమకు వచ్చిన చందాలకు సంబంధించిన వివరాలని ఎలక్షన్ కమిషన్ కి అందజేయాల్సి ఉంటుంది. ఆ ఎలక్షన్ కమిషన్ కి అంద చేసే క్రమంలో ఆంధ్రప్రదేశ్ సంబంధించిన రాజకీయ పార్టీలు, తెలంగాణ సంబంధించిన రాజకీయ పార్టీలు ఏమి ఇచ్చాయి ఎలక్షన్ కమిషన్ కి, వాళ్ళు ఏం చెప్పారు అనేదానికి, సంబంధించి వివరాలు బయటకి వచ్చాయి.
ఆ వివరాల భాగంగా తెలుగుదేశం పార్టీకి 83 కోట్ల రూపాయలు విరాళాలు వస్తే, జనసేన పార్టీకి 25 కోట్ల రూపాయల విరాళాలు వచ్చాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి 140 కోట్ల రూపాయల విరాళాలు వచ్చాయి. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్లో అధికారాన్ని కోల్పోయి ఉంది. తెలుగుదేశం పార్టీ జనసేన కూటమే అధికారంలో ఉన్నాయి కానీ, అధికారంలో ఉన్న రెండు పార్టీలకు కలిపి వచ్చిన చందాల కంటే, 83 కోట్లు టిడిపీకి 25 కోట్లు జనసేన పార్టీకి, ఇద్దరికీ కలిపి 108 కోట్ల రూపాయలు చందాలు వస్తే, కేవలం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి 140 కోట్ల రూపాయలకు పైగా చందాలు వచ్చినట్లుగా ఆ పార్టీ అఫీషియల్ గా ప్రకటించింది. ఆ పార్టీకి ఆ స్థాయిలో చందాలు ఇప్పుడు ఎవరు ఇచ్చారు, ఆ స్థాయిలో చందాలు ఇవ్వడం వెనక రీజన్ ఏంటి అనే చర్చ పొలిటికల్ సర్కిల్స్ లో జరుగుతుంది. జనసేనకి మొత్తం 175 మంది చందాలు ఇస్తే, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి చందాలు ఇచ్చిన వాళ్ళ నెంబర్ కేవలం 37 మాత్రమే. కేవలం 37 మంది 140 కోట్ల రూపాయల చందాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కోసం ఇచ్చారు. తెలుగుదేశం పార్టీకి గతంతో పోలిస్తే చందాలు తగ్గాయి, 2024-25 ఆర్థిక సంవత్సరంలో రాజకీయ పార్టీలకు అందిన అందిన విరాళాలలో 2023-24 తో పోలిస్తే తెలుగుదేశం పార్టీకి 24- 25 ఆర్థిక సంవత్సరంలో చందాలు తగ్గాయి. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి గణనీయంగా పెరిగాయి. ఇది దేనిని సూచిస్తుంది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చందాలు పెరగడం అనేది వైసపీ మళ్ళీ అధికారంలోకి వస్తుంది కాబట్టి వైసపీ కి సపోర్ట్ చేద్దామనో వైసీపీకి ఫండింగ్ చేద్దామనే ఆలోచన ఏమన్నా బిజినెస్ మెన్స్ లో ఉందాచ రీజన్ ఏంటో తెలీదు. పర్టికులర్ రీజన్ ఏంటో ఇంకా తెలియదు కానీ వైసీపీకి చందాలు పెరగడం అనేది మాత్రం ఖచ్చితంగా ఆసక్తిని కలిగించే అంశంగానే చూడాలి. సేమ్ టైం బిఆర్ఎస్ పార్టీకి కేవలం 15 కోట్ల రూపాయలు మాత్రమే విరాళాలు వచ్చినట్టుగా ఆ పార్టీ ప్రకటించింది. ఎంఐఎం పార్టీ తమకు 20,000 కంటే మించి ఎవరు విరాళాలు ఇవ్వలేదని ప్రకటించిందంట. తెలుగు రాష్ట్రాలకు సంబంధించి పార్టీలకు వచ్చిన విరాళాలకు సంబంధించిన అంశం పైన తాజా స్టాటిస్టిక్స్ ఇవి. వైసార్ కాంగ్రెస్ పార్టీ రెండు తెలుగు రాష్ట్రాలను అత్యధికంగా విరాళాలు సాధించిన సేకరించిన పార్టీగా నిలిచింది.


