హలో నమస్తే నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్ ఆంధ్రప్రదేశ్ లో మీడియా సంస్థలు పార్టీల వారిగా విడిపోయాయి పార్టీల వారిగా మీడియా సంస్థలు విడిపోయాయి.

హలో నమస్తే నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్ ఆంధ్రప్రదేశ్ లో మీడియా సంస్థలు పార్టీల వారిగా విడిపోయాయి పార్టీల వారిగా మీడియా సంస్థలు విడిపోయాయి. అనేకంటే పార్టీలే నడిపిస్తున్న మీడియా సంస్థలు చాలా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్నాయి. సాక్షి గ్రూప్ ని వైసీపీ నడిపిస్తుంటే మిగతా మెజారిటీ మీడియా తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో నడుస్తుంది.రెండు పార్టీలకు రెండు ప్రధానమైన మీడియా హౌసెస్ పెట్టుకొని ఆంధ్రప్రదేశ్ లో రాజకీయం చేస్తున్న పరిస్థితి మీడియా సంస్థలు కూడా పార్టీల కార్యాలయాలుగానే పని చేస్తున్న వాతావరణం చూస్తున్నాం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎవరు దీని ఈ మాట చెప్పడానికి నేను ఎక్కడ వెనక్కి పోదలుచుకోలేదు.

ఎవరికీ అనుమానాలు కూడా ఉండాల్సిన అవసరం లేదు ఎవరు అటువంటి మీడియాల పైన అవి ప్రజల మీడియాలుగా చూడాల్సిన అవసరం లేదు పార్టీల మీడియాలే పార్టీల మీడియాలు ఎవరికీ ఎటువంటి డౌట్ లేదు అయితే రెండు రోజుల క్రితం బంగారుపాల్యంలో మామిడి రైతులకు సంబంధించిన సమస్యలు తెలుసుకోవడం కోసం వాళ్ళని పరామర్శ చేయడం కోసం వైసపి అధినేత జగన్మోహన్ రెడ్డి అక్కడికి వెళ్ళారు అక్కడికి వెళ్ళిన సందర్భంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకించే ప్రభుత్వానికి అనుకూలంగా ఉండే మీడియా ప్రతినిధులు కూడా అక్కడికి ఆ పర్యటన కవర్ చేయడం కోసం వెళ్ళారు ఈ సందర్భంగా ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ శివకుమార్ పైన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు దాడి చేశారు వైసార్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు ఆ రెండు ఛానల్లు ఎక్కడ అంటూ వాళ్ళని వెతుక్కుంటూ మరి వచ్చి దాడి చేశారు అంటూ తెలుగుదేశం పార్టీ మీడియా రిపోర్ట్ చేసింది.

తెలుగుదేశం పార్టీ మీడియా రిపోర్ట్ చేసిన ప్రకారం వెతుక్కుంటూ వచ్చి దాడి చేశారో లేదో తెలియదు కానీ ఆంధ్రజ్యోతి ఫోటోగ్రాఫర్ శివకుమార్ పైన మాత్రం విచక్షణ రహితంగా దాడి చేయడం కనిపించింది ఆయన హాస్పిటలైజ్ అయిఉన్నారు ప్రస్తుతం ట్రీట్మెంట్ లో ఉన్నారు సో ఈ దాడి ఆ మీడియా సంస్థల పైన జరిగిన దాడిగా మీడియా సంస్థల పైన ఉన్న కోపంతో జరిగిన దాడిగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కనిపించొచ్చు కానీ ఇది ఓ జర్నలిస్టు పైన జరిగిన దాడి జర్నలిస్టులని జర్నలిస్టులుగా చూడడం ఆంధ్రప్రదేశ్ లో ఉన్న రాజకీయ పార్టీలు అలవాటు చేసుకోవాలి.

ఓ ఛానల్ కి సంబంధించిన ఓ పత్రికకు సంబంధించిన ప్రతినిధి కనపడితే ఆ ప్రతినిధిలో తమ ప్రత్యర్ధుల్ని చూడడం అనేది మానుకోవాలి మర్చిపోవాలి ఈ పద్ధతికి స్వస్తి చెప్పకపోతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జర్నలిస్టులు స్వేచ్ఛగా పని చేసే పరిస్థితి ఉండదు చాలా సందర్భాల్లో చూస్తూ ఉంటాం అఫీషియల్ గా ముఖ్యమంత్రిగా ఉన్న సందర్భంలోనే జగన్మోహన్ రెడ్డి పదే పదే ఆ రెండు పత్రికలు అంటూ సో మూడు కొన్ని టీవీ ఛానల్స్ పేరు చెప్తూ వాళ్ళంతా కూడా మన వ్యతిరేకలు వ్యతిరేకులు అంటూ ఒక బ్రాండింగ్ స్టాంపింగ్ చేసే ప్రయత్నం చేస్తూ వచ్చారు. పూర్తి సమాచారం YNR విశ్లేషణలో చూద్దాం....


ehatv

ehatv

Next Story