ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయింది. గత ఏడాది జూన్ 04న ఆంధ్రప్రదేశ్‌ (Andhra Pradesh)ప్రజలు ఇచ్చిన తీర్పు బయటకు వచ్చింది.

ఆంధ్రప్రదేశ్‌లో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది పూర్తయింది. గత ఏడాది జూన్ 04న ఆంధ్రప్రదేశ్‌ (Andhra Pradesh)ప్రజలు ఇచ్చిన తీర్పు బయటకు వచ్చింది. ఏడాది కాలంలో ప్రజలకు స్వేచ్ఛనిచ్చామని, వైసీపీ(YCP) ప్రభుత్వం రాష్ట్రాన్ని అప్పుల కుప్పలుగా మార్చిందని, రాష్ట్రాన్ని గాడిలో పెట్టేందుకు ప్రయత్నం చేస్తున్నామని ప్రభుత్వం చెప్తోంది. ఏడాదిలో వైసీపీకి చెందిన అనేక నాయకులు, కార్యకర్తలపై కేసులు కూడా నమోదయ్యాయి. అయితే ప్రభుత్వం పెన్షన్లు ఇవ్వడం గొప్పగా చెప్పుకుంటున్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే పెన్షన్లు ప్రారంభించామన్నారు. ల్యాండ్‌ టైటిల్ యాక్టు(Land Tittle ACT) రద్దుచేశామని, మెగా డీఎస్సీ(Mega DSC) వేశామని ప్రభుత్వం చాలా గొప్పగా చెప్పుకుంటోంది. గత ప్రభుత్వంలో కొంత మందిని వేధించారని, రెడ్‌బుక్‌(Red Book)ను అమలు చేస్తున్నామని చెప్పారు. అయితే కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది అయినందున వైసీపీ కొత్త కార్యక్రమానికి పిలుపునిచ్చింది. సూపర్‌ సిక్స్‌ హామీలు ఇచ్చి అమలు చేయకుండా రాష్ట్ర ప్రజలను వెన్నుపోటు పొడిచారని, వెన్నుపోటు దినం (Vennupotu Dinam)పేరుతో నిరసన కార్యక్రమాలకు పిలుపునిచ్చింది. ఈ నిరసన కార్యక్రమంలో పెద్ద ఎత్తున నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కూటమి సర్కార్‌కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ర్యాలీలు, నిరసనలు చేపట్టారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ నిరసన కార్యక్రమం ఎన్నికల ర్యాలీని తలపించింది. వైసీపీలో కొత్త జోష్‌ కనిపించగా కూటమిలో సైలెన్స్‌ నెలకొంది. ఈ అంశంపై సీనియర్‌ జర్నలిస్ట్ 'YNR' విశ్లేషణలో..



Updated On
ehatv

ehatv

Next Story