YNR Analysis: జగన్‌ టూర్‌లో జనం లేరా.. ABN రాతలపై YNR కౌంటర్..!

మనం చెప్పింది నిజం, మనం చెప్పిందే నిజం, మనం చూపించిందే నిజం, దీన్నే జనం నమ్మాలి, దీన్నే అందరూ అంగీకరించాలి, ఇదే నిజం అని వాళ్ళు ప్రచారం చేయాలి. తెలుగుదేశం పార్టీ మీడియాకు ఉన్న రోగం ఇది, చాలా కాలంగా ఈ రోగం ఉంది, ఆ రోగానికి మందు దొరకని పరిస్థితి కనపడుతుంది. ఇటీవల జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేష్‌లో పర్యటనలు చేస్తున్నారు ఆంధ్రప్రదేష్‌లో జగన్మోహన్ రెడ్డి పర్యటనల సందర్భంగా ప్రభుత్వం పెడుతున్న ఆంక్షలు, ఆ పర్యటనలకు వస్తున్న జనాలు, చాలా పెద్ద చర్చకు దారి తీస్తున్నాయి. జగన్మోహన్ రెడ్డి పర్యటనలకు ఇంతమంది జనాలు ఎందుకు వస్తున్నారు అనేది ఒక చర్చ అయితే, పరామర్శులకు ఇన్ని వేల మందిని వేసుకొని ఎందుకు వెళ్తావు అంటూ నేరుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జగన్మోహన్ రెడ్డిని ప్రశ్నించడం కూడా చూశాం. పొదిలి కావచ్చు, సత్తెనపల్లి కావచ్చు, తాజాగా నెల్లూరు కావచ్చు, ఈ పర్యటనల సందర్భంగా జనం చాలా పెద్ద ఎత్తున, జగన్మోహన్ రెడ్డి పర్యటనలకు వస్తున్నారు లాంటి ఒక కాన్ఫిడెన్స్ వైసీపి శ్రేణుల్లో ఉంది. సో భారీగా జనం తరలి రావడం చూస్తున్నాం, ఈ జనం రావడం కూడా ప్రభుత్వానికి కాస్త కంటగింపుగా కనపడుతుంది. ప్రభుత్వం జనం రాకుండా ఉండేందుకో, లేకపోతే పర్యటనలను అడ్డుకుండంలో భాగంగానో, రకరకాల ఆంక్షలు పెట్టడం కూడా చూస్తున్నాం. 10 మందితో వెళ్ళండి, 100 మందితో వెళ్ళండి, రెండు కార్లతో వెళ్ళండి, మూడు కార్లతో వెళ్ళండి, ఈ తరహా ఆంక్షల్ని ప్రభుత్వం విధిస్తూ రావడం కూడా చూస్తున్నాం. ఆంక్షల్ని బ్రేక్ చేస్తూ చాలా పెద్ద ఎత్తున జనం పర్యటనలో హాజరవ్వడం కూడా చూస్తున్నాం. పొదిలికి వెళ్ళిన సందర్భంగా ఇంతమంది జనాలని వేసుకొని ఎలా వెళ్తావు, వేల మందిని జనాలని వేసుకొని ఎందుకు వెళ్ళావు అంటూ చంద్రబాబు నాయుడు ప్రశ్నించారు. సత్తెనపల్లి వెళ్ళిన సందర్భంగా అంతమంది జనాలతో రోడ్ షోలు అవసరం ఏముంది, రోడ్ షో చేసుకుంటూ ఎందుకు వెళ్ళారంటూ ప్రశ్నించారు, సో కార్యకర్తలని తొక్కించుకుంటూ ఎందుకు వెళ్ళారు అంటూ ప్రశ్నించారు, ఇక చిత్తూరు జిల్లా పర్యటన సందర్భంగా అక్కడ రోహింగ్యాలు అక్కడికి వచ్చారంటూ క్యాంపెయిన్ చేశారు. రోహింగ్యాలతో అక్కడ 15 వేల మంది, 20 వేల మంది రోహింగ్యాలని అక్కడికి తీసుకొచ్చి క్యాంపెయిన్ చేశారంటూ ప్రచారం చేశారు. చాలా పెద్ద ఎత్తున వైసిపి శ్రేణులతో అక్కడికి వచ్చి వైసీపీ రైతులతో మీటింగ్ పెట్టారు అంటూ క్యాంపెయిన్ చేశారు. సో ఆ మూడు సందర్భాల్లో కూడా జనాలు వచ్చారనే విషయాన్ని తెలుగుదేశం పార్టీ ప్రభుత్వం, తెలుగుదేశం పార్టీ మీడియా అంగీకరించి ఆ జనాలు ఎవరు అనేది రాంగ్ పోట్రేట్‌ చేసే ప్రయత్నం చేసి, వైసీపీ రైతులని రోహింగ్యాలని 9 గంటలు రోడ్ షోలో ఏంటని ఈ తరహ క్యాంపెయిన్ చేస్తూ వచ్చాయి. తాజాగా నెల్లూరు పర్యటన సందర్భంగా ఒక కొత్త ఎజెండాని తీసుకొచ్చాయి. నెల్లూరు పర్యటన సందర్భంగా తీసుకొచ్చిన కొత్త ఎజెండా ఏంటి అంటే జగన్మోహన్ రెడ్డి పర్యటనలో అసలు జనాలు లేరని చెప్పడం, జగన్మోహన్ రెడ్డి పర్యటనకి జనాలే రావట్లేదు అని చెప్పడం, ఈ చెప్పడం గత మూడు జగన్మోహన్ రెడ్డి పర్యటనలో తెలుగుదేశం పార్టీ మీడియానే ప్రచారం చేసింది. ఈ అంశంపై సీనియర్ జర్నలిస్ట్ YNR విశ్లేషణ..!

ehatv

ehatv

Next Story