YNR Analysis: ఇండస్ట్రీ భయపడుతోందా..!

జూనియర్ ఎన్టీఆర్ తల్లి గురించి తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే మదమెక్కి మాట్లాడిన మాటలు చూశాం, ఆ మదమెక్కి మాట్లాడిన మాటలు తన మాటలు కాదు, తన మాటల్ని ఎవరో వక్రీకరించారు, మిమిక్రీ చేశారు అంటూ ఆయన బయటికవచ్చి ఆడిన డ్రామాలు చూశాం. ఆయన చేసింది డ్రామాలు, ఆయన ఆడింది నాటకాలు అని తెలుగుదేశం పార్టీ అధినేత ముఖ్యమంత్రి తేల్చేస్తున్నారు, తెలుగుదేశం పార్టీ నాయకత్వమే తేల్చేస్తుంది, సదరు ఎమ్మెల్యే ఏ వ్యక్తితో అయితే ఫోన్ కాల్ మాట్లాడారో, ఆ వ్యక్తి బయటిక వచ్చి ఎమ్మెల్యే నాతో మాట్లాడారు, ఎమ్మెల్యే ఇలా తిట్టారు, మా హీరోని తిట్టారు కాబట్టి, మా హీరో కుటుంబ సభ్యులని తిట్టారు కాబట్టి, కోపం వచ్చి నేనే రికార్డ్ చేసి ఆడియోని బయట పెట్టాను, అనే విషయాన్ని స్పష్టంగా చెప్పారు. చెప్పిన తర్వాత మూడు రోజులుగా ఎమ్మెల్యే ఎక్కడ అడ్రెస్ లేడు, కనపడట్లేదు, అంతకుముందు ఫేక్ వీడియో, ఫేక్ ఆడియో అని చెప్పిన వ్యక్తి, ఇప్పుడు ఎక్కడ ఉన్నాడో తెలియని పరిస్థితిలో ఉన్నారు, సో ఈ అంశానికి సంబంధించి రాజకీయ పరంగా తెలుగుదేశం పార్టీ, ప్రభుత్వం, కూటమి సర్కారు తప్పు చేసింది, కూటమి సర్కారు సరిగ్గా స్పందించలేదు, కూటమి సర్కారు వివక్ష పాటించింది, అనేది నేను చేస్తున్న ఆరోపణ కాదు, కూటమి సర్కార్ ప్రూవ్ చేసుకుంది. ఆ విషయాన్ని పక్కన పెడదాం ఇంతకుముందు చాలా వీడియోస్ లో చెప్పాను, మరో వీడియో కూడా దానికి సంబంధించి చేయబోతున్నాను, సో ఈ వీడియోలో నేను చెప్పదలుచుకుంది, ప్రభుత్వాలు, రాజకీయాలు పార్టీలు ఏవైనా కానీ ,జూనియర్ ఎన్టీఆర్ కి సంబంధించిన వార్‌-2 సినిమాని నేను ఇక్కడ ఆడనివ్వను, వాడెవడు మా నాయకుడు గురించి మాట్లాడడానికి, థియేటర్ ని తగలబెట్టేస్తాను, ఇంకా వాడి అమ్మ, అక్క అంటూ ఏదో ఏదో ఏదో మాట్లాడుతూ, వచ్చిన సదర్ ఎమ్మెల్యే వ్యాఖ్యలకు, సినిమా ఇండస్ట్రీ కనీసం స్పందించకపోతే ఎలా, సినిమా ఇండస్ట్రీకి సంబంధించిన ప్రముఖులు ఎవరూ, జూనియర్ ఎన్టీఆర్ కి సంఘీభావంగా, అండగా ఒక ట్వీట్ కూడా చేయలేని పరిస్థితిలో ఎందుకున్నారు? ఎందుకు భయపడుతున్నారు? ఇది కేవలం, సినిమాకి సంబంధించిన అంశమే కదా, ఓ వ్యక్తి పైన కోపం ఉంటే, ఓ వ్యక్తి ఏదో మాట్లాడితే, ఆ మాటల పట్ల కోపం వస్తే, ఆయన సినిమాలు ఆడనివ్వరా, ఓ నియోజక వర్గంలో సినిమా నడవాలంటే, ఎమ్మెల్యే పర్మిషన్ కావాలా, ఎమ్మెల్యేలు సామంత రాజులా, ఎమ్మెల్యేల దయా దాక్షిణ్యాల పైన సినిమాలు నిర్మించాల్సిన పరిస్థితి ఉంటుందా, ఎమ్మెల్యేల దయా దాక్షిణ్యాల పైన సినిమాలు నడపాల్సిన అవసరం ఉంటుందా, ఎమ్మెల్యేకు కోపం వస్తే సినిమాలు నడిచే పరిస్థితి ఉండదా, థియేటర్లు తగలబడతాయా, ఈ రకమైన వ్యాఖ్యలు ఒక ఎమ్మెల్యే, ఒక అధికార పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యే, సినిమా రంగం పైన చేస్తే, ఓ హీరో కుటుంబం పైన చేస్తే, ఓ హీరో మాతృమూర్తి పైన చేస్తే ,సినిమా ఇండస్ట్రీ కి సంబంధించిన ఫెర్టినిటీ నుంచి ఒక్కరు కూడా స్పందించకపోవడం ఆశ్చర్యం.ఇదే అంశంపై సీనియర్ జర్నలిస్ట్ 'YNR' విశ్లేషణ..

ehatv

ehatv

Next Story