YNR analysis: ఈసీ, బీజేపీ వీటికి ఆన్సర్ చెప్పరా.. జర్నలిస్ట్ 'YNR' సూటి ప్రశ్న..!
YNR analysis: ఈసీ, బీజేపీ వీటికి ఆన్సర్ చెప్పరా.. జర్నలిస్ట్ 'YNR' సూటి ప్రశ్న..!

ఎలక్షన్ కమిషన్‌పైన నాకు చాలా అనుమానాలు ఉన్నాయి, ఎలక్షన్ కమిషన్ వ్యవహార శైలి పైన నాకు చాలా అభ్యంతరాలు ఉన్నాయి, కంటిన్యూస్‌గా జర్నలిస్ట్ వైఎన్ఆర్ ఛానల్ ద్వారా ఎలక్షన్ కమిషన్ చేస్తున్న తప్పులని మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం ఎందుకు చేస్తున్నాను అంటే, ఓ పార్టీ కోసమో, పార్టీల ప్రయోజనాల కోసమో లేకపోతే ఇంకే దేని కోసం కాదు, ప్రజాస్వామ్యం కోసం. ఈ నేపథ్యంలోనే కొన్ని ప్రశ్నలు మీ ముందు ఉంచదలుచుకున్నా.. ఎలక్షన్ కమిషన్‌ని, భారతీయ జనతా పార్టీని అడగదలుచుకున్నాను. ఇంతకుముందు చాలా వీడియోస్ లో చెప్పిన అంశాలే, ఈ సందర్భంలో ఎలక్షన్ కమిషన్ కి సంబంధించి చర్చ దేశవ్యాప్తంగా జరుగుతున్న నేపథ్యంలో, మరోసారి వాటిని మీ ముందు ఉంచదలుచుకున్నాను. ఎలక్షన్ కమిషన్ రాహుల్ గాంధీ చేస్తున్న ఆరోపణలకు సంబంధించి ప్రాపర్‌గా ఇప్పటివరకు రెస్పాండ్ అవ్వలేదు. రాహుల్ గాంధీ పైన చర్యలు తీసుకుంటాం, కేసులు పెడతాం, నోటీసులు ఇస్తామని మాట్లాడుతాం తప్ప, రాహుల్ గాంధీ రైజ్ చేసిన ప్రశ్నలకు ఆన్సర్ చేయలేదు, సరే రాహుల్ గాంధీ తాజాగా రైజ్ చేసిన ప్రశ్న బెంగళూరు సెంట్రల్ పార్లమెంట్ నియోజక వర్గం, మహదేవపుర అసెంబ్లీ నియోజక వర్గం. అక్కడ లక్ష ఓట్లు అడిషనల్ గా జాయిన్ అవ్వడం, ఆ నియోజక వర్గంలో లక్ష ఓట్లు భారతీయ జనతా పార్టీకి మెజారిటీ రావడం, ఆ లక్ష ఓట్లు ఉన్న నియోజక వర్గంలో జీరో నెంబర్ తో ఉన్న ఇంటి పేరుతో వందల వేల ఓట్లు ఉండడం, సో ఒకే బెడ్రూమ్ ఉన్న ఇంట్లో 200 మంది, 300 మంది ఓటు హక్కు నమోదు చేసుకొని ఉండడం, ఒకే వ్యక్తికి నాలుగు నుంచి ఐదు ఓట్లు అదే నియోజక వర్గంలో ఉండడం, ఇలా రకరకాల ఇష్యూస్ ని ఆయన రైజ్ చేశారు. ఏ ఒక్క దానికి ఎలక్షన్ కమిషన్ ఆన్సర్ చెప్పలేదు. ఇవి రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలు గానే చూద్దాం, రాహుల్ గాంధీ చేసిన ప్రతి ఆరోపణ కూడా ఎలక్షన్ కమిషన్ ప్రింటెడ్ గా ఇచ్చిన డేటాని బేస్ చేసుకొని వచ్చిన ఆరోపణే. రాహుల్ గాంధీ చేసిన ఆరోపణలని పక్కన పెట్టేద్దాం, ఎలక్షన్ కమిషన్ ఆన్సర్ చేయాల్సిన అంశం ఏంటంటే, మహారాష్ట్ర ఎన్నికల సందర్భంగా, ఆ మాటక వస్తే 2024 సార్వత్రిక ఎన్నికల సందర్భంగా, దేశవ్యాప్తంగా అనేక పార్లమెంట్ నియోజక వర్గాలలో, పోలైన ఓట్ల కంటే కౌంట్ అయిన ఓట్లు చాలా ఎక్కువగా ఉన్నాయి. ఇది ఎలక్షన్ కమిషన్ వెబ్‌సైట్ చెప్తోంది. ఎలక్షన్ కమిషన్ వెబ్‌సైట్‌లో పోలింగ్ ముగిసిన తర్వాత ఎన్ని ఓట్లు పోలయ్యాయి అని మీరు చెప్పారో , కౌంటింగ్ సమయానికి దానికంటే ఎక్కువ ఓట్లు కనబడుతున్నాయి, మీరే అదే విషయాన్ని ఎలక్షన్ కమిషన్ వెబ్‌సైట్‌లోనే పెట్టారు.
సో పోలింగ్ రోజు ఉన్న ఓట్ల కంటే, కౌంటింగ్ రోజు ఓట్లు ఎలా పెరిగాయి అనే విషయాన్ని ఎలక్షన్ కమిషన్ రాష్ట్ర ప్రజలకు, దేశ ప్రజలకు సమాధానం చెప్పండి. ఇది మీ పై చేస్తున్న అలిగేషన్ కాదు. దేశ ప్రజల తరపున అడుగుతున్న ప్రశ్న, దేశ ప్రజలకు ఉన్న అనుమానం. నేషన్ వాంట్స్ టు నో..ఈ అంశంపై సీనియర్ జర్నలిస్ట్ 'YNR' విశ్లేషణ..
