తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు(Local elections) రంగం సిద్ధమయ్యింది.

తెలంగాణలో స్థానిక సంస్థల ఎన్నికలకు(Local elections) రంగం సిద్ధమయ్యింది. తెలంగాణలో 2019లో స్థానిక సంస్థలకు ఎన్నికలు జరిగాయి. షెడ్యూల్ ప్రకారం ఈ ఏడాదిలో ఎన్నికలు జరగాల్సి ఉంది. కాంగ్రెస్‌(congres) ప్రభుత్వం ఎన్నికలను నిర్వహించడానికి కసరత్తులు చేస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికలలో రిజర్వేషన్ల అంశంపై వివాదం ఉంది. బీసీ రిజర్వేషన్లకు(BC reservations) సంబంధించి బీసీ సంఘాలు ఆందోళన చేస్తూ వున్నాయి. ఈ అంశంపై ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో ఇంకా క్లారిటీ రాలేదు. అయినప్పటికీ ఆగస్టు 15 తర్వాత ఏ క్షణంలోనైనా స్థానిక ఎన్నికలు జరగవచ్చు అని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి(revanth reddy) ప్రకటించారు. ఆగస్టు 15వ తేదీలోపు రుణమాఫీ చేస్తానని ప్రకటించిన నేపథ్యంలో ఆగస్టు 15లోపు రెండు లక్షల రూపాయలలోపు రుణమాఫీ చేయాలని ప్రభుత్వం అనుకుంటోంది. ఈ మేరకు క్యాబినెట్ నిర్ణయం కూడా అయిపోయింది, రుణమాఫీ చేసిన తర్వాత స్థానిక సంస్థల ఎన్నికలకు వెళ్లాలన్నది ప్రభుత్వం ఆలోచన. జడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్‌ స్థానాలకు ఎన్నికలు ఆగస్టు తర్వాత ఉండబోతున్నాయి.

Eha Tv

Eha Tv

Next Story