Balakrishna & Chiranjeevi Controversy : బాలయ్యది తప్పు! పవన్ ది ఒప్పా?
ఏపీ అసెంబ్లీలో ఎమ్మెల్యే బాలకృష్ణ మాట్లాడిన మాటలకు సంబంధించిన ధుమారం చూస్తున్నాం.

ఏపీ అసెంబ్లీలో ఎమ్మెల్యే బాలకృష్ణ మాట్లాడిన మాటలకు సంబంధించిన ధుమారం చూస్తున్నాం. రాజకీయంగా బాలకృష్ణ మాట్లాడిన మాటలు చాలామంది యక్సెప్ట్ చేసేవి కాదు, ఎవరు యక్సెప్ట్ చేయకూడదు కూడా, ఆయన మాట్లాడిన భాష ఏమాత్రం ఆమోద యోగ్యంగా లేదు. ఎవరు అంగీకరించారా, లేదు గతంలో ఈ తరహ భాష మాట్లాడిన వైసీపీ నాయకులను చాలామంది విమర్శించారు. ప్రజలు కూడా అసహ్యించుకున్నారు అటువంటి భాష మాట్లాడిన వాళ్ళని, ఇప్పుడు అదే తరహ భాష బాలకృష్ణ అసెంబ్లీలో మాట్లాడారు. కానీ గతంలో ఇలాంటి భాష మాట్లాడటం తప్పు అని మాట్లాడిన కూటమి పార్టీలకు సంబంధించిన నేతలు, అసెంబ్లీలో కూర్చొని నవ్వుకుంటున్నారు. ఈ భాష చూసి చాలా అద్భుతంగా మాట్లాడారు అన్నట్టుగా బిహేవ్ చేస్తున్నారు.
ఆ భాష. అవన్నీ పక్కన పెడితే. బాలకృష్ణ చెప్పింది జగన్మోహన్ రెడ్డి సినిమా వాళ్ళతో సమావేశం అయిన సందర్భంగా. చిరంజీవి ఇన్సిస్ట్ చేయడం వల్ల జగన్మోహన్ రెడ్డి కలవలేదు, చిరంజీవి ఏమి బలవంతంగా ఫోర్స్ చేయడం వల్ల జగన్మోహన్ రెడ్డి ఏం కలవలేదు, చిరంజీవి అలా బలవంత పెట్టడం వల్ల జగన్మోహన్ రెడ్డి కలిశారంటూ కామినేని శ్రీనివాస్ చెప్పింది అబద్ధం, ఎవడు బలవంతం చేయలేదని చిరంజీవిని ఉద్దేశించి ఆయన మాట్లాడారు. సో సినిమా వాళ్ళక అవమానం జరిగిన మాట నిజమేనంటూ కూడా చెప్పుకొచ్చారు. జగన్మోహన్ రెడ్డిని వ్యక్తిగతంగా ఓ మాట కూడా అన్నారు ఆయన. ఇక్కడ ఈ ఎపిసోడ్ గడిచిన ఎన్నికల కంటే ముందు చాలా పెద్ద రాద్దాంతాన్ని ఆంధ్రప్రదేశ్ లో క్రియేట్ చేసింది.
సినిమా వాళ్ళని జగన్మోహన్ రెడ్డి అవమానించాడు అని, సినిమా వాళ్ళని జగన్మోహన్ రెడ్డి అవమానించాడు అనే మాట జనసేన అధినేత పవన్ కళ్యాణ్ బహిరంగ సభల్లో కూడా మాట్లాడారు. మీ దగ్గరికి వచ్చి వంగి వంగి నమస్కారాలు పెట్టాలా, అలా నమస్కారాలు పెట్టించుకుంటారా అంటూ ఆయన మాట్లాడారు. చిరంజీవి జగన్మోహన్ రెడ్డికి నమస్కారం చేయడాన్ని ఉద్దేశించి పవన్ కళ్యాణ్ మాటలు మాట్లాడారు, సో బాలకృష్ణ చిరంజీవి వల్ల ఆ మీటింగ్ జరగలేదు, చిరంజీవి బ్రతిమాలడం వల్ల జరగలేదు అని అనగానే చిరంజీవి కౌంటర్ ఇచ్చారు. చిరంజీవి కౌంటర్ ఇచ్చారు అనదానికంటే, ఒక వివరణ ఇచ్చారు.
చిరంజీవి ఇచ్చిన వివరణ ఏంటి అంటే నేను అప్పటి మంత్రి పేర్ని నానికి ఫోన్ చేశాను, పేర్ని నాని జగన్మోహన్ రెడ్డి గారితో అపాయింట్మెంట్ ఫిక్స్ చేశారు, నేను కుటుంబంతో వెళ్లి కలిశాను సాదరంగా ఆహ్వానించారు, భోజనం పెట్టారు, ఆ సమయంలో సినిమా వాళ్ళకి సంబంధించిన సమస్యలు మాట్లాడుకున్నాం, వచ్చేశాం, ఆ తర్వాత కొంతమంది సినిమా ప్రముఖులు వచ్చి టికెట్ల రేట్లు పెంచుకుందాం, ఏపీ సీఎంని కలవండి అని నన్ను అడిగారు, నేను ఆ విషయాన్ని ఆంధ్రప్రదేశ్ మంత్రి పేర్ని నాని దృష్టికి తీసుకెళ్ళాను, పేర్ని నాని ముఖ్యమంత్రితో మాట్లాడి ఓకే అని, ఐదుగురు కలవడానికి సమయం ఇచ్చారు. ఐదుగురు వచ్చి కలవండి అని చెప్పారు, కరోనా నిబంధనలు ఉన్నాయి కాబట్టి అని, లేదు ఐదుగురు అంటే రాలేం 10 మంది వస్తామని నేను రిక్వెస్ట్ చేసి, 10 మందితో అక్కడికి వెళ్ళాం, కలిసాం, కూర్చున్నాం, మాట్లాడాం, టికెట్ల ధరలు పెంచుకుంటాం అని చెప్పాం, ఆయన ఓకే అన్నారు. జీవో ఇచ్చారు ఆ తర్వాత వాల్తేరి వీరయ్యకి, వీరసింహారెడ్డి సినిమాకి టికెట్ల ధరలు పెరిగాయి. ఈ అంశంపై సీనియర్ జర్నలిస్ట్ 'YNR' విశ్లేషణ..
